breaking news
-
యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఓవర్ యాక్షన్ చేస్తే అది మన మెడకే చుట్టుకుంటుంది. ఛానల్ ఉంది కదా అనో, చేతిలో కెమెరా ఉంది కదా అనో విచక్షణ మరిచి ప్రవర్తించకూడదు. ఇది తెలియక చాలామంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు ఫేక్‌వార్తలు, సమాచారంతో గప్పాలు కొడుతుంటారు. తాజాగా పబ్లిసిటీ కోసం నిషిద్ధ ప్రాంతంలోకి ఉద్దేశపూర్వకంగా ఎంటరైన ఒక యూట్యూబర్‌కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. విషయం ఏమిటంటే.. బెంగళూరులోని యలహంకకు చెందిన వికాస్ గౌడ (23) అడ్డంగా బుక్కయ్యాడు. ఏప్రిల్ 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నైకి వెళ్లే ఎయిరిండియా విమానం టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. భద్రతా తనిఖీల అనంతరం విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. ఇక్కడి దాకా బాగానే వుంది. విమానం ఎక్కకుండా, విమానాశ్రయ ఆవరణలోనే తిరుగుతూ వీడియో కంటెంట్‌ను రికార్డ్ చేశాడు. ఇక్కడితో సరిపెట్టినా బావుండేది. ఎయిర్‌పోర్ట్‌లో రోజంతా బస చేసా.. అయినా తనని ఎవరూ పట్టించుకోలేదంటూ ప్రగల్భాలు పలుకుతూ ఏప్రిల్ 12న ఒక వీడియో తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. విమానాశ్రయంలో మొత్తం తిరిగినా తనను ఎవరూ పట్టుకోలేదంటూ, ఎయిర్పోర్ట్ భద్రత గురించి నెగెటివ్ కామెంట్ చేశాడు. అంతా అయ్యాక డ్యామేజ్ కంట్రోల్లో పడ్డాడు. ఆ ఎయిర్పోర్ట్ వీడియోను తన ఛానెల్ నుండి తీసివేశాడు. కానీ అది కాస్తా చేరాల్సిన వారి దృష్టికి అప్పటికే చేరిపోయింది. కట్ చేస్తే.. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వింగ్ సీఐఎస్ఎఫ్ వికాస్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో అతణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 505, 448 కింద కేసు కూడా నమోదు చేశారు. తన ఫ్లైట్ మిస్సయ్యానని పేర్కొంటూ, సుమారు ఆరు గంటలపాటు విమానాశ్రయంలో తిరిగాడని, కానీ అతను చెప్పినట్టుగా 24 గంటలు కాదని తన విచారణలో తేలిందని భద్రతా అధికారులు వెల్లడించారు. అతని మొబైల్ ఫోన్నుస్వాధీనం చేసుకున్నారు. ఎట్టకేలకు తను చేసింది తప్పేనని అంగీకరించాడు. ప్రచారంకోసం అలా చేశానంటూ లెంపలేసుకున్నాడు. మొత్తం మీద గౌడకు బెయిల్ మంజూరు కావడంతో బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. -
‘‘చంపేస్తాం’’.. మహిళా జడ్జికి బెదిరింపు లేఖ
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ మహిళా జడ్జికి చంపేస్తామని బెదిరింపు లేఖ వచ్చింది. దీనిపై ఆ మహాళా జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ మహిళా జడ్జి గతంలో తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపుల్లో భాగంగానే తనకు తాజాగా బెదిరింపు లేఖ వచ్చిందని ఆమె ఫిర్యాదులో తెలిపారు. లేఖ కవర్‌పై ఉన్న ఫ్రమ్ చిరునామా మొత్తం ఫేక్ అని, లేఖ వచ్చిన పోస్టాఫీసులో సీసీ టీవీ కెమెరా పరిశీలించాలని పోలీసులను జడ్జి కోరారు. ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటే ఫుటేజ్ పరిశీలించి నిందితుడిని అరెస్టు చేస్తామని తెలిపారు. జడ్జి గతంలో నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసు ప్రయాగ్‌రాజ్ పోలీసుల వద్ద పెండింగ్‌లోనే ఉంది. ఇదీ చదవండి.. అతనికి 35, ఆమెకు 42 -
మేడిపల్లి పీఎస్‌లో బండి సంజయ్‌పై కేసు
