breaking news
-
అక్రమ వలసలకు చెక్.. సంచలన బిల్లు తెచ్చిన బ్రిటన్
లండన్: అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటున్న బ్రిటన్ వాటిని ఆపేందుకు సంచలన బిల్లు తీసుకువచ్చింది. మంగళవారం(ఏప్రిల్23) ‘సేఫ్టీ ఆఫ్ రువాండా’ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుతో అక్రమ వలసదారులకు అడ్డకట్టపడనుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారందరినీ ఆఫ్రికా దేశం రువాండాకు తరలిస్తారు. బ్రిటన్ రాజు చార్లెస్ 3 ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారుతుంది. బ్రిటన్‌కు వచ్చే అక్రమ వలసదారులను ఆపడానికి రువాండా బిల్లు తీసుకువచ్చినట్లు ప్రధాని రిషి సునాక్ తెలిపారు. దేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చేవారు నివసించడానికి ఇక నుంచి వీలులేదని చెప్పారు. అక్రమ వలసదారులను విమానాల్లో తీసుకువెళ్లి దేశం బయట వదిలేస్తామన్నారు. -
స్మోకింగ్ బ్యాన్..! రిషి సునాక్‌పై వ్యతిరేకత
లండన్: బ్రిటన్‌లో స్మోకింగ్ బ్యాన్ చట్టంపై ప్రధాని రిషి సునాక్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 2009 తర్వాత పుట్టిన వారికి అంటే.. 15, 15 ఏళ్లలోపు వయసు ఉన్న వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడాన్ని నిషేధించే చట్టాన్ని సునాక్ గతేడాదే ప్రతిపాదించారు. మంగళవారం (ఏప్రిల్16) ఈ చట్టాన్ని బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టారు. సునాక్ సొంత పార్టీ కన్జర్వేటివ్స్ ఎంపీల్లో కొందరు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ ప్రధానులు లిజ్ ట్రుస్, బొరిస్ జాన్సన్‌లు కూడా ఈ చట్టంపై వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం అమలు చేయడమంటే ప్రజల ఇష్టాఇష్టాలను నియంత్రించడమేననేది వారి వాదన. వేల కొద్ది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, ఒక జనరేషన్‌ను స్మోకింగ్ నుంచి దూరంగా ఉంచేందుకు ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని యూకే హెల్త్ సెక్రటరీ విక్టోరియా అట్కిన్స్ తెలిపారు. ఈ చట్టం దేశంలో ప్రొడక్టివిటీని పెంచడమే కాకుండా నేషనల్ హెల్త్ సర్వీస్‌పై భారాన్ని తగ్గిస్తుందన్నారు. ఇదీ చదవండి.. మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్ -
Britain: భార్యను 224 ముక్కలుగా నరికేశాడు
లండన్: భార్యను భర్త హత్యచేసి ఏకంగా 224 ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయంచేసిన దారుణ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. నికొలస్ మెట్సన్ (28), హోలీ బ్రామ్లీ (26) లింకన్ సిటీలోని బస్సింగ్హామ్లో ఉంటున్నారు. గత నెల 17 నుంచి బ్రామ్లీ కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె తనను చితకబాది వెళ్లిపోయిందని పోలీసులకు నికొలస్ చెప్పాడు. ఫ్లాట్‌ను తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో రక్తపు మరకలు, అతిగా శుభ్రం చేసినట్లు అమ్మోనియా, బ్లీచింగ్ ఆనవాళ్లు కనిపించాయి. దాంతో అతన్ని అరెస్ట్‌చేసి విచారణ మొదలెట్టారు. తనకేం తెలీదని మెట్సన్ తొలుత వాదించాడు. ఈలోపు