breaking news
-
మరోసారి అమెరికా జోక్యం.. ఈసారి కాంగ్రెస్ ఖాతాలపై
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ వ్యవహరంపై అమెరికా స్పందన మరవకముందే.. అగ్రరాజ్యం భారత్‌కు సంబంధించిన మరో అంశంపై స్పందించింది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహరంపై అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భారత్‌లోని అమెరికా దౌత్యవేత్తకు బుధవారం సమన్లు కూడా జారీ చేయటం తెలిసిందే. అయితే ఘటన మరవకముందే అమెరికా భారత్‌కు సంబంధించిన మరో అంశంపై స్పందించటం గమనార్హం. తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించిన అంశంపై మరోసారి అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ప్రచారం చేయకుండా ఆ పార్టీకి సంబంధించిన పలు బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలు మాకు తెలుసు. ఈ విషయంలో కూడా మేము పారదర్శకత, సమయానుకూల న్యాయ ప్రక్రియను ప్రోత్సహిస్తాం’ అని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాత్యు మిల్లర్ అన్నారు. అయితే సీఎం కేజ్రీవాల్ విషయంలో స్పందించిన అమెరికా రాయబారికి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ.. ఆదేశ దౌత్యవేతకు భారత్ ఇచ్చిన సమన్లపై స్పందింస్తూ.. ‘నేను ప్రైవేట్ దౌత్యపరమైన వ్యాఖ్యలు చేయదలుచుకోలేను. కానీ, సీఎం కేజ్రీవాల్ విషయంలో నేను ఇక్కడి నుంచే బహిరంగంగా మేము పారదర్శకత, సమయానుకూల న్యాయప్రక్రియను ప్రోత్సహిస్తాం అని. మా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తే మేం పట్టించుకోం. ఇదే విషయాన్ని మేము ప్రైవేట్‌గా కూడా ఇలాగే స్పష్టం చేస్తాం’అని మాత్యు మిల్లర్ స్పష్టం చేశారు. గత లోక్‌సభ ఎన్నికలు జరిగిన 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 210 కోట్ల ఆదాయపన్ను కట్టాలంటూ తమ పార్టీకి చెందిన నాలుగు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసిందని, వాటిలో యూత్ కాంగ్రెస్ ఖాతా కూడా ఉందని ఇటీవల కాంగ్రెస్ పార్టీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా అమెరికా స్పందించటం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. దీనికి భారత్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో చూడాలి. -
Lok sabha elections 2024: పార్టీని ఆర్థికంగా చిదిమేసే కుట్ర
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ సభలు, ర్యాలీలు, అభ్యర్థుల భారీ ప్రచార కార్యక్రమాలకు ఎంతో ధనం అవసరమైన వేళ ప్రధాని మోదీ వ్యవస్థీకృతంగా కుట్రలు పన్ని కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా చిదిమేసేందుకు బరితెగించారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఢిల్లీలో పత్రికా సమావేశంలో సోనియా, పార్టీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాం«దీలు మాట్లాడారు. పార్టీలో ముగ్గురు అగ్రనేతలు ఒకేసారి మీడియాతో మాట్లాడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల ప్రచారఖర్చులు, ప్రకటనలకు భారీ మొత్తంలో నగదు అవసరమైన వేళ తమ బ్యాంక్ ఖాతాలను అదునుచూసి స్తంభింపజేయడాన్ని నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ‘కాంగ్రెస్‌కు ప్రజలిచి్చన నగదు విరాళాలను బలవంతంగా లాగేసుకున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం. ఓవైపు ఎలక్టోరల్ బాండ్లపై నిషేధం, మరోవైపు ఖాతాల స్తంభనతో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు. ఇవి నిజంగా అనూహ్యమైన తీవ్ర అవరోధాలు. ఇలా అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటూ కూడా మా శక్తిమేరకు అద్భుతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను చేపట్టగలుగుతున్నాం. