breaking news
-
Mehreen Pirzada: చాలా రోజుల తర్వాత గ్లామర్ ట్రీట్ ఇచ్చిన మెహరీన్ (ఫోటోలు)
-
రద్దీ బస్సులో బికినీలో అమ్మడు : ఒక్కసారిగా షాకైన జనం
ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అభ్యంతర కర తరహాలో బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కింది. దీంతో తోటి ప్రయాణీకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోపై నెటిజన్లలో విభిన్న స్పందనలు కనిపించాయి. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో బుధవారం ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ మహిళ టూపీస్ బికినీలో బస్సెక్కడం కనిపించింది. అప్పటికే అక్కడ నిలబడి ఉన్న ఓ వృద్ధురాలు పక్కకు వెళ్లిపోగా సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు సైతం లేచి వెళ్లిపోవడం గమనార్హం. దీపికా నారాయణ భరద్వాజ్ అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకి దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. (ఫుడ్ ఫోటోగ్రాఫర్ అవార్డుల పోటీ : ఈ అద్భుతమైన ఫోటోలు చూశారా?) బికినీలో ఆమెను చూసి షాక్ అయ్యామని కొందరు వ్యాఖ్యానించారు. ఆమె తీరును అభ్యతరకరంగా ఉందననారు. మరికొందరు మాత్రం ఆమె బట్టలు ఆమె ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛను గట్టిగా సమర్థించారు. కాగా ఢిల్లీ మెట్రో రైల్లోనూ ఓ మహిళ బ్రా, మినీ స్కర్ట్ తో ప్రయాణించి కలకలం రేపింది.అలాగే హోలీ సందర్భంగా ఇద్దరు అమ్మాయిలు చేసిన రీల్స్ కూడా వివాదాన్నా రేపిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతంపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పందించింది. తాజా ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు. (కొంచెం శ్రద్ధ ఉంటే చాలు..టెర్రస్ మీదే బోలెడన్ని మొక్కలు) What's really happening 😵💫😵💫pic.twitter.com/rfjavOsWMp — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 17, 2024 -
బికినీ ధరించిన మొదటి హీరోయిన్ ఎవరు..? ఆమె ఎలా మరణించారో తెలిస్తే..
బాలీవుడ్ హీరోయిన్ నళిని జయవంత్ 20వ శతాబ్దం మధ్యకాలంలో హిందీ చిత్రాలలో ఒక ఊపు ఊపేసింది. ముంబైలో పుట్టిన నళిని తనకు 15 ఏళ్ల వయసులోనే అంటే 1941లో హీరోయిన్గా బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ రోజుల్లో ఆమె నటించిన చిత్రాలలో లెక్కలేనన్ని భారీ హిట్లు కొట్టాయి. పరిశ్రమకు ఆమె చేసిన కృషి చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ , ఆమె తన తరువాతి సంవత్సరాలలో ఒంటరిగా జీవించి.. 84 సంవత్సరాల వయస్సులో 2010లో మరణించింది. ఆమె మరణం చాలా విషాధంతో కూడుకొని ఉంది. అత్యంత అందమైన హీరోయిన్గా గుర్తింపు 1950వ దశకంలో, ఫిల్మ్‌ఫేర్ నిర్వహించిన ఒక పోల్‌లో అత్యంత అందమైన మహిళగా ఆమె ఎంపికైంది. దిలీప్ కుమార్ వంటి స్టార్ హీరో కూడా తనతో పాటుగా కలిసి పనిచేసిన వారిలో గొప్ప నటి నళిని జయవంత్ అని ప్రశంసించారు. బాలీవుడ్ నివేదికల ప్రకారం, బికినీ ధరించిన మొదటి నటి నళిని జయవంత్ అని ఉంది. ఆమె ఇండియన్ ఒకప్పటి స్టార్ హీరోయిన్, దర్శకురాలు అయిన శోభనా సమర్థ్‌కు మొదటి కోడలు. 1950లో విడుదలైన సంగ్రామ్ చిత్రంలో నళిని జయవంత్ స్విమ్ సూట్ ధరించారు. అప్పట్లో ఆమె బికినీ ఫోటోలు ప్రేక్షకులను షాక్ గురిచేశాయి. ఈ చిత్రంలో అశోక్ కుమార్ సరసన నళిని జతకట్టింది. ఫిల్మ్‌ఫేర్ నివేదికల ప్రకారం ఆవారా (1951)లో నర్గీస్ స్విమ్ సూట్ ధరించింది. ఆ తర్వాత శోభనా సమర్థ్ కుమార్తె అయిన 'నూతన్' కూడా 'డిల్లీ కా థగ్' (1958) చిత్రంలో స్విమ్సూట్ను ధరించి మెప్పించారు. ఆ ఒక్క సినిమాతో నూతన్‌కు కూడ భారీ అవకాశాలు వచ్చాయి. అలా నూతన్, నళిని జయవంత్ ఒకే కుటుంబం నుంచి ఇద్దరూ బాలీవుడ్‌నే ఏలేశారు. నూతన్ సోదరి అయిన తనూజ కూతురే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్. నళినీ మరణించిన మూడు రోజులకు.. నళినీ జయవంత్ డిసెంబర్ 22, 2010న 84 ఏళ్ల వయసులో ముంబైలోని చెంబూర్ వద్ద ఉన్న యూనియన్ పార్క్‌లోని తన బంగ్లాలో 60 ఏళ్లుగా జీవించి కన్నుమూశారు. ఆమె మరణించిన మూడు రోజుల తర్వాత ఆమె మరణించినట్లు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ వచ్చే వరకు కూడా నళినీ చనిపోయినట్లు ఎవరూ గమనించబడలేదు. దుర్వాసన రావడంతో గమనించిన ఒకరు సమాచారం ఇవ్వడంతో ఆమె మరణ వార్త బయటి ప్రపంచానికి తెలిసింది. 2001లో తన భర్త ప్రభు దయాళ్ మరణించిన తర్వాత నళినీ పూర్తిగా తనను తాను ఒంటరిగా ఉండేలా బంధించుకుంది. అలా తొమ్మిదేళ్ల పాటు జీవించి దారుణమైన స్థితిలో కన్నుమూసింది. ఆమెకు పిల్లలు లేరు. వృద్ధాప్యంలో బంధువులు కూడా ఆమె వద్దకు ఎవరూ రాకపోవడంతో ఒక అనాథలా తన జీవితాన్ని ముగించింది. 1941 నుంచి 1983 వరకు సుమారు 80కి పైగా చిత్రాల్లో నటించిన నళినీకి 2005లో దాదాహెబ్ ఫాల్కే అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారం దక్కింది. -
బికినీలో టాలీవుడ్ స్టార్.. వీడియో వైరల్!