సమీపంలోని విథమ్ నదిలో నరికిన చేయి సహా చిన్నిచిన్న శరీరభాగాలున్న ప్లాస్టిక్ బ్యాగులు కొట్టుకుపోవడం చూసి స్థానికుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసు గజ ఈతగాళ్లు వాటిని సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అసలేమాత్రం గుర్తుపట్టలేనంతగా హోలీ బ్రామ్లీ శరీరాన్ని పలుమార్లు పొడిచి 224 ముక్కలుగా నరికి భర్త నదిలో పడేశాడు. శరీరభాగాలను పడేయటంతో సాయపడినట్లు భర్త స్నేహితుడు జాషువా హ్యాన్‌కాక్ తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఎట్టకేలకు భర్త తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆమె చంపడానికి ముందు పెంపుడు కుక్క పిల్ల, పెంపుడు ఎలుకలనూ చంపేశాడు. తన మాజీ జీవితభాగస్వాములనూ మెట్సన్ హింసించినట్లు 2013, 2016, 2017 పోలీసు రికార్డుల్లో ఉంది. జంతువుల పట్ల అతను అమానుషంగా ప్రవర్తించేవాడని పోలీసు విచారణలో వెల్లడైంది. హత్యచేసి దాదాపు వారంపాటు శరీరం ముక్కలున్న బ్యాగులను దాచి తర్వాత వాటిని పడేశాడు. హత్య తర్వాత భార్య బ్యాంక్ ఖాతా నుంచి 50 పౌండ్లు విత్‌డ్రా చేసి వాడుకున్నాడు. ‘భార్యను హత్య చేస్తే భర్తకు కలిగే లాభాలేంటి?. ఆ తర్వాత నన్ను ఎవరైనా వెంబడిస్తారా?. కూపీ లాగుతారా?’ అంటూ హత్యకు ముందు కొన్ని అంశాలపై ఆన్లైన్లో సెర్చ్చేశాడు. ఈ ఆన్లైన్ సెర్చ్ హిస్టరీని సైతం పోలీసులు వెలికితీశారు. -
UK Elections: చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమా?
లండన్: కన్జర్వేటివ్ పార్టీ.. బ్రిటన్‌లో దాదాపు పదిహేన్లపాటు అధికారంలో కొనసాగింది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. గత రెండు మూడేళ్లుగా ఆ దేశ రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చితి(ప్రధాని, మంత్రుల రాజీనామాలు.. తొలగింపులు), మరీ ముఖ్యంగా భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలో ఆ పార్టీ ఇమేజ్ మరింత దిగజారిపోయిందని ఆ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో యూకేలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో(తేదీలు ఖరారు కావాల్సి ఉంది) లేబర్ పార్టీ ప్రభంజనం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. కన్జర్వేటివ పార్టీ గత ఐదేళ్లలో ఇచ్చిన హామీలీను నెరవేర్చకపోగా.. దేశాన్ని వరుస సంక్షోభాల్లోకి నెట్టేసిందన్న అభిప్రాయంలో ఉన్నారు అక్కడి ప్రజలు. పైగా కాస్ట్ ఆఫ్ లివింగ్ సైతం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వ వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా.. మార్చి 7వ తేదీ నుంచి 27 తేదీ మధ్య YouGov ఓ పబ్లిక్ సర్వే నిర్వహించింది. అందులో 18, 761 మంది పౌరులు పాల్గొన్నారు. వాళ్లలో మెజారిటీ పౌరులు.. లేబర్ పార్టీకే ఓటేస్తామని స్పష్టం చేశారు. మొత్తం 650 స్థానాలున్న యూకే పార్లమెంట్లో.. అధికారం చేపట్టాలంటే 326 స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే యూజీవోవీ సర్వేలో లేబర్ పార్టీకి 403 స్థానాలు, కన్జర్వేటివ్ పార్టీ కేవలం 155 స్థానాలు దక్కించుకుంటాయని సదరు సర్వే తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఇదే సంస్థ జరిపిన సర్వేలో కన్జర్వేటివ్ పార్టీకి 169 స్థానాలు రావొచ్చని అంచనా వేయగా.. తాజా సర్వేలో ఆ స్థానాలు మరింత తగ్గడం గమనార్హం. పోల్ ఆఫ్ పోల్స్ పోలిటికో సైతం ఇలాంటి ట్రెండ్‌నే ప్రకటించింది. మార్చి 31వ తేదీన వెల్లడించిన సర్వేలో.. 