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బండి సంజయ్‌పై కేసు నమోదైంది. చెంగిచర్లలో పిట్టల బస్తి బాధితులను పరామర్శించడానికి బండి సంజయ్, అతని అనుచరులు రాగా, పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో కింద పడిన నాచారం సీఐ నందిశ్వర్ రెడ్డికి గాయాలయ్యాయి. సీఐ ఫిర్యాదుతో బండి సంజయ్‌తో పాటు మరో పది మందిపై 332, 353, 143, 149 ఐపీసీ 3, 4పీడీపీపీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్ ఎంపీగా సానియా మీర్జా పోటీ?! -
నటి రాధపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
కోలీవుడ్‌లో సుందరాట్రావెల్స్, అదావతి, మనస్థాన్, కధవరాయన్ త దితర చిత్రాల్లో హీరోయిన్గా నటించి గుర్తింపు పొందిన నటి రాధ. నెల్లూరుకు చెందిన రాధ సినిమా అవకాశాల కోసం చెన్నై మకాం మార్చింది. అక్కడ పలు సినిమాల్లో హీరోయిన్గా ఛాన్సులు దక్కించుకుంది. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తుంది. ఈమెకు తరుణ్ అనే కుమారుడు ఉన్నాడు. వీరు చెన్నైలోని సాలిగ్రామంలో నివసిస్తున్నారు. కాగా వీరి ఇంటి సమీపంలో ఫ్రాన్సిస్ రిచర్డ్ అనే యువకుడు నివసిస్తున్నాడు. ఇతను ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. కాగా రాత్రి ప్రాన్సిస్ ఇంటికి తిరిగి వస్తుండగా వెనుక వచ్చిన నటి రాధ, ఆమె కుమారుడు తరుణ్ అతనిపై దాడి చేసి కొట్టారు. దీంతో ఫ్రాన్సిన్ రిజర్డ్ తండ్రి డేవిడ్ రాజ్ నటి రాధ, ఆమె కొడుకు తరుణ్‌పై విరుగంబాక్కమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కొడుకుపై దాడికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. దీంతో కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. నటి రాధ ఫ్రాన్సిస్ రిజర్డ్‌పై దాడి చేసిన దృశ్యాలు ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల్లో చోటు చేసుకున్న విషయం పోలీసులు దృష్టికి వచ్చింది. కాగా ఫ్రాన్సిస్ రిచర్డ్ ఇంతకు ముందు నటి రాధపై వ్యంగంగా ప్రవర్తించినందుకు గానూ అతనిపై ఇంతకు ముందు ఆమె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే నటి రాధ, ఆమె కొడుకు ఫ్రాన్సిస్ రిచర్డ్‌పై దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాధ గతంలో కూడా పలు వివాధాల వల్ల కోలివుడ్ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో నిలిచేది. భర్తతో గొడవలు,వివాహేతర సంబంధాలు,నిర్మాతల వేధింపులపై ఆమె కామెంట్లు ఇలా పలు విషయాల చుట్టూ ఆమె టాపిక్ వైరల్‌గా ఉండేది. -
కేసీఆర్ తోడల్లుడిపై కేసు నమోదు
కరీంనగర్‌క్రైం: మాజీ సీఎం కేసీఆర్ తోడల్లుడు, రాజ్యసభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు తండ్రి రవీందర్‌రావుపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ టూటౌన్ సీఐ వెంకటేశ్ తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అనుచరుడు కరీంనగర్‌లోని రాంనగర్‌కు చెందిన కూస రవీందర్ భూదందాలకు పాల్పడుతున్నాడని ఓ యూట్యూబ్ చానల్లో వార్త ప్రసారం చేశారు. మిడ్‌మానేరు భూ నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్లలో భూకబ్జాకు పాల్పడ్డాడని, అక్రమ పట్టా ఇవ్వమని సిరిసిల్ల ఆర్డీవోను బెదిరింపులకు గురిచేశాడని పేర్కొన్నారు. అయితే ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని, తప్పుడు విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారని.. దీని వెనుక కేసీఆర్ తోడల్లుడు జోగినపల్లి రవీందర్ రావు, గూడ బాలకృష్ణ, ఎ.నాగరాజు, సంపత్ ఉన్నారని కూస రవీందర్ ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జోగినపల్లి రవీందర్ రావు, గూడ బాలకృష్ణ, ఎ.నాగరాజు, సంపత్, యూట్యూబ్ చానెల్ నిర్వాహకుడు చిలుక ప్రవీణ్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.ల
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019