breaking news
-
అక్రమ వలసలకు చెక్.. సంచలన బిల్లు తెచ్చిన బ్రిటన్
లండన్: అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటున్న బ్రిటన్ వాటిని ఆపేందుకు సంచలన బిల్లు తీసుకువచ్చింది. మంగళవారం(ఏప్రిల్23) ‘సేఫ్టీ ఆఫ్ రువాండా’ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుతో అక్రమ వలసదారులకు అడ్డకట్టపడనుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారందరినీ ఆఫ్రికా దేశం రువాండాకు తరలిస్తారు. బ్రిటన్ రాజు చార్లెస్ 3 ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారుతుంది. బ్రిటన్‌కు వచ్చే అక్రమ వలసదారులను ఆపడానికి రువాండా బిల్లు తీసుకువచ్చినట్లు ప్రధాని రిషి సునాక్ తెలిపారు. దేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చేవారు నివసించడానికి ఇక నుంచి వీలులేదని చెప్పారు. అక్రమ వలసదారులను విమానాల్లో తీసుకువెళ్లి దేశం బయట వదిలేస్తామన్నారు. -
స్మోకింగ్ బ్యాన్..! రిషి సునాక్‌పై వ్యతిరేకత
లండన్: బ్రిటన్‌లో స్మోకింగ్ బ్యాన్ చట్టంపై ప్రధాని రిషి సునాక్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 2009 తర్వాత పుట్టిన వారికి అంటే.. 15, 15 ఏళ్లలోపు వయసు ఉన్న వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడాన్ని నిషేధించే చట్టాన్ని సునాక్ గతేడాదే ప్రతిపాదించారు. మంగళవారం (ఏప్రిల్16) ఈ చట్టాన్ని బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టారు. సునాక్ సొంత పార్టీ కన్జర్వేటివ్స్ ఎంపీల్లో కొందరు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ ప్రధానులు లిజ్ ట్రుస్, బొరిస్ జాన్సన్‌లు కూడా ఈ చట్టంపై వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం అమలు చేయడమంటే ప్రజల ఇష్టాఇష్టాలను నియంత్రించడమేననేది వారి వాదన. వేల కొద్ది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, ఒక జనరేషన్‌ను స్మోకింగ్ నుంచి దూరంగా ఉంచేందుకు ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని యూకే హెల్త్ సెక్రటరీ విక్టోరియా అట్కిన్స్ తెలిపారు. ఈ చట్టం దేశంలో ప్రొడక్టివిటీని పెంచడమే కాకుండా నేషనల్ హెల్త్ సర్వీస్‌పై భారాన్ని తగ్గిస్తుందన్నారు. ఇదీ చదవండి.. మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్ -
‘ఉబర్’ రైడ్‌కు కోట్లలో బిల్లు..! షాక్ అయిన కస్టమర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో దీపక్ తెంగురియా అనే వ్యక్తి రొటీన్‌గా తాను వెళ్లే రూట్లో ఉబర్ ఆటో రైడ్ బుక్ చేశాడు. రైడ్ తక్కువ దూరమే అయినందున రూ.62 బిల్లు చూపించింది. మామూలే కదా అని ఆటో ఎక్కి డెస్టినేషన్‌లో దిగి బిల్లు పే చేద్దామనుకునే సరికి దీపక్ అవాక్కయ్యాడు. ఏకంగా రూ.7.66 కోట్లు పే చేయాలని బిల్లు చూపించింది. దీంతో ఆశ్చర్యపోవడం దీపక్ వంతైంది. దీపక్‌కు ఇంత భారీ బిల్లు రావడానికి సంబంధించిన వీడియోను ఆయన స్నేహితుడు ఆశిష్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశాడు. దీనిపై వీడియోలో స్నేహితులిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చంద్రయాన్‌కు రైడ్ బుక్ చేసుకున్నా ఇంత బిల్లు రాదని ఇద్దరు స్నేహితులు జోకులు వేసుకున్నారు. सुबह-सुबह @Uber_India ने @TenguriyaDeepak को इतना अमीर बना दिया कि Uber की फ्रैंचाइजी लेने की सोच रहा है अगला. मस्त बात है कि अभी ट्रिप कैंसल भी नहीं हुई है. 62 रुपये में ऑटो बुक करके तुरंत बनें करोडपति कर्ज़दार. pic.twitter.com/UgbHVcg60t — Ashish Mishra (@ktakshish) March 29, 2024 అయితే అతి తక్కువ దూరం ఆటో రైడ్‌కు కోట్లలో బిల్లు రావడంపై ఉబర్ స్పందించింది. ‘భారీ బిల్లు ఇచ్చి ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు. మాకు కొంత సమయమిస్తే దీనిపై అప్డేట్ ఇస్తాం’అని ఉబర్ సందేశం పంపింది. ఇదీ చదవండి.. వీల్ చైర్లో వచ్చాడు.. విల్ పవర్ చూపాడు -
ఫ్రాన్స్ పార్లమెంట్లో అబార్షన్ బిల్లుకు ఆమోదం!