44 శాతం లేబర్ పార్టీకి, 23 శాతం కన్జర్వేటివ్పార్టీకి సీట్లు దక్కవచ్చని వెల్లడించింది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ అక్టోబర్ 24, 2022లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన ముందు పెను సవాళ్లు ఉండగా.. ఆయన వాటిని అధిగమిస్తానని స్పష్టం చేశారు. అయితే.. అప్పటి నుంచి బ్రిటన్ సంక్షోభం మరింత ముదిరింది. ఈ మధ్యలో ఆయన పైనా విమర్శలు వెల్లువెత్తుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మే 2వ తేదీన యూకేలో మేయర్, లోకల్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను వాయిదా వేయించాలని కన్జర్వేటివ్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ, కోర్టులు అందుకు అంగీకరించలేదు. ఇక ఈ ఎన్నికల్లోనూ కన్జర్వేటివ్ పార్టీ ఓటమి తప్పదంటూ ఇప్పటికే పలు సర్వేలు తేల్చేశాయి. -
సర్వేల్లో రిషి సునాక్‌కు షాక్
లండన్: బ్రిటన్‌లో ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు జరిగితే భారత సంతతికి చెందిన రిషి సునాక్‌తోపాటు ఆయన కేబినెట్లోని సగానికి పైగా మంత్రులకు పరాజయం తప్పదని ముందస్తు సర్వేలో తేలింది. అధికార కన్జర్వేటివ్ పార్టీకి 100 పార్లమెంట్ స్థానాలు కూడా దక్కడం గగనమేనని, అదే సమయంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ 468 సీట్లు గెలుచుకుని, 286 సీట్ల మెజారిటీ సాధిస్తుందని కూడా అంచనా వేసింది. బెస్ట్ ఫర్ బ్రిటన్ తరఫున సర్వేషన్ సంస్థ 15,029 మందితో తాజాగా సర్వే జరిపింది. ఇందులో పాల్గొన్న వారిలో 45 శాతం మంది ప్రతిపక్ష లేబర్ పార్టీకే ఓటేశారు.పాయింట్ల వారీగా చూస్తే అధికార కన్జర్వేటివ్ పార్టీ కంటే లేబర్ పార్టీ 19 పాయింట్లు ముందంజలో ఉంది. గత ఏడాది డిసెంబర్లో చేపట్టిన పోలింగ్‌తో పోలిస్తే ఇది మూడు పాయింట్లు ఎక్కువ. కన్జర్వేటివ్ పార్టీ 100 లోపే సీట్లు గెలుచుకోవడం, అంటే 250 ఎంపీ స్థానాలను కోల్పోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారవుతుందని నిర్వాహకులు విశ్లేషిస్తున్నారు. సొంత సీటు రిచ్మండ్ అండ్ నార్త్అల్లెర్టన్లో ప్రధాని రిషి సునాక్‌కు లేబర్ పార్టీ కంటే 2.4 శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.ఈ పోలింగ్‌లో ఎటు వైపూ మొగ్గు చూపని 15 శాతం మంది ఓట్లను పరిగణనలోకి తీసుకోలేదని ‘సర్వేషన్’తెలిపింది. కన్జర్వేటివ్ పార్టీ పరిస్థితి మున్ముందు మరింత దారుణంగా ఉంటుందని ఓ విశ్లేషకుడు అన్నారు. ఇలా ఉండగా, మే 2వ తేదీన స్థానిక కౌన్సిళ్లు, మేయర్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ పేలవమైన ఫలితాలను సాధించిన పక్షంలో ప్రధాని రిషి సునాక్‌పై సొంత పారీ్టలోనే తిరుగుబాటు రావడం ఖాయమని కూడా అంటున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019