breaking news
-
వందేళ్లనాటి కాను(టు)క ఇది : ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
ఇంట్లో పసిపాప వస్తోంది అంటే చాలు అమ్మమ్మ, నానమ్మల హడావిడి మొదలవుతుంది. పొత్తిళ్లలో బిడ్డకు కావాల్సిన మెత్తటి బట్టలు సేకరించడం, పాపాయికి సౌకర్యంగా ఉండేలా పాత చీరలతో చేసిన బొంతలు తయారీ మొదలు, కాటుక, ఆముదం లాంటివి సిద్ధం చేసుకునేందుకు రడీ అయిపోయేవారు. సహజంగాఇంట్లోనే కాటుకునే తయారుచేసుకునే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పత్తి దారంతో కొద్దిగా వామ్ము గింజలు వేసి వత్తి తయారు చేసిన దాన్ని ఆవ నూనెలో ముంచి మట్టి ప్రమిదలో దీపం వెలిగించింది. దానిపై వెడల్పాటి మూతను పెట్టింది. వత్తి మొత్తం కాలి ఆ మసి అంతా పళ్లానికి అంటుకుంది. ఈ మసిని తీసి కాజల్( కాటుక)గా తయారు చేసింది. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఆముదం, నూలు బట్ట సహాయంతో తమ నాన్నమ్మ, అమ్మమ్మ ఇలానే చేసేది అంటూ నెటిజన్లు గుర్తు చేసు కున్నారు. ఇందులో కెమికల్స్ ఉండవు. పైగా చిన్నపిల్లలకు కంటికి శీతలం కూడా అని వ్యాఖ్యానించారు.సహజమైన పదార్థాలతో ఇంట్లో తయారు చేసుకున్న కాటుక అయితే అందమైన అమ్మాయి కళ్ళు మరింత విశాలంగా బ్రైట్‌గా, బ్యూటీఫుల్‌గా మెరిసి పోతాయి. కళ్ళకి కాటుక పెట్టుకోవడం వల్ల కంటిలోని ఎర్రటి చారలు తొలగిపోతాయి. పైగా కాటుక పెట్టుకోవడం వల్ల దుమ్ము, ధూళి కణాలు కళ్ళలో పడకుండా ఉంటుంది. Did you know this 100 years old technique of Kajal making? Ingredients: Cotton, Ajwain, Mustard Oil and Ghee… pic.twitter.com/K6rF6yRcal — Aparajite | ಅಪರಾಜಿತೆ (@amshilparaghu) April 15, 2024 నోట్: చాలావరకు డాక్టర్లు శిశువులకు కాటుక పెట్టవద్దని చెబుతారు. ఎందుకంటే రసాయనాలతో తయారు చేసిన కాటుకల వల్ల కంటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుందనేది గమనించ గలరు. -
రోజూ ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి
కొంతమందికి కనుబొమలు బాగా పలుచగా, ఉండీ లేనట్టుగా కనిపిస్తాయి. కనుబొమలు తీరైన ఆకృతితో, దట్టంగా ఉంటేనే ముఖారవిందం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పలుచని కనుబొమ్మలను ఒత్తుగా... నల్లగా మార్చుకోవడానికి ఇలా ప్రయత్నించి చూడండి... ఆముదం: జట్టు పెరుగుదలకు దోహదపడే వాటిలో ఆముదం ముందు వరుసలో ఉంటుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, విటమిన్ ఇ, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దూదిని ఆముదంలో ముంచి పలుచని ఐబ్రోస్ మీద అద్దుకుని ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. ఉల్లిపాయ రసం: ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని రోజూ కనుబొమలకు రాసుకోవాలి. రెండు మూడు వారాల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది. ఆలివ్ ఆయిల్ : ఫీనాలిక్ కాంపౌండ్స్ ఉండే ఆలివ్ నూనెను కనుబొమ్మలకు రాస్తే .. వెంట్రుకలు నల్లగా పెరుగుతాయి. -
రోజూ జుట్టుకు ఆముదం పట్టిస్తే చుండ్రు తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది!!