టాలీవుడ్లో మంచులక్ష్మి పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ నటులు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా తర్వాత తన సొంత టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మోహన్‌లాల్ నటించిన మాన్స్టర్ మూవీతో ప్రేక్షకులను అలరించిన మంచు లక్ష్మి ప్రసన్న.. ప్రస్తుతం అగ్నినక్షత్రం అనే సినిమాలో నటిస్తోంది. సినిమాలతో బిజీగా ఉండే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటోంది. ప్రస్తుతం విదేశాల్లో వేకేషన్లో ఉన్న మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో బికినీలో కనిపిస్తూ గడ్డకట్టే చల్లని నీటిలో మునుగుతూ కనిపించింది. ఆ వీడియోలో సన్నింగ్ లుక్‌లో అభిమానులకు ఒక్కసారిగా షాకిచ్చింది టాలీవుడ్ భామ. ఇదంతా క్రియో థెరపీ కోసమేనంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం మంచులక్ష్మి ఫిన్లాండ్ వెకేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Frozen thrill, no chill! ❄️ #CryoTherapy pic.twitter.com/MN4ccHl1yS — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) December 17, 2023 I am thrilled to reveal Telusa Telusa from the movie #Agninakshatram by @LakshmiManchu So turn up the volume and listen now:https://t.co/pptzkiUdJB And that's not all! "Vaanam Thuram Illaiye" is also out now in Tamil too.https://t.co/KWEwHZAOvq ♥️ pic.twitter.com/iE4CZQRGV0 — Samantha (@Samanthaprabhu2) March 9, 2023 -
బికినీతో ఎయిర్‌పోర్టుకు మోడల్.. ఖంగుతిన్న సిబ్బంది..
బికినీ డ్రెస్‌లో ఎయిర్‌పోర్టుకు వచ్చింది బ్రిజెల్కు చెందిన ఓ మోడల్. మోడల్ విపరీత స్వభావానికి ఖంగుతిన్న సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. సరైన దుస్తులు ధరిస్తేనే విమానంలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. సెక్యూరిటీ పట్టువీడకపోవడంతో ఆ మోడల్ ఎట్టకేలకు వెనుదిరిగారు. తనకు ఎదురైన కష్టాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. కేన్ చాన్(21) ఓ ప్రముఖ మోడల్. బ్రెజిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న కేన్ చాన్‌ను ఇన్‌స్టాలో 6 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. నిత్యం ఈవెంట్లతో బిజీగా ఉండే ఆవిడ.. బ్రెజిల్‌లోని నవేగాంటెస్ ఎయిర్‌పోర్టుకు బికినీలో వెళ్లింది. కేవలం నల్లని బికినీ, విగ్, నల్లని షాండిల్స్ను ధరించింది. ఇది అచ్చం అనిమే వెబ్ సిరీస్ సైబర్ ఫంక్లోని రెబక్కా వేషధారణలాగే ఉంది. మోడల్ వేషధారణ చూసిన ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెను అడ్డగించారు. ఇలాంటి దుస్తులు ధరిస్తే అనుమతించబోమని అన్నారు. శరీరాన్ని కప్పుకునే దుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈవెంట్‌కు ఆలస్యం అవుతున్న కారణంగానే తాను అలాంటి దుస్తులు ధరించాల్సి వచ్చిందని కేన్ చాన్ తెలిపారు. సమయం వృథా చేయలేక ఈవెంట్‌కు సంబంధించిన దుస్తులు వేసుకున్నానని చెప్పారు. View this post on Instagram A post shared by Kine-chan/Digital Influencer (@kinechan2.0) కేన్ చాన్ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు మోడల్‌కు మద్దతు తెలపగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాజంలో కనీస విలువల్ని కాపాడాలని, దుస్తులు సరిగా ధరించాలని మోడల్‌కు విన్నవించారు. కొన్నిసార్లు ఈవెంట్ల మధ్య చాలా తక్కువ సమయం ఉంటుందని, ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుందని మరికొందరు ఆమెకు మద్దతు పలికారు. కొందరైతే లవ్ యూ మేడమ్.. కానీ ఇలాంటి డ్రెస్సులు వద్దని సూచించారు. ఇదీ చదవండి: సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు.. తవ్వి చూసి గుడ్లు తేలేశారు!
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019