breaking news
-
సెలబ్రిటీ శారీ డ్రేపర్: ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా..!
సెలబ్రిటీలకు స్టయిల్ని అద్ది.. వాళ్లను ఫ్యాషన్ స్టార్స్‌గా తీర్చిదిద్దే స్టయిలిస్ట్‌లు ఉంటారు. ముఖ్యంగా చీర కట్టు అనేది ఎప్పటికీ స్పెషల్. దీన్ని ప్రోషెషన్గా ఎంచుకుని సినీ సెలబ్రిటీలకు కట్టే స్థాయికి వెళ్లింది స్టార్ స్టయిలిస్ట్ డాలీ జైన్. ఆమె ఎలా శారీ డ్రేపర్‌గా మారిందో తెలుసుకుందామా..! ‘ఆరు గజాల ప్రతి చీరా నాకు 360 రకాల కట్టుతీరుల్ని, కుచ్చిళ్లను పరిచయం చేస్తున్నట్టనిపిస్తుంది’ అంటుందీ చీరకట్టు స్పెషలిస్ట్. దీపికా పదుకోణ్, ఆలియా భట్, ప్రియంకా చోప్రా, కరిష్మా కపూర్, సోనమ్ కపూర్, నీతా అంబానీ, ఈషా అంబానీ, శ్లోకా అంబానీ, రవీనా టండన్ వంటి సెలబ్రిటీలందరూ ఏ చిన్న ఫంక్షన్‌కి అటెండ్ కావాలన్నా డాలీ జైన్‌కి కబురు పెడతారు. ఆమె చేత చీర కట్టించుకుంటారు. అంతలా చీరకట్టును ఓ ప్రొఫెషన్ స్థాయికి తీసుకెళ్లిన డాలీ.. పెళ్లయిన కొత్తలో చీరంటే యమ చిరాకు పడేదట. బెంగళూరులో పుట్టిపెరిగిన ఆమె పెళ్లయ్యే వరకు జీన్స్.. టీ షర్ట్స్, కుర్తీలే ధరించేది. కానీ అత్తారింట్లో క్యాజువల్ వేర్ నుంచి అకేషనల్ వేర్ దాకా అన్నిటికీ చీరే మస్ట్ అని ఆమె సాసుమా ఆర్డర్ పాస్ చేశారు. తప్పక చీరకట్టుతో కుస్తీపట్టడం మొదలుపెట్టింది డాలీ. రోజూ ముప్పావు గంట పట్టేదట చీర కట్టుకునేసరికి. ఇప్పుడు రికార్డ్ రేంజ్లో 18.5 సెకన్లలో కట్టేస్తుంది.. కట్టిస్తుంది. ప్రొఫెషన్‌గా ఎలా మారింది? కారణం సినీతార శ్రీదేవే అనే ఆన్సర్ ఇస్తుంది డాలీ. చీరే కట్టుకోవాలి అని రూల్ పెట్టిన అత్తగారు.. కోడలు పడుతున్న అవస్థ చూసి జాలిపడి ‘కుర్తీలు వేసుకో’ అంటూ నియమాన్ని సడలించింది. అయితే అప్పటికే డాలీకి చీర మీద మోజు మొదలైంది. సో.. చీరనే కంటిన్యూ చేసింది. ఇంట్లో.. ఇరుగుపొరుగు.. బంధువుల్లో ఏ శుభకార్యం జరిగినా చీరకట్టడంలో అతివలకు సాయపడటమూ స్టార్ట్ చేసింది. అలాంటి ఒక సందర్భంలో ఆమె మేనమామ ఒక పార్టీ ఇచ్చాడు. అతను సినీతార శ్రీదేవి ఉండే అపార్ట్మెంట్లోనే ఉండేవాడట. అందుకని శ్రీదేవినీ ఆహ్వానించాడు. డాలీ కూడా వెళ్లింది. పార్టీలో శ్రీదేవి చీర మీద జ్యూస్ ఒలికిందట. ఆమె ఇబ్బందిపడుతుంటే డాలీ చొరవ తీసుకుని గబగబా మేనమామ భార్య చీరొకటి తెచ్చి.. శ్రీదేవికి ఇచ్చిందట. అంతేకాదు ఆమె చీరకట్టుకుంటూంటే.. కుచ్చిళ్లు పెట్టడంలో.. పల్లూ సెట్ చేయడంలో సహాయపడిందట కూడా. డాలీ చీరకట్టే నేర్పరితనానికి శ్రీదేవి అబ్బురపడుతూ ‘ఇన్నేళ్లుగా చీర కట్టుకుంటున్నాను.. ఇంతబాగా కుదిరిందిలేదెప్పుడూ! దీన్ని ఒక ప్రొఫెషన్‌గా తీసుకోవచ్చుగా?’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చిందట. ఆలస్యం లేకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇదిగో ఇలా ఫేమస్ అయింది డాలీ. వందల్లోంచి లక్షల్లోకి... దాదాపు 20 ఏళ్లుగా శారీ డ్రేపర్ ప్రొఫెషన్లో కొనసాగుతూన్న డాలీ జైన్.. తొలి పారితోషికం రూ. 