breaking news
Ad - Sakshi_Home_Sticky
-
సంచలన నిర్ణయం.. 58 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ వెనక్కు
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొమరియో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 58 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించాడు. స్థానిక టోర్నీలో ఉనికి కోల్పోయిన తన క్లబ్‌కు (అమెరికా ఆఫ్ రియో డి జనైరో) ఊపు తెప్పించేందుకు తిరిగి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఇదే క్లబ్‌కు రొమారియో కుమారుడు రొమారిన్హో (30) కూడా ప్రాతినిథ్యం వహిస్తుండటం ఆసక్తికరం. బ్రెజిల్ బేస్డ్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన అమెరికా ఆఫ్ రియో డి జనైరోకు రొమారియో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. 80, 90 దశకాల్లో స్టార్ స్ట్రయికర్‌గా పేరొందిన రొమారియో 15 ఏళ్ల కిందట (2008) ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆతర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సెనేటర్‌గా పలు మార్లు ఎన్నికయ్యాడు. రొమారియో 1994 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టులో (బ్రెజిల్) కీలక సభ్యుడిగా ఉన్నాడు. ప్రస్తుతం రొమారియో సెనేటర్‌గా ఉంటూనే తన క్లబ్‌ను కష్టాల్లో నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్న విషయాన్ని రొమారియో ఇన్‌స్టా ద్వారా వెల్లడించాడు. అమెరికా ఆఫ్ రియో డి జనైరో తరఫున ఆటగాడిగా బరిలోకి దిగేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రకటించాడు. అయితే తాను ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానన్న విషయాన్ని మాత్రం రొమారియో పేర్కొనలేదు. కాగా, బ్రెజిల్లో ప్రస్తుతం జరుగుతున్న రియో స్టేట్ ఛాంపియన్షిప్ పోటీల్లో అమెరికా ఆఫ్ రియో డి జనైరో క్లబ్ తడబతుంది. గతమెంతో ఘనంగా ఉన్న ఈ క్లబ్ ప్రస్తుతం పేలవ ప్రదర్శనలకు పరిమితమై ఉనికి కోల్పోయింది. రియో క్లబ్లో ఉత్సాహం నింపి పూర్వవైభవం తెచ్చేందుకే రొమారియో తిరిగి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. -
ప్రపంచంలోనే ‘పిన్న’ బిలియనీర్‌గా లివియా
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించి 19 ఏళ్ల కాలేజీ అమ్మాయి లివియా వొయిట్ చరిత్ర సృష్టించింది. 20 ఏళ్లుకూడా నిండని ఈమెకు అత్యంత సంపన్నుడైన తాత నుంచి వారసత్వంగా కోట్ల షేర్లు దక్కడంతో ఒక్కసారిగా వేల కోట్ల అధిపతి అయ్యింది. బ్రెజిల్‌కు చెందిన డబ్ల్యూఈజీ కంపెనీని లివియా తాత వెర్నెర్ రికార్డో వొయిట్ మరో ఇద్దరితో కలిసి స్థాపించారు. ఫోర్బ్స్ సంస్థ 33 ఏళ్ల వయసులోపు ఉన్న 25 మంది యువ బిలియనీర్ల జాబితాను తాజాగా విడుదలచేసింది. ఇందులో లివియా పేరు కూడా ఉంది. దాదాపు రూ.9,165 కోట్ల(1.1 బిలియర్ డాలర్ల) సంపదతో ప్రపంచంలో బిలియనీర్ అయిన అత్యంత చిన్న వయసు్కరాలుగా ఈమె పేరు రికార్డులకెక్కింది. కోట్లకు పడగలెత్తినా ఇంకా ఆమె కంపెనీ బోర్డులో సభ్యురాలిగా చేరలేదు. ఆస్తులతో నాకేం పని అన్నట్లుగా నిరాడంబరంగా లివియా ప్రస్తుతం బ్రెజిల్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతోంది. -
19 ఏళ్లకే బిలియనీర్‌గా స్టూడెంట్..ఆమె ఆస్తి అన్ని కోట్లా?