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారన్నది సుస్పష్టం. ప్రధాన ప్రతిపక్షం ఆర్థికమూలాలపై దాడి చేశారు’ అని సోనియా ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఫ్రీజ్ చేస్తేనే ఆరోగ్యకర పోటీ సాధ్యం: ఖర్గే ‘డీఫ్రీజ్ చేయడమే ఎన్నికల్లో ఆరోగ్యకర పోటీకి బాటలుపరుస్తుంది. సాధారణ ప్రజానీకం కాంగ్రెస్‌కు విరాళంగా ఇచి్చన మొత్తాలను ఫ్రీజ్ చేసి, ఐటీ శాఖతో బలవంతంగా రూ.115.32 కోట్లు నగదు విత్‌డ్రా చేయించి మమ్మల్ని బీజేపీ లూటీ చేసింది. స్వేచ్ఛాయుత, పారదర్శకమైన ఎన్నికలు అత్యావశ్యకమైన ఈ తరుణంలో రాజ్యాంగబద్ధ సంస్థలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలను డీఫ్రీజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అని ఖర్గే కోరారు. ‘బీజేపీ అధికారంలో ఉంది. పైగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ తమ ఖాతాలను వేల కోట్ల రూపాయలతో నింపేసుకుంది. ఎన్నికల్లో దీటైన పోటీకి వీలు లేకుండా మా పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. అధికారంలో ఉన్న వారు ప్రత్యక్షంగాగానీ పరోక్షంగానీ రాజ్యాంగబద్ధ సంస్థలపై నియంత్రణ కల్గి ఉండొద్దు. వనరులపై గుత్తాధిపత్య ధోరణి అస్సలు మంచిది కాదు’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. రూ.2 కూడా చెల్లించలేని పరిస్థితి: రాహుల్ ‘ప్రధాన ప్రతిపక్షం అన్ని అకౌంట్లను ఫ్రీజ్చేయడం అంటే అది కాంగ్రెస్‌పై మాత్రమే ప్రభావం చూపదు దేశ ప్రజాస్వామ్యానికీ అది విఘాతమే. ఎన్నికల్లో పోటీచేసే సామర్థ్యాన్ని దెబ్బతీశారు. మేం ప్రచార కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాం. ఫ్రీజ్ చేసి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరపూరిత చర్యకు పాల్పడ్డారు. ఇలాంటి చర్యలతో దేశంలో ప్రజాస్వామ్యం ఉందనడం అబద్ధమే అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థలేవీ ఇక్కడ పని చేయట్లేవు’ అని రాహుల్ అన్నారు. ‘ఖాతాల స్తంభనతో కరెన్సీ కష్టాలు విపరీతంగా పెరిగాయి. మా నేతలు, అభ్యర్థులు విమానాల్లో దేశంలోని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లలేని పరిస్థితి. విమానం సంగతి పక్కనబెట్టండి. కనీసం రైలు టికెట్ కొనేందుకు కూడా కష్టపడుతున్నాం. 20 శాతం ఓటుబ్యాంక్ మాకున్నా రూ.2 కూడా చెల్లించలేని పరిస్థితి. అదునుచూసి ఎన్నికలకు రెండు నెలల ముందు మోదీ పన్నిన కుట్ర ఇది. ఇంత జరుగుతున్నా ఈసీ మౌనంవహించడం విచారకరం. ఈ విషయంలో ఈసీ ఇంతవరకు స్పందించలేదు’ అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఓటమి ఖాయం కావడంతో కావాలనే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు గుప్పిస్తోందని బీజేపీ ప్రతివిమర్శ చేసింది. అసుర శక్తిపైనే పోరాటం: రాహుల్ విద్వేషం నిండిన ఆసుర(రాక్షస) శక్తిపై తమ పార్టీ పోరాటం సాగిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ‘శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం’ అంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్య లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్వేషం నిండిన అసుర శక్తిపైనే తమ పోరాటం అని రాహుల్ గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో స్పష్టం చేశారు. అసుర శక్తిని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. -
డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్ల బ్యాంకు ఖాతాల జప్తు
న్యూఢిల్లీ: కీలక వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘనకు గాను దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ ప్రమోటర్ల బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ హోల్డింగ్స్‌ను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధించిన జరిమానా, వడ్డీ, రికవరీ వ్యయాలతో కలిపి మొత్తం రూ. 22 లక్షలు రాబట్టేందుకు ఈ మేరకు ఆదేశాలిచి్చంది. వివరాల్లోకి వెడితే..