250. ఇప్పుడు 2 లక్షల రూపాయల వరకు చార్జ్ చేస్తుంది. ఆమె దగ్గర 20 మంది సభ్యులతో కూడిన టీమ్ ఉంటుంది. చీరనే కాదు.. హాఫ్ శారీ, దుపట్టా.. ఇలా అన్నిటినీ సెట్ చేస్తుంది. ఈ స్టయిలింగ్‌లో ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీలేం లేవు ఆమెకు. కేవలం చీర కట్టు మీద తనకున్న మమకారం.. సృజనతోనే ఈ స్థాయికి ఎదిగింది. తనలాంటి గృహిణులు ఎందరికో స్ఫూర్తిని పంచుతోంది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ? డాలీ జైన్ టాలెంట్ ఫ్యాషన్ డిజైన్ సందీప్ ఖోస్లా దృష్టిలో పడింది. నీతా అంబానీ 50 వ పుట్టిన రోజు ఫంక్షన్లో ఆమెకు చీర కట్టేందుకు డాలీని రికమెండ్ చేశాడు అతను. ఆ వేడుకలో మరెందరో సెలబ్రిటీల దృష్టిలోపడి బాలీవుడ్ ప్రవేశాన్ని సాధించింది. ఆమె ఫస్ట్ బాలీవుడ్ సెలబ్రిటీ వేడుక.. సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ వెడ్డింగ్. అక్కణ్ణించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఎందరికో డాలీ ఫేవరేట్ శారీ డ్రేపర్ అయిపోయింది. -
Naila Grewal: నా యాక్టింగ్‌కి 'టెలివిజనే' నాకు ప్రేరణ!
నైలా గ్రేవాల్.. హిందీ నటి. ఇప్పుడు ఓటీటీ స్టార్ కూడా! బయటెంత ఫాలోయింగ్ ఉందో.. అంతకంటే ఎక్కువ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకు. ఇంకొన్ని వివరాల్లోకి వెళితే.. నైలా పుట్టి,పెరిగింది ఢిల్లీలో. మాస్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. డాన్స్ నేర్చుకుంది. థియేటర్ స్కిల్స్ కూడా ఒంటబట్టించుకుంది. ముందు మోడలింగ్ వైపే అడుగులేసింది. కానీ ఆసక్తి అంతా యాక్టింగ్ మీదే ఉండింది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా డాన్స్ బాలేలు చేస్తూ.. థియేటర్లో నటిస్తూ నటనా ప్రతిభను మెరుగుపరచుకునేది. అలాంటి ఒకానొక సందర్భంలోనే బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ నుంచి ఒక కబురు‡ వచ్చింది.. తను తీయబోయే ‘తమాషా’ సినిమాలో నైలాకు వేషం ఇస్తున్నట్టు. అది విన్న ఆమె సంతోషానికి అవధుల్లేవు. సెట్స్ మీదకు వెళ్లినప్పుడైతే కలా.. నిజమా అనుకుందట. మొదటి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అవకాశాలనూ అందిపుచ్చుకుంది. ‘బరేలీ కీ బర్ఫీ’, ‘భాంగ్డా పా లే’, ‘థప్పడ్’లలో నటించింది. ‘ఇష్క్ విష్క్ రిబౌండ్’లో నటిస్తోంది. తాజాగా ‘మామ్లా లీగల్ హై’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నైలా లండన్‌లో లా చదివి.. ఢిల్లీలో వకీల్గిరీ ప్రారంభించిన లాయర్‌గా నటించింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఆమె నటనకే కాదు ఆమె అందానికి.. ఫ్యాషన్ స్టయిల్‌కి.. డాన్స్కీ అభిమానగణం ఉంది. అంతేకాదు ఆరోగ్యకరమైన జీవన శైలికి ఆమెను స్ఫూర్తిగా తీసుకునే అభిమానులూ ఉన్నారు. సినిమానైనా.. సీరియల్‌నైనా.. ఆ మాటకొస్తే కదిలే బొమ్మను ఫస్ట్ నేను చూసింది టెలివిజన్‌లోనే. అందుకే యాక్టింగ్‌కి టెలివిజనే నాకు ప్రేరణ, స్ఫూర్తి. సిల్వర్‌స్క్రీన్, స్మాల్‌స్క్రీన్, వెబ్‌స్క్రీన్.. ఏ స్క్రీన్ అయినా యాక్టర్స్‌కి ఒకటే. రీచింగ్‌లో తేడా తప్ప దేనికైనా టాలెంటే కొలమానం! - నైలా గ్రేవాల్. ఇవి చదవండి: లియాండర్ పేస్... ప్రముఖ డ్యాన్సర్! -
Priyamani: ప్రియ 'నటీమణి'.. పెర్ఫార్మెన్స్కి పర్యాయపదం ఆమె!