ఫ్రాన్స్ పార్లమెంట్లో జరిగిన సంయుక్త సమావేశంలో అబార్షన్ బిల్లుకు ఆమోదం లభించింది. ఫ్రాన్స్ రాజ్యాంగంలో మహిళలకు గర్భస్రావం చేయించుకునే హక్కును పొందుపరిచే బిల్లుకు ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు. అబార్షన్‌ను రాజ్యాంగంలో చేర్చిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. ఈ బిల్లు అత్యధిక ఓట్లతో ఆమోదం పొందిన నేపధ్యంలో ఉమ్మడి సెషన్‌లోని సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మహిళా హక్కుల కోసం పనిచేస్తున్నవారంతా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ బిల్లుకు చట్టపరమైన రూపం కల్పించేందుకు ఫ్రెంచ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 34ను సవరించారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో అంటే జాతీయ అసెంబ్లీ,సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మహిళలకు అబార్షన్ హక్కును కల్పిస్తుంది. ఉమ్మడి సెషన్‌ను ప్రారంభించిన దిగువ సభ స్పీకర్ యాయెల్ బ్రాన్-పివెట్ మాట్లాడుతూ మహిళకు అబార్షన్ హక్కును కల్పించిన మొదటి దేశం ఫ్రాన్స్ అని అన్నారు. ఈ బిల్లు ఆమోదానికి ముందు ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియెల్ అటల్ మాట్లాడుతూ మహిళలు ఇకపై అబార్షన్ విషయంలో సొంత నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. మరోవైపు అబార్షన్‌ను వ్యతిరేకిస్తున్న సంస్థలు, కార్యకర్తలు ఈ బిల్లును ఆమోదంపై పార్లమెంటు నిర్ణయాన్ని తప్పుబట్టారు. అధ్యక్షుడు మాక్రాన్ రాజకీయ లబ్ధి కోసం ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని వారు ఆరోపించారు. NEW: France's Parliament votes to make abortion a constitutional right, the first country in the world to do so. French PM Gabriel Attal: " We're sending a message to all women: your body belongs to you and no one can decide for you." pic.twitter.com/xI7EyZwvMv — Lewis Goodall (@lewis_goodall) March 4, 2024 -
పబ్లిక్ పరీక్షల బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో అవతకవకలకు పాల్పడే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు–2024కు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. బిల్లుపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనూరాధ మాట్లాడుతూ.. పబ్లిక్ పరీక్షలు, ఉద్యోగ నియామకాల పరీక్ష పత్రాల లీక్ కారణంగా నష్టపోయిన కోట్లాది మంది యువత ఈ తరహా బిల్లు కోసమే ఎదురు చూస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష పత్రాలు లీక్‌చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఓబీసీల చేర్పు అభినందనీయమని ఎంపీ చింతా అనూరాధ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ స్థానిక సంస్థల చట్టాల బిల్లుకు వైఎస్సార్సీపీ తరఫున మద్దతు ప్రకటించారు. ఏకలవ్య పాఠశాలలు అత్యవసరం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు అత్యవసరమని వైఎస్సార్సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. జమ్మూ కశ్మీర్ షెడ్యూల్డ్ కులాల, తెగల ఆర్డర్ సవరణ బిల్లులు–2024కు వైఎస్సార్సీపీ తరఫున మద్దతు ప్రకటించారు. వేగివాడలో డీఎస్పీ పశ్చిమ గోదావరి జిల్లా వేగివాడలో ‘డిమాన్స్ట్రేషన్ కం సీడ్ ప్రొడక్షన్ ఫారం’ (డీఎస్పీ) ఏర్పాటు చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిచ్చారు. విశ్వవిద్యాలయాల్లో ఫ్రీ కోచింగ్ అంబేడ్కర్ ఫౌండేషన్ (డీఏఎఫ్)’, అంబేడ్కర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (డీఏసీఈ) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఉచిత కోచింగ్ స్కీమ్ నిర్వహిస్తున్నట్టు కేంద్ర సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ మార్గాని భరత్ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. ఏపీలో 24 కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులు వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలను అవలంభించేందుకు ఏపీలో 24 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకేల)ను ఏర్పాటు చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిస్తూ.. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో రెండేసి చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకటి చొప్పున కేవీకేలు ఉన్నట్టు వివరించారు. మిల్లెట్, ఎర్రపప్పు, బెంగాల్ చిట్రా, కదిరి, వేరుశనగ వంటి పంటల ఉత్పత్తి కోసం కరువు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మొబైల్ సందేశాలతో రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019