డీహెచ్ఎఫ్ఎల్ ప్రామెరికా లైఫ్ ఇన్సూరెన్స్‌లో డీహెచ్ఎఫ్ఎల్కి గల వాటాలను అనుబంధ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ ఇన్వెస్ట్మెంట్స్కి గతంలో బదలాయించారు. అప్పట్లో డీహెచ్ఎఫ్ఎల్కి (ప్రస్తుతం పిరమల్ ఫైనాన్స్) సీఎండీగా కపిల్ వాధ్వాన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఆయన సోదరుడు ధీరజ్ వాధ్వాన్ ఉన్నారు. షేర్ల బదలాయింపునకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ నోటీసులో పూర్తి సమాచారం ఇవ్వకపోవడానికి వారిద్దరూ బాధ్యులని సెబీ తన విచారణలో తేలి్చంది. 2023 జూలైలో చెరి రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు ఇచ్చింది. కానీ దాన్ని చెల్లించడంలో వారు విఫలం కావడంతో తాజాగా రెండు వేర్వేరు అటాచ్మెంట్ నోటీసులు ఇచి్చంది. ఆయా ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలకు అనుమతించరాదని అన్ని బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యుచువల్ ఫండ్స్‌కి సూచించింది. వాధ్వాన్లు తమ బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల్లోని నిదులను మళ్లించే అవకాశం ఉందని విశ్వసిస్తున్నామని, అలా జరిగితే జరిమానాను రాబట్టడం కుదరదనే ఉద్దేశంతో ఈ నోటీసులు ఇస్తున్నట్లు సెబీ తెలిపింది. -
Income Tax Department: కాంగ్రెస్ ఖాతాల స్తంభన
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రద్దుచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మోదీ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఆదాయ పన్ను శాఖ స్తంభింపజేయడం కలకలం సృష్టించింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసులో ఐటీ రిటర్నుల్లో రూ.210 కోట్ల వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో వాటి రికవరీ కోసం ఆయా ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసినట్లు వార్తలొచ్చాయి. పార్టీ ప్రధాన ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో కాంగ్రెస్ వేగంగా స్పందించింది. వెంటనే ఐటీ, ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ)ను ఆశ్రయించింది. దీంతో ట్రిబ్యునల్ కాస్త కాంగ్రెస్‌కు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. ఆయా ఖాతాల్లో మొత్తంగా రూ.115 కోట్లు అలాగే నిల్వ ఉంచి మిగతాది మాత్రమే విత్‌డ్రా, ఇతరత్రా అవసరాలకు వాడుకోవచ్చని సూచించింది. వెంటనే ఆయా ఖాతాలను డీ ఫ్రీజ్ చేయాలని ఐటీ అధికారులను ఆదేశించింది. ట్రిబ్యునల్ ఆదేశాలతో సంబంధిత ఖాతాలన్నీ పునరుద్ధరించబడ్డాయి. ట్రిబ్యునల్ ఈ అంశంపై బుధవారం మరోసారి వాదనలు విననుంది. ఫ్రీజ్ చేసిన ఖాతాల్లో యూత్ కాంగ్రెస్ ఖాతాలూ ఉన్నాయి. ఖాతాల స్తంభనపై మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘‘ 2018–19 ఆర్థికంలో ఐటీ రిటర్నులను కాస్త ఆలస్యంగా సమరి్పంచాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ జీతభత్యాలను పారీ్టకి విరాళాల రూపంలో ఇచ్చారు. అలాంటి కొన్ని మొత్తాలు ఐటీ రిటర్నుల్లో ప్రతిబింబించలేదు. అంతమాత్రానికే ప్రధానమైన తొమ్మిది ఖాతాలను స్తంభింపజేస్తారా?’ అని కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ మాట్లాడారు. ‘‘ ఖాతాల్లో ఉన్న మొత్తంలో రూ.115 కోట్లే అత్యంత ఎక్కువైనది. సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి మిగతా డబ్బు అస్సలు సరిపోదు. రాబోయే లోక్‌సభ ఎన్నికల వేళ ఇలా ఖాతాలను ఫ్రీజ్ చేస్తే ఎన్నికల్లో పార్టీ భాగస్వామి కావడం చాలా కష్టం’’ అని మాకెన్ అన్నారు. భయపడకండి మోదీ జీ: రాహుల్ ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘ భయపడకండి మోదీ జీ! కాంగ్రెస్ ప్రజాశక్తికి కాంగ్రెస్ చిరునామా. నియంతృత్వం ముందు మోకరిల్లేది లేదు’’ అన్నారు. అధికార దాహంతో లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఖాతాలను ప్రభుత్వం స్తంభింపచేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టాక ఇలాంటి ఆరోపణలకు కాంగ్రెస్ చాలా సమయం దొరుకుతుందంటూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎద్దేవాచేశారు. -
కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్, కాసేపటికే..