'ప్రస్తుతం కమ్‌బ్యాక్ హీరోయిన్స్ హవా నడుస్తోంది. ఆ లిస్ట్‌లో ప్రియమణి మస్ట్! గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్కి పర్యాయపదం ఆమె! సినీప్రియులు.. వెబ్ వీక్షకులకు సుపరిచితురాలు. కథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు వెబ్‌స్క్రీన్ మీదా షైనింగ్ స్టారే! ప్రియమణి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి బ్రీఫ్‌గా..' ప్రియమణి అసలు పేరు ప్రియా వాసుదేవన్ మణి అయ్యర్. అమె తండ్రి వాసుదేవన్ మణి అయ్యర్ .. బిజినెస్‌మేన్, తల్లి లతా మణి అయ్యర్.. జాతీయ స్థాయి మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. చదువుకునే రోజుల్లోనే ప్రియమణి పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ మోడల్‌గా మారింది. అలా ఆమె తమిళ దర్శకుడు భారతీరాజా దృష్టిలో పడింది. చిత్రసీమకు పరిచయం అయింది. ఆమె కెరీర్ తమిళ చిత్రం ‘కంగలాల్ కైదు సెయి’ తో ప్రారంభమైనప్పటికీ, మొదట విడుదలైంది మాత్రం ‘ఎవరే అతగాడు’ అనే తెలుగు సినిమానే. ఆ తర్వాత ‘సత్యం’ సినిమాతో మలయాళంలోనూ అడుగుపెట్టింది. చేసిన సినిమాలన్నీ విజయవంతమవడంతో టైట్ స్కెడ్యూల్స్తో బిజీ అయిపోయింది. ‘యమదొంగ’ , ‘శంభో శివ శంభో’, ‘రక్త చరిత్ర 2’, ‘రగడ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటే ‘క్షేత్రం’, ‘చారులత’ వంటి చిత్రాలతో నటిగా నిరూపించుకుంది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో షారుఖ్ ఖాన్‌తో ఒక పాటలో నటించి బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్‌ని పెళ్లి చేసుకుంది. సినిమాల నుంచి కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. తిరిగి రియాల్టీ షోస్, వెబ్ సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకులకు దగ్గరైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో దేశ వ్యాప్తంగా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచిన సిరీస్ ‘ద ఫ్యామిలీ మేన్’. ఆమె నటించిన వెబ్ మూవీస్ ‘భామా కలాపం’, ‘భామా కలాపం 2’ రెండూ ఆహాలో స్ట్రీమింగ్‌లో ఉన్నాయి. పెళ్లి తరువాత నటనకు దూరంగా ఉండాలన్న ఆలోచన నాకు లేదు. భార్య వంటింటికే పరిమితమనే మనస్తత్వం నా భర్తకు లేదు. నన్ను చాలా సపోర్ట్ చేస్తారాయన! – ప్రియమణి. ఇవి చదవండి: Sharmila Yadav: డ్రోన్ దీదీ -
ప్రాణ ప్రతిష్ట వేళ సెలబ్రెటీలు ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..!
అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలరాముడిగా కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువులరు సెలబ్రెటీలకు, ప్రముఖులకు ఆహ్వానం అందింది. అయితే వారంతా ఈ ఈవెంట్‌కి వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ టీవీల్లో ఫుల్ మేకప్‌తో ట్రెండీ దుస్తులతో కనపించేవారంతా ఒక్కసారిగా సంప్రదాయ దుస్తుల్లోకి మారిపోయారు. మనం రోజూ తెరపై చూసిన నటీ నటులేనే అన్నంతగా వారి ఆహార్యం మారిపోయింది. వారంతా ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..! ఈ మహత్తర మహోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకున్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, ఆమె భర్తతో కలిసి వచ్చింది. కత్రినా బంగారు రంగు చీరలో సంప్రదాయ గృహిణిలా కనిపించగా, ఆమె భర్త చక్కటి తెల్లటి కుర్తా పైజామా, బోల్డ్ డిజైన్‌లో ఉన్న దుపట్టతో తళుకున్నమన్నాడు. ఇరువురిని చూస్తే రెండు కళ్లవు చాలవు అన్నంత అందంగా సంప్రదాయ బద్ధమైన దుస్తులతో అలరించారు. ఇక 'యానిమల్' హిరో సతీమణి అలియా భట్ సైతం గోల్డెన్ బోర్డర్‌తో ఉన్న లక్స్ గ్రీన్చీరలో వచ్చింది. పైగా భుజంపై మ్యాచింగ్ శాలువా ధరించి హుందాగా వచ్చింది. ఇక ఆమె భర్త రణబీర్ కపూర్ తెల్లటి ధోతీ కుర్తాలో అదిరిపోయే లుక్క్‌లో సందడి చేశాడు. అతను కూడా మంచి క్లాసిక్ శాలువా ధరించాడు. పైగా ఇరువురు ఎలాంటి మేకప్ లేకుండా నేచురల్ లుక్‌లో కనిపించారు. ఇక వారితో పాటు రోహిత్ శెట్టి తెల్లటి కుర్తా సెట్లో అదిరిపోయాడు. ఇక బిగ్‌బీ, బాలీవుడ్ లెజండరీ నటుడు అమితా బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్ఛన్ కూడా తెల్లటి కుర్తా సెట్లో కనిపించారు. అలాగే కంనా రనౌత్ ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంది. ఆమె నిన్న అయోధ్యలో చీరకట్టులో చీపురు పట్టుకుని మరీ ఆలయాన్ని శుభ్రం చేసింది. ఇవాళ ఈ ప్రాణ ప్రతిష్ట వేడుకలో నారింజ రంగు చీర, విత్ మ్యాచింగ్ శాలువతో స్టన్నింగ్ లుక్‌తో కనిపంచింది. ఇక సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మహా సంప్రోక్షణకు ఒక రోజు ముందు ఆయోధ్యకు చేరుకున్నారు. ఆయన ధనుష్‌తో కలిసి సందడి చేశారు. ఈ వేడుకలో ఆయన తెల్లటి కుర్తా పైజామా సెట్ తోపాటు శాలువా ధరించారు. మరో ప్రముఖ నటి మాదురి దీక్షిత్ గోల్డ్ అంచుతో కూడిన పసుపు రంగు చీర, ఫుల్ హ్యండ్స్ బ్లౌజ్‌తో తళుక్కుమనిపించింది. ఆమె భర్త తెల్లటి పైజామా, మెరూన్ రంగు కుర్తాను ధరించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌లు పారిశ్రామికవేత్త అనిల్ అంబానితో మాట్లాడుతూ కనిపించారు. రామ్ చరణ్ తెల్లటి పైజామా, ఐవరీ కుర్తా ధరించగా, చిరంజీవి ఐవరీ పట్టు ధోతీ, కుర్తా సెట్లో కనిపించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక ఆయుష్మాన్ ఖురాన్కూడా తెల్లటి కుర్తాలో అందంగా కనిపించారు. అయితే ఇతను నెహ్రు కోట్ డిజైన్ వేర్లో కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి కూడా. ఏదీఏమైనా ఇలాంటి ప్రాణప్రతిష్ట క్రతువుల్లో సినీ తారలు సంప్రదాయ దుస్తులు ధరించి మన ఆచార వ్యవహారాల పట్ల తమకున్న గౌరవాన్ని, ఆసక్తిని చాటుకోవడమే అందరీ మనసులను గెలుచుకున్నారు. అంతేగాదు మనం వెళ్లున్న కార్యక్రమానికి తగ్గట్టు ఉండే ఆహార్యం ఆ మనిషి వ్యక్తిత్వం, వైఖరీ ఏంటన్నది చెప్పకనే చెబుతుంది సుమా!. (చదవండి: బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను ఓ కళాకారుడి ఆర్ట్‌లో ఇలా చూడండి!) -
ప్రముఖుల విడాకులు.. మానసిక కారణాలు..!
