breaking news
-
Kaviya Maran: వేలకోట్లకు ఏకైక వారసురాలు.. కావ్యా మారన్ గురించి ఈ విషయాలు తెలుసా? (ఫోటోలు)
-
నేను మంచి తల్లినా కాదా?! మామాఎర్త్ సీఈఓ పోస్టు వైరల్
ఒకప్పుడు ఆడవాళ్లంటే వంటింటికే పరిమితం అయ్యేవారు. అరకొర చదువులు చదివించి.. చిన్న వయసులోనే పెళ్లి చేసి అత్తరింటికి పంపిచేశారు. అమ్మాయిలకు పెద్ద చదువులు చెప్పించడం, ఉద్యోగాలకు పంపడం అన్న మాటే లేదు. కానీ రోజులు, పరిస్థితులు మారాయి. నేటి కాలంలో మగవారితో సమానంగా చదువుతున్నారు అమ్మాయి. ఇటు ఉద్యోగాలు కూడా చేస్తూ తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు పెళ్లి అయ్యాక ఓ వైపు ఇంటిని చూసుకుంటూ మరోవైపు ఉద్యోగం చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే కొన్నిసార్లు వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతలను రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. సగటు వర్కింగ్ విమెన్‌కు ఉండే సవాళ్లు తాజాగా బ్యూటీ బ్రాండ్ మామాఎర్త్ సహ-వ్యవస్థాపకురాలు, సీఈఓ గజల్ అలఘ్కు కూడా ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ భావోద్వేగ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది. గజల్ తన కొడుకును తొలిరోజు పాఠశాలకు తీసుకెళ్లాలని అనుకుంది. కానీ తనకున్న పనుల వల్ల అది సాధ్యపదడలేదు. దీంతో ఆమె ఎంతో బాధపడిపోయింది. కుమారుడితో కలిసి మొదటి రోజు పాఠశాలకు వెళ్లకపోడంతో ‘నేను చెడ్డ తల్లినా?’ అనే ప్రశ్న తన మదిలో మెదిలినట్లు చెప్పుకొచ్చింది. చివరికి తన కొడుకును వాళ్ల నానమ్మతో స్కూల్‌కు పంపినట్లు పేర్కొంది. ‘నా కుమారుడిని తొలి రోజు పాఠశాలకు తీసుకెళ్లడానికి కుదర్లేదు. అప్పుడు ను మంచి తల్లిని కాదా? అనే ప్రశ్న నా మదిలో మెదిలింది. ఆ సమయంలో చాలా ఏడ్చా. బాధ పడ్డా. ధైర్యం తెచ్చుకొని వాళ్ల నాన్నమ్మతో స్కూల్‌కి పంపించా. మీరు ఎంత కోరుకున్నా కొన్నిసార్లు సెలవు తీసుకోవడం కుదదు. అది ఎంత విలువైనది అయినా సరే. అలా మొదటిరోజు స్కూల్‌కు వెళ్లేందుకు కుమారుడు చూపిన ఉత్సాహం, చిరునవ్వు, కన్నీళ్లు, పాఠశాల్లో అడుగు పెట్టగానే ఉపాధ్యాయులు, పిల్లల్ని చూసి కలిగే ఆందోళన.. ఇవన్నీ చూడలేకపోయా’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. అదేవిధంగా తన కుటుంబ సపోర్ట్‌ను కూడా అలఘ్ ఈ పోస్టులో వివరించారు. నేను, వరుణ్ అలగ్, కుమారుడు అగస్త్య, మా అత్త ఐదేళ్ల కిత్రం ఉమ్మడి కుటుంబంలో ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు నాలుగుతరాల వాళ్లంతా ఒకే ఇంట్లోనే ఉంటున్నాం. ఉద్యోగం చేస్తున్న ప్రతిఒక్కరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. సొంతవాళ్లే కావాలనేం లేదు. దగ్గరి బంధువులు, అర్థం చేసుకునే స్నేహితులున్నా పర్లేదు. అయితే, ప్రతీ విషయంలోనూ లాభాలు, నష్టాలు ఉంటాయి. అయినప్పటికీ ఉమ్మడి కుటుంబం అనేది పిల్లలకు అద్భుతమైన వాతావరణం. తల్లులు కెరీర్ లక్ష్యాలను పక్కనపెట్టకుండా.. ప్రేమ, రక్షణ అందించే ప్రదేశం’ అంటూ సుదీర్ఘ మైన పోస్ట్ రాసుకొచ్చారు. -
దేశ ఐటీ రంగంలో టాప్.. అత్యధిక వేతనం ఈయనదే..