కొందరు అత్యంత చిన్న వయసులోనే కోటీశ్వరులుగా అవతరిస్తారు. తరతరాల నుంచే వచ్చే ఆస్తుల కారణంగా ఒక్కసారిగా చిన్న వయసులోనే ధనవంతులుగా అయిపోతుంటారు. చెప్పాలంటే కోటీశ్వరులు తమ ఆస్తులను వృద్ధి చేస్తూ మనవళ్లు లేదా మనవరాళ్ల పేర్ల మీద రాయడం వల్ల లేదా మరణం కారణంగానో వాళ్ల వారసులు ఇలా ధనవంతులుగా అయిపోతారు. అలానే ఇక్కడొక విద్యార్థి చిన్నవయసులోనే బిలీయనీర్‌గా అవతరించింది. ఇంతకీ ఎవరంటే ఆమె..? 19 ఏళ్ల బ్రెజిలియన్ విద్యార్థి లివియా వోయిగ్ట్ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్‌గా ఈ ఏడాది ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో స్థానం దక్కించుకుంది. ఆ జాబితాలో 33 ఏళ్ల వయసున్న దాదాపు 25 మంది యువ బిలియనీర్లు ఏకంగా రూ. 11000 కోట్లు సంపదను కలిగి ఉండటం విశేషం. ఇంతకీ ఈ లివయా వోయిగ్ట్ ఎవరంటే.. ఈ ఏడాది 2024లో ప్రపంచంలోనే అత్యంత చిన్న పిన్నవయస్కురాలిగా టైటిల్‌ని గెలుచుకుంది లివయా వోయిగ్ట్. ఇంతకుమునుపు ఆ టైటిల్‌ని అందుకున్న ఎస్సిలర్ టుక్సోటికా వారసుడు డెల్ వెచియా నుంచి లివయా ఆ టైటిల్‌ని అందుకోవడం విశేషం. ఇక ఈ డెల్ వెచియా లివియా కంటే జస్టే రెండు నెలలే పెద్దవాడు. అమెరికాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ మోటార్ల తయారీ కంపెనీ వెగ్(WEG)ని ఆమె తాత వెర్నర్ రికార్డో వోయిగ్ట్, దివగంత బిలియనీర్లు ఎగ్గాన్ జోవో డా సిల్వా, గెరాల్డో వెర్నింగ్హాస్లతో కలిసి స్థాపించారు. ఆ కంపెనీలో లివియా అతి పెద్ద వాటాదారు. ఇక లివియా సంపద నికర విలువ ఏకంగా రూ. 9 వేల కోట్లు. అలాగే ఆమె అక్క డోరా వోగ్ట్ డి అస్సిస్ కూడా ఫోర్బ్స్ అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్ లిస్ట్‌లో ఒకరిగా ఉన్నారు. ఇక డోరా 2020లో ఆర్కిటెక్చర్ డిగ్రీని పూర్తి చేసింది కాగా, లివియా వెగ్(WEG) కంపెనీ బహుళ జాతి కంపెనీగా దాదాపు 10కి పైగా దేశాల్లో కర్మాగారాలు ఉన్నాయి. ఆమె కంపెనీ 2022లో సుమారు రూ. 50 వేల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అయితే లివియా ప్రస్తుతం బ్రెజిల్‌లోని విశ్వవిద్యాలయంలో చదువుతోంది. ఇంకా ఆమె WEGలో బోర్డు లేదా ఎగ్జిక్యూటివ్ హోదాలో సాగకపోయినా అందులో అతిపెద్ద వాటాదారు కావడంతో బిలియనీర్‌గా అవతరించింది. ఇక ఈ బిలియనీర్ ర్యాంకులో చాలామంది యువ వారసులు చేరారు. అందులో ఇద్దరు ఐర్లాండ్ మిస్త్రీ సోదరులు కూడా ఉన్నారు. (చదవండి: మేకల వల్లే కాఫీ గురించి తెలిసిందా? ఆ స్టోరీ తెలిస్తే షాకవ్వుతారు!) -
ప్యాకేజింగ్‌లోనే డ్రగ్స్ కలిశాయా?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ రాకెట్ చిక్కుముడిని విప్పేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణను వేగవంతం చేసింది. బ్రెజిల్ శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన నౌక ట్రావెలింగ్ మ్యాప్ వివరాలను పిన్ టు పిన్ సేకరించే పనిలో సీబీఐ నిమగ్నమైంది. రావాల్సిన సమయం కంటే రెండు రోజులు ఆలస్యంగా ఎందుకు వచ్చిందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సంధ్య ఆక్వా సంస్థ గతంలో చేసుకున్న దిగుమతుల వివరాలను కూడా నిశితంగా పరిశీలిస్తోంది. బ్రెజిల్ నుంచి డ్రైఈస్ట్ కొనుగోలు చేసినట్లు చెబుతుండటంతో అక్కడి నుంచే పరిశోధించేందుకు దర్యాప్తు బృందాలు వెళ్లినట్లు తెలుస్తోంది. పది రోజుల ప్రయాణం.. అసలు