Castor Oil Benefits for Skin and Hair: చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. చర్మంతోపాటు జుట్టుకూడా పొడిబారుతుంది. దీంతో చుండ్రు సమస్య మొదలవుతుంది. ఇప్పటికే చుండ్రు ఉంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే ఈ సమస్యలేవి రాకుండా ఉండాలంటే చలికాలం ఉన్నన్ని రోజులు జుట్టుకు ఆముదం పట్టిస్తే మంచిది. ►టేబుల్ స్పూను ఆముదం, టేబుల్ స్పూను కొబ్బరి నూనెలను కలిపి వేడి చేసి గోరువెచ్చగా అయిన తరవాత మాడుకు పట్టించి పదినిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే..చుండ్రు తగ్గడంతోపాటు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ►పొడిబారిన చర్మానికి సైతం ఆముదం మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. బాడీ లోషన్స్‌కు బదులు ఆముదాన్ని రాసుకుంటే మరింత మంచిది. ►గోరువెచ్చని ఆముదాన్ని పలుచగా ఉన్న కనుబొమ్మలకు రాసి రెండు నిమిషాలు మర్దన చేసి ఉదయం కడిగేయాలి. ఇలా కొన్నిరోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా కనిపిస్తాయి. ►రాత్రి పడుకునే ముందు ఆముదాన్ని పెదవులకు రాసి మూడు నిమిషాలపాటు మర్దన చేయాలి. చిన్న బాక్స్‌లో ఆముదాన్ని పోసుకుని రోజులో అప్పుడప్పుడు లిప్‌బామ్‌లా రాసుకుంటూ ఉంటే పెదవులు మృదువుగా, పింక్ కలర్లోకి మారుతాయి. చదవండి: ఆ హార్మోన్ వల్లనే బరువు పెరుగుతారు..! యాలకులు, వెల్లుల్లి, కరివేపాకు, తేనె, మజ్జిగ.. -
ఆముదం నూనె కలిపిన మట్టితో చీడపీడలకు చెక్
భూమి లోపలి నుంచి తీసి ఎండబెట్టిన 10 కిలోల మెత్తని మట్టి (సబ్ సాయిల్)కి అర లీటరు ఆముదం నూనెను బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని పంట మొక్కల పాదుల్లో లేదా డ్రిప్పర్ల వద్ద పిడికెడు వేసి నీరు అందిస్తే ఆ పంటలకు ఇక చీడపీడల బెడద అసలు ఉండదని రుజువైందని ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట రెడ్డి (సీవీఆర్) తెలిపారు. మొక్క నాటిన/విత్తిన పది రోజులకు మొదటిసారి, అక్కడి నుంచి 15–20 రోజులకు మరోసారి పిడికెడు వేస్తే చాలు. వంగ, టమాటో, బెండ, బీర వంటి పంటలతోపాటు పత్తి, వరి, గోధుమ పంటల్లో సైతం ఈ ప్రయోగం సఫలమైందన్నారు. వంగ వంటి కూరగాయ పంటలకు పురుగు బెడద ఎక్కువ. భూమి లోపలి నుంచి తీసిన మట్టిని ఎండబెట్టి వంగ మొక్కల పాదుల వద్ద వేయడంతోపాటు, ఆ మట్టిని నీటిలో కలిపి 4–5 రోజులకోసారి పిచికారీ చేయటం ద్వారా వంగ పంటలో చీడపీడలు రాకుండా చూసుకోవచ్చని సీవీఆర్ గతంలో చెప్పారు. ఇటీవల లోపలి మట్టికి ఆముదం నూనె కలిపి పాదుల్లో లేదా డ్రిప్లర్ల దగ్గర వేస్తే పచ్చ దోమ, తెల్ల దోమ వంటి రసంపీల్చే పురుగులతోపాటు కాయ తొలిచే పురుగు కూడా ఆయా మొక్కల దరిదాపుల్లోకి రావటం లేదని గుర్తించారు. మొక్కల పెరుగుదల బాగా ఉందని, దిగుబడి కూడా బాగా వచ్చిందని సీవీఆర్ వివరించారు. ఆముదం నూనెను వాడేటప్పుడు ఎమల్సిఫయర్ ద్రావణాన్ని కలపటం పరిపాటి అని అంటూ.. లోపలి మట్టే ఎమల్సిఫయర్‌గా పనిచేస్తోందని.. ఆముదం నూనె వాసనకు చీడపీడలు దరిచేరటం లేదని గుర్తించానని వివరించారు. ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమం వేసిన తర్వాత కుళ్లింపజేసే పశువుల ఎరువు, ఘనజీవామృతం, వర్మీకంపోస్టు వంటి సేంద్రియ ఎరువులను చెట్ల దగ్గర వేయకూడదని రైతులు గమనించాలన్నారు. అలా వేస్తే మట్టిలో కలిపి వేసిన ఆముదం నూనె (చీడపీడలను తరిమేసే) ప్రభావాన్ని కోల్పోతుందన్నారు. అదేవిధంగా, ద్రవ జీవామృతం, గోకృపామృతం, వేస్ట్ డీకంపోజర్)ను ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమంపై పోయటం లేదా డ్రిప్ ద్వారా అందించడం కూడా చేయవద్దని సీవీఆర్ హెచ్చరించారు. అయితే, వీటిని ఆయా పంటలపై పిచికారీ చేసుకోవచ్చని సూచించారు. 10 కేజీల భూమి లోపలి నుంచి తీసిన మెత్తని పొడి మట్టికి పావు లీటరు ఆముదం నూనె, మరో పావు లీటరు వేప/కానుగ నూనెను కలిపి కూడా వేసుకోవచ్చని సీవీఆర్ సూచించారు. ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమం 200 గ్రాములను 20 లీటర్ల నీటిలో కలిపి పంటలపై వారానికోసారి పిచికారీ చేయటం మరీ మంచిదని సీవీఆర్ తెలిపారు. చింతల వెంకట రెడ్డి -