దేశ ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ సింగిశెట్టి నిలిచారు. ‘మింట్’ నివేదిక ప్రకారం.. కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ గత సంవత్సరం వేతన పరిహారంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకున్నారు. కంపెనీ ఫైలింగ్ ప్రకారం, రవి కుమార్ సింగిశెట్టి గత సంవత్సరం మొత్తంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకోగా ఇందులో 20.25 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.169.1 కోట్లు) విలువైన షేర్లను అందుకున్నారు. గత ఏడాది కాగ్నిజెంట్ ఆదాయం రూ.19.35 బిలియన్ డాలర్లు ఉండగా ఇందులో సీఈవో రవి కుమార్ వేతన పరిహారం 0.11 శాతంగా ఉంది. ఇతర ఐటీ సీఈవోల వేతనాలు ఇలా.. విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే రూ. 10.1 మిలియన్ డాలర్లు (రూ. 83 కోట్లు) హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో విజయకుమార్ 10.65 మిలియన్ డాలర్లు (రూ. 88 కోట్లు) అసెంచర్ సీఈవో జూలీ స్వీట్ 31.55 మిలియన్ డాలర్లు (రూ.263 కోట్లు) ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 6.8 మిలియన్లు ( రూ. 56.4 కోట్లు) టీసీఎస్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ 3.5 మిలియన్ ( రూ. 29.16 కోట్లు) -
దిగిపోనున్న బోయింగ్ సీఈవోకి రూ.366 కోట్లు!
బోయింగ్ సీఈవో డేవిడ్ కాల్హౌన్ భారీ మొత్తంలో రిటైర్మెంట్ చెల్లింపులు పొందనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పదవి నుంచి వైదొలగనున్న ఆయన రిటైర్మెంట్ చెల్లింపుల కింద 44 మిలియన్ డాలర్లు (సుమారు రూ.366 కోట్లు) అందుకునే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదించింది. డేవిడ్ కాల్హౌన్ 2023 సంవత్సరానికి 33 మిలియన్ డాలర్ల (సుమారు రూ.274 కోట్లు) వేతన పరిహారాన్ని అందుకున్నారు. దాదాపుగా అదంతా స్టాక్ అవార్డ్స్‌లో ఉంది. అయితే జనవరిలో గాల్లో ఉన్న బోయింగ్ విమానం డోర్ ప్యానెల్ ఊడిపడిన ఘటన తర్వాత బోయింగ్ షేర్ ధర తగ్గిపోయింది. దీంతో ఈ సంవత్సరం ఆయన స్టాక్ చెల్లింపు దాదాపు నాలుగింట ఒక వంతు తగ్గుతుంది. ఈ ఘటన తర్వాత 2023 సంవత్సరానికి సీఈవో డేవిడ్ కాల్హౌన్ బోనస్‌ను (దాదాపు రూ.24 కోట్లు) తిరస్కరించినట్లు కంపెనీ తెలిపింది. ఘటనకు సంబంధించి బోయింగ్ దాని తయారీ నాణ్యత, భద్రతపై పలు విచారణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ సంవత్సరం చివరిలో తాను పదవి నుంచి వైదొలుగుతానని కాల్హౌన్ ఈ నెలలో ప్రకటించారు. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కాల్హౌన్ గత సంవత్సరం 1.4 మిలియన్ డాలర్ల జీతం, 30.2 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులను పొందినట్లు పేర్కొంది. ఇతర చెల్లింపులతో సహా కాల్హౌన్ 2023 పరిహారం మొత్తం 32.8 మిలియన్ డాలర్లు. కాగా 2022లో ఆయన 22.6 మిలియన్ డాలర్ల పరిహారం అందుకున్నారు. -
థియరీ డెలాపోర్టే రాజీనామా, విప్రో కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా
ప్రముఖ టెక్ దిగ్గజం విప్రోలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విప్రో సీఈఓ థియరీ డెలాపోర్టే రాజీనామా చేశారు. ఆయన స్థానంలోశ్రీనివాస్ పల్లియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఏప్రిల్ 6న థియరీ డెలాపోర్టే తన పదవికి రాజీనామా చేసినట్లు విప్రో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తెలిపారు. మే 31,2024 వరకు ఆయన పదవిలోనే కొనసాగుతారని విప్రో తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రస్తుతం అమెరికాస్ 1 ఏరియా సీఈఓగా ఉన్న శ్రీనివాస్ పల్లియా ఏప్రిల్ 7 నుంచి విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో సీఈఓ పదవికి రాజీనామా చేసిన డెలాపోర్టే జూలై 2020లో విప్రో సీఈఓగా, ఎండీగా నియమితులయ్యారు. అంతకు ముందు క్యాప్‌జెమినీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా పనిచేశారు. విప్రో సీఈఓ జీతం ఎంత? గత డిసెంబరులో, డెలాపోర్టే సంవత్సరానికి రూ. 82 కోట్లకు పైగా జీతం ప్యాకేజీని అందించినట్లు విప్రో నివేదించింది. తద్వారా డెలాపోర్టే భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా పేరు సంపాదించారు. డెలాపోర్టే సైన్సెస్పో ప్యారిస్ నుండి ఆర్థిక, ఫైనాన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని, సోర్బోన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ లాస్‌ను పూర్తి చేశారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019