ప్యాకేజింగ్‌లోనే డ్రగ్స్ కలిశాయా? లేదా మార్గమధ్యంలో చేరాయా? అనే కోణంలోనూ దర్యాప్తు మొదలైంది. బ్రెజిల్ నుంచి బయలుదేరిన నౌక విశాఖకు రెండు రోజులు ఆలస్యంగా వచ్చిందని సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సాధారణంగా బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు కంటైనర్ షిప్ వచ్చేందుకు 7 నుంచి 8 రోజుల సమయం పడుతుంది. కానీ ఈ షిప్ 10 రోజులకు విశాఖ చేరుకుంది. అందుకు గల కారణాలేమిటనే అంశాలను అన్వేషిస్తున్నారు. ఆ రెండు పోర్టులకు ఎందుకు వెళ్లలేదు? ఓషన్ నెట్వర్క్ ఎక్స్‌ప్రెస్ ఆధ్వర్యంలో డ్రైఈస్ట్‌తో కూడిన కంటైనర్ కార్గో జిన్ లియాన్ యంగ్ గ్యాంగ్ కార్గో షిప్ హెచ్హెచ్ఎల్ఏ కంటైనర్ టెర్మినల్ నుంచి మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరింది. అక్కడి నుంచి షెడ్యూలింగ్ ప్రకారం ఈజిప్జులోని డామిట్టా కంటైనర్ టెర్మినల్‌కు, ఆ తర్వాత సూయజ్ కెనాల్లో బెర్తింగ్ కావాల్సి ఉంది. అయితే ఆ రెండు పోర్టులకు వెళ్లకుండా ‘స్కిప్ కాలింగ్’ చేశారు. నౌక నేరుగా మార్చి 9వతేదీ సాయంత్రం 4 గంటలకు బెల్జియంలోని ఆంట్వెర్ప్ గేట్‌వేకు చేరుకోగా అర్థరాత్రి 1.03 గంటలకు బెర్తింగ్ ఇచ్చారు. 10వతేదీ రాత్రి 9.43 గంటలకు నౌక తిరిగి అక్కడి నుంచి బయల్దేరింది. డాట్లాంటిక్లోని సీఎన్ఎం టెర్మినల్‌కు 11వ తేదీ వేకువ జామున 4 గంటలకు చేరుకుని 12వ తేదీ సాయంత్రం 4.35 గంటలకు బయల్దేరింది. అక్కడి నుంచి కొలంబో పోర్టుకు 13వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకోగా రాత్రి 10.27 గంటలకు తిరిగి బయల్దేరింది. విశాఖ కంటైనర్ టెర్మినల్‌లోని టెర్మినల్–2కి 16వతేదీ సాయంత్రం 5.30 గంటలకు వచ్చింది. అదే రోజు రాత్రి 8.55 గంటలకు నౌకకు బెర్తింగ్ ఇచ్చారు. కొలంబో నుంచి నిర్ణీత సమయంలోనే.. కొలంబో నుంచి విశాఖ వచ్చేందుకు నౌకలకు 3 రోజుల సమయం పడుతుంది. అంటే ఆ నౌక నిర్ణీత సమయంలోనే చేరుకుంది. మరి బ్రెజిల్ నుంచి కొలంబో వచ్చే మార్గంలో సీల్ టాంపరింగ్ ఏమైనా జరిగిందా? అనే కోణంలోనూ సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రెండు పోర్టులకు వెళ్లకుండా నౌకను ఎందుకు దారి మళ్లించారనే విషయంపైనా ఆరా తీస్తున్నారు. రెండు పోర్టులకు వెళ్లకుండా నేరుగా వచ్చినప్పుడు రెండు రోజులు ఎందుకు ఆలస్యమైందనే అంశంపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. బ్రెజిల్‌కు బృందాలు.. సంధ్యా ఆక్వా సంస్థ ప్రతినిధుల కాల్డేటాని విశ్లేషిస్తున్న సీబీఐ బృందం ఎవరెవరికి కాల్స్ వెళ్లాయి? ఏ ప్రాంతాలకు వెళ్లాయి? అనే సమాచారాన్ని ఇప్పటికే సేకరించి ఫోన్ నంబర్ల ఆధారంగా వివరాలు సేకరించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేసింది. బ్రెజిల్లో డ్రైఈస్ట్ ఆర్డర్ చేసిన సంస్థ దగ్గర నుంచి శాంటోస్, బెల్జియం, డాట్లాంటిక్, కొలంబో పోర్టులకు వెళ్లి షిప్ బెర్తింగ్ సమయంలో నిక్షిప్తమైన సీసీ టీవీ ఫుటేజీని సేకరించాలని భావిస్తున్నారు. ఇందుకోసం మరో బృందాన్ని పంపనున్నట్లు సమాచారం. గతంలో సంధ్య ఆక్వా సంస్థ దిగుమతి చేసుకున్న కార్గో వివరాలు, సరుకు ఆర్డర్లు తదితర రికార్డులను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా డ్రగ్స్ అవశేషాలతో వచ్చిన కంటైనర్‌ని విశాఖ కంటైనర్ టెర్మినల్‌లోనే భద్రపరిచారు. -
అక్కడ పోలీసులు పెట్రోలింగ్‌కి గేదెలను ఉపయోగిస్తారట!