ప్రముఖుల రొమాన్సులు, వివాహాలే కాదు విడాకులు కూడా మీడియాలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అందరూ దాని గురించి చర్చించుకుంటారు. గతంలో ఆమీర్ ఖాన్-కిరణ్ రావు, అర్జున్ రాంపాల్-మెహర్ జెసియా, సమంతా రూత్ ప్రభు-నాగ చైతన్య, తాజాగా సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు చర్చనీయాంశాలయ్యాయి. అసలు కారణాలు ఎవరికీ తెలియకున్నా ఎవరి కారణాలు వారు వెతుక్కున్నారు. అయితే ఈ విడాకులను గాసిప్ లెన్స్ ద్వారా కాకుండా సైకాలజీ లెన్స్ ద్వారా పరిశీలిస్తే, వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు దొరుకుతాయి. ఫేమ్ వల్ల వచ్చే మానసిక ఒత్తిడి నిరంతరం ప్రజల దృష్టిలో ఉండటం ఏ సెలబ్రిటీ జీవితానికైనా కష్టమైన, నష్టం కలిగించే విషయం. వారు చేసే చిన్న పొరపాటు కూడా భూతద్దంలో చూస్తారు, ఘోరమైన తప్పిదంగా మీడియాలో ప్రొజెక్ట్ చేస్తారు. దీంతో ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను కాపాడుకోవడానికి వారు నిరంతరం ఒత్తిడి అనుభవిస్తారు. ఈ ఒత్తిడి ఇద్దరి మధ్య ఉన్న ఇబ్బందులను, విభేదాలను తీవ్రతరం చేస్తుంది. బంధం, అనుబంధం డీప్‌గా మారడానికి ఆటంకం కలిగిస్తుంది. పాపులారిటీతో పెరిగే అహంభావం కీర్తి, సంపద, నిరంతర పాపులారిటీ వ్యక్తిలో అహంభావాన్ని, తద్వారా నార్సిసిజంను పెంచుతాయి. అంటే తనను తాను ప్రేమించుకోవడం పెరిగిపోతుంది. ఫలితంగా భాగస్వామి పట్ల సహానుభూతి, రాజీపడే తత్వం తగ్గిపోతాయి. భాగస్వాములను పాపులారిటీలో తనతో పోటీపడే కాంపిటీటర్‌గా మారుస్తుంది. పరస్పర విశ్వాసం, సాన్నిహిత్యాన్ని దెబ్బతీస్తుంది. బిజీ జీవితంతో బలహీనపడే బంధాలు సెలబ్రిటీల జీవితం ఎడతెగని షెడ్యూల్లు, చాలాకాలం పాటు విడివిడిగా ఉండాల్సి రావడంతో పరస్సర భావోద్వేగ సంబంధాన్ని కొనసాగించడంలో, విశ్వాసాన్ని పెంపొందించడంలో సవాళ్లుగా మారతాయి. భౌతికంగా, మానసికంగా అధిగమించలేని దూరాలను సృష్టిస్తాయి. చివరికి ఒకరితో ఒకరు డిస్ కనెక్ట్ అవుతారు. ఆర్థిక భద్రత పెంచే స్వాతంత్య్ర భావం సెలబ్రిటీలకు ఉండే ఆర్థిక భద్రత ఒక గిఫ్ట్‌లా కనిపించినప్పటికీ, సాంప్రదాయిక నిబద్ధతలను చెరిపేసే స్వాతంత్య్ర భావాన్ని కూడా పెంపొందిస్తుంది. ఫలితంగా సెలబ్రిటీ జంటలు వారి కాపురంలో ఎదుర్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు, సయోధ్యకోసం తక్కువ మొగ్గు చూపుతారు. ఎవరిదారి వారు చూసుకుంటారు. కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ల న్యాయ పోరాటంలో హైలైట్ కావడం గమనార్హం. అయితే ఇవన్నీ సాధారణ మానసిక కారణాలు మాత్రమే. ప్రతి సెలబ్రిటీ విడాకుల వెనుక దానివైన ప్రత్యేక కారణాలు ఉంటాయని గుర్తించడం చాలా ముఖ్యం. పాపులారిటీకే ప్రాధాన్యం ఇవ్వడం, వైవాహికేతర సంబంధాలు, మానసిక ఒత్తిళ్లు, అహంకారం, అననుకూలత లాంటి అనేక అంశాలు అనేకం ఉండవచ్చు. తెరపై మెరిసే తారల జీవితాల్లో కూడా మనకు తెలియని అనేకానేక చీకటి గాధలు, బాధలు ఉండవచ్చు. వాటిని పరిష్కరించుకునే క్రమంలో అహానికి పోకుండా, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే మెరుగైన ఫలితం ఉండవచ్చు. --సైకాలజిస్ట్ విశేష్ ఫోన్ నెం: 8019 000066 psy.vishesh@gmail.com (చదవండి: పేరెంట్స్ నిర్లక్ష్యం చేస్తే Animal లా మారతారా? )
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019