అముదం నూనెతో అద్భుత ప్రయోజనాలు
కాస్టర్ ఆయిల్(ఆముదం నూనె).. ఆముదం చెట్టు గింజల నుంచి లభించే ఈ నూనె ఎన్నో సమస్యలకు నివారణిగా పనిచేస్తోంది. చర్మంతో పాటు జుట్టుకు సంబంధించిన అనేక రకరకాల సమస్యలను దూరం చేయడంలో ఆముదం పాత్ర అగ్రస్థానం. మృదువైన శిరోజాలు సొంతం కావాలంటే... ఆముదం వల్లే సాధ్యం. ఇందులో రిసినోలిస్ యాసిడ్ సంవృద్ధిగా ఉంటుంది, ఇది యాంటీఇన్ఫ్లమేటరి, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అందమైన శరీరానికి దోహదం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకునేందుకు బాగా పనిచేస్తాయి. గుండె జబ్బులు, విషజ్వరం, కుష్ఠు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర సంబంధ సమస్యలను సులువుగా నివారిస్తుంది. (అందానికి తెలుపు అవసరం లేదు) తేమను పునరుద్ధరిస్తుంది: ఆముదం నూపె సహజమైన తేమను కలిగి ఉంటుంది. ఇది గాలి నుంచి తేమను చర్మంలోకి లాగగలదు, చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇది చర్మం బయటి పొర ద్వారా తేమను నిలుపుకుంటుంది. ఆముదం నూనెలో ఉండే అధిక స్నిగ్ధత కారణంగా ఈ నూనె కొద్దిగా చిక్కగా ఉండి ఒక రకమైన వాసన వస్తుంటుంది. అయితే ఇది చర్మం మీద మందపాటి పొరను ఏర్పరచి, తేమను లాక్ చేస్తుంది. మీద చర్మంపై మందపాటి, రక్షిత పొరను ఏర్పరుస్తుంది. దీని ద్వారా డస్ట్ చర్మలోపలి పొరల్లోకి వెళ్లకుండా అడ్డకుంటుంది. (బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఈ ఒక్కటి చేస్తే చాలు) మొటిమలతో పోరాడుతుంది: ఆముదం నూనె యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది, మొటిమలు, బ్లాక్ హెడ్స్ రాకుండా ఉండేందుకు, లేదా తగ్గించేందుకు పనిచేస్తుంది. జుట్టు రాలడం అరికడుతుంది: ఆముదం నూనె జుట్టు రాలడాన్ని అరికట్టి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో బెస్ట్ హోం రెమెడీ . ఉత్తమ ఫలితాలను పొందడానికి వారానికొకసారి ఆముదంను తలకు పట్టించాలి.జుట్టు బాగా రాలుతున్నప్పుడు ఇలా చేయొచ్చు... నాలుగు చెంచాల చొప్పున కొబ్బరినూనె, ఆముదం సమపాళ్లలో తీసుకుని అందులో నాలుగు చుక్కల నిమ్మరసం, గుడ్డులోని తెల్ల సొన కలిపి... తలకు పూతలా వేసుకోవాలి. ఓ గంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే....జుట్టు రాలకుండా ఉంటుంది. చర్మం ముడత నుంచి కాపాడుతుంది: ఆముదం నూనెలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి రాసుకుంటే చర్మం పగలకుండా ఉంటుంది. మృదువుగా మారుతుంది. ముడతలను నివారిస్తుంది. చర్మ సౌందర్యం పెరుగుతుంది. (ఆరోగ్యానికే కాదు.. అందానికీ ఔషధమేమే) జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది : ఆముదంలో ఉండే రిసినోలిక్ యాసిడ్ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. ఇది తలలో పిహెచ్ లెవల్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే తలలో నేచురల్ ఆయిల్స్ కోల్పోకుండా సహాయపడుతుంది. డల్ మరియు డ్యామేజ్ హెయిర్‌ను నివారించడంలో ఇది ప్రముఖ పాత్రం పోషిస్తుంది. ఆముదం నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టుకు నేచురల్ షైనింగ్, స్ట్రాంగ్ నెస్‌ను అందిస్తుంది. అందువల్లే, ఆముదం నూనె అనేక జుట్టు సమస్యలను ఎదుర్కోగలుగుతుంది. ఆముదంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. మన శరీరంలో పలు హార్మోన్లు సక్రమంగా పనిచేయాలంటే అందుకు కొవ్వు పదార్థాలు సరిగ్గా జీర్ణం కావాలి. అయితే ఆముదాన్ని సేవిస్తే ఆ కొవ్వు పదార్థాలు శరీరంలో బాగా ఇమిడిపోతాయి. దీంతో హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. జీవక్రియలు మెరుగుపడతాయి. ఇదిలా ఉండగా.. ఆముదం ఎన్ని మంచి గుణాలనుకలిగి ఉన్నప్పటికీ అందరికీ సరిపోదు. కొందరికి మంచి ఫలితాలను ఇచ్చిప్పటికీ అందిరిపై ఒకే ప్రభావాన్ని చూపించదు. కొంతమందికి ఎలర్జీని తెచ్చిపెడుతుంది. ఆముదము నూనె మందంగా ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో మొటిమలకు కారణం అవుతుంది. మొఖంపై జిడ్డు చేరి ఆకర్షణ తగ్గుతుంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019