దొంగతనాలు జరగకుండా.. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేలా. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుంటారు. అవసరమైతే రాత్రిపూట పెట్రోలింగ్ వంటివి కూడా చేస్తుంటారు. మనకు తెలిసినంతవరకు పోలీసులు పెట్రోలింగ్కుకు పలు రకాల వాహనాలనే ఉపయోగిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం పెట్రోలింగ్ కోసం పోలీసులు గేదెలను ఉపయోగిస్తారట. ఇదేంటి గేదెలతోనా ఆశ్చర్యపోకండి. ఎందుకంటే వాటితో గస్తీ కాయడం అంత ఈజీ కాదు. ఎక్కడ..? ఏ దేశంలో ఇలా చేస్తారంటే..? బ్రెజిల్ దేశంలో మరాజే అనే ఒక ద్వీపం ఉంటుంది. ఈ ద్వీపం స్విట్జర్లాండ్ దేశమంత ఉంటుంది.. అయితే ఇక్కడ పోలీసింగ్ విధానం చాలా వెరైటీగా ఉంటుంది. సాధారణంగా పోలీసులు వాహనాలలో తిరుగుతూ గస్తి నిర్వహిస్తారు. కానీ ఇక్కడి పోలీసులు మాత్రం నీటి గేదెలు, గుర్రాలపై గస్తి నిర్వహిస్తారు.. మరాజో ద్వీపంలో నీటి గేదెలు ఎక్కువగా ఉంటాయి… ఇక్కడ వాతావరణం వాటికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ గేదెలను వందల ఏళ్ల క్రితమే ఫ్రెంచ్ గయానా దేశస్తులు తీసుకొచ్చారని అక్కడి స్థానికులు చెబుతుంటారు. ఈ ద్వీపంలో నాలుగు లక్షల 40 వేల మంది జీవిస్తుంటారు. ఈ ప్రాంతం ఉష్ణ మండల వాతావరణానికి ప్రసిద్ధి చెందింది.. జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా చిన్నగా ఉన్న ఈ ద్వీపంలో పోలీసులు గేదెలపై లేదా గుర్రాలపై సవారి చేస్తూ భద్రతను పర్యవేక్షిస్తూ.. గస్తీ కాస్తూ ఉంటారు. ఇక్కడ నీటి గేదెలను గస్తీ కోసం మాత్రమే కాకుండా.. వాటిని వధించి ఆ మాంసాన్ని వండుకొని తింటారు కూడా. అంతేగాదు ఈ ప్రాంతంలో బఫెలో స్టిక్స్ అనే వంటకం అత్యంత ప్రసిద్ధి చెందింది. మోజారెల్లా గ్రేసింగ్ రెస్టారెంట్లో బఫెలోస్టిక్స్ ప్రత్యేకంగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు చెబుతుంటారు. అయితే పోలీసులకు శిక్షణలో భాగంగా గేదెలపై సవారి నేర్చించడం జరుగుతుంది. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. బురద నిండిన మడ అడవులలో గేదెలపైకి నూతనంగా రిక్రూట్ అయిన పోలీసులను ఎక్కించి శిక్షణ ఇస్తుంటారు. ఆ గేదెను సవారి చేయడంలో నైపుణ్యం సంపాదించిన వారికి మాత్రమే గస్తీ కాసే బాధ్యత అప్పగిస్తారు. అయితే గేదెను నియంత్రించడం అనేది అంత ఈజీ మాత్రం కాదు. ఇది అత్యంత సవాల్ తో కూడుకున్నదని ఇక్కడి సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు.. ఇలా గేదెలపై పోలీసులు గస్తీ కాస్తుండడం అనేది ఇక్కడకు వచ్చే పర్యాటకులకు మాత్రం వింతగా కనిపిస్తుంది. ఇది ఒకరకంగా ప్రకృతి, దేశ సంస్కృతి ఒక దానిపై ఒకటి ముడిపడి ఉన్నాయి అని చెప్పేందుకు తమ దేశ పోలీసులు ఇలా గేదెలపై గస్తీ కాస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు. అలాగే ఈ గేదె బలం, సహకారం, ప్రత్యేక జీవన విధానానికి చిహ్నంగా ఉంటుంది. అందువల్లే దీన్ని తాము ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు. (చదవండి: హీరోయిన్లా కనిపించాలని వందకుపైగా సర్జరీలు! అందుకోసం..)
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019