సాక్షి, ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లు అన్ని ఫ్రీజ్ అయ్యాయి. పన్ను చెల్లించలేదన్న కారణంగానే అకౌంట్లను ఫ్రీజ్ చేశారని, ఇందులో రాజకీయ దురేద్దేశం కనిపిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే కాంగ్రెస్ ఈ విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చిన గంటలోపే.. ఆ పార్టీకి ఉపశమనం లభించింది. అకౌంట్లను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అకౌంట్లు ఫ్రీజ్ అయిన విషయాన్ని కాంగ్రెస్ నేత, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ శుక్రవారం మీడియా ద్వారా తెలియజేశారు. ఈ చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణించిన ఆయన.. న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కలవరపరిచే అంశం ఇది. రూ.210 కోట్లు ట్యాక్స్ కట్టలేదని ఆదాయ పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత చర్య.. పార్టీ ఎన్నికల సంసిద్ధతను దెబ్బ తీసేందుకే’ అని మాకెన్ ఆరోపించారు. 2018-19 ఎన్నికల ఏడాదికి సంబంధించి 45 రోజులు ఆలస్యంగా పార్టీ తమ అకౌంట్లను సమర్పించిందని.. ఆ మాత్రం దానికే అకౌంట్లను స్తంభింపజేయడం ఏంటని? మాకెన్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయని అన్నారాయన. .. ఇది ఉద్దేశపూర్వక చర్య అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం మా నాలుగు అకౌంట్లు ఒకే పాన్ నెంబర్ మీద లింక్ అయ్యి ఉన్నాయి. అకౌంట్ల ఫ్రీజ్‌తో అన్నీ ఆగపోతాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వలేం. కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని స్థితికి చేరాం. ఆఖరికి న్యాయ్ యాత్రపై కూడా ప్రభావం పడుతుందని చెప్పారాయన. .. దేశంలో ప్రజాస్వామ్యం ఉనికి లేకుండా చేస్తున్నారు. ఏక పాలన పార్టీ.. ప్రధాన ప్రతిపక్షం లొంగదీసుకునే యత్నం చేస్తోంది. కానీ, మేం తలొగ్గం. న్యాయవ్యవస్థ, మీడియా, ప్రజల నుండి న్యాయం కోరుతున్నాం అని మాకెన్ చెప్పారు. ఈ చర్యపై న్యాయపరంగా పోరాడతామని అజయ్ మాకెన్ వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీలోని ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను (ITAT) ఆశ్రయించామని తెలిపారు. #WATCH | Congress Treasurer Ajay Maken says "We got information yesterday that banks are not honouring the cheque we are issuing. On further investigation, we got to know that the Youth Congress bank accounts have been frozen. The accounts of the Congress party have also been… pic.twitter.com/JsZL1FEy9d — ANI (@ANI) February 16, 2024 మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం స్పందించారు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బగా అభివర్ణించారాయన. ఎక్స్ ఖాతాలో ఆయన.. ‘‘ ఎన్నికల కోసం బీజేపీ రాజ్యాంగేతర పద్ధతిలో సేకరించిన సొమ్మును ఖర్చు చేస్తోంది. కానీ, మేం ప్రజల నుంచి సేకరించుకున్న డబ్బును సీజ్ చేసింది. అందుకే బీజేపీ మళ్లీ నెగ్గితే భవిష్యత్తులో ఎన్నికలనేవే ఉండవని.. ప్రజాస్వామ్యం పోయి నియంతృత్వం వస్తుందని మేం చెబుతున్నాం. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లి నియంతృత్వ పాలన తీరును ఎండగడతాం’’ అని సందేశం ఉంచారు. सत्ता के नशे में चूर, मोदी सरकार ने लोक सभा चुनाव के ठीक पहले देश की सबसे बड़ी विपक्षी पार्टी - भारतीय राष्ट्रीय कांग्रेस - के Accounts Frozen कर दिए है। ये लोकतंत्र पर गहरा आघात है। भाजपा ने जो असंवैधानिक धन इकट्ठा किया है, उसका इस्तेमाल वे चुनाव में करेंगे, लेकिन हमने… — Mallikarjun Kharge (@kharge) February 16, 2024 ఖాతాలు స్తంభించాయనే విషయం గురువారం తమ దృష్టికి వచ్చిందని పార్టీ న్యాయవాది వివేక్ తన్ఖా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేరు మీద జారీ చేసే చెక్‌లను అంగీకరించకూడదని బ్యాంకులకు ఐటీ విభాగం సూచనలు జారీ చేసిందనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అయితే అజయ్ మాకెన్ మీడియా సమావేశం నిర్వహించిన గంటలోపే.. ఆ ఖాతాలు పని చేయడం ప్రారంభించాయి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019