breaking news
-
టీడీపీ అంతమే.. మా పంతం
అనంతపురం క్రైం: ‘టీడీపీ కోసం నా భర్త, బావ ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీకి సేవ చేస్తున్నాం. అయినా మాకు తీవ్ర అన్యాయం చేశారు. డబ్బున్నోళ్లకు సీట్లు అమ్ముకుని కురుబ కులస్తులకు మొండిచేయి చూపారు. ఆ పార్టీని బొంద పెట్టేదాకా విశ్రమించం. రాష్ట్రంలోని కురుబలంతా టీడీపీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తాం’ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కురుబ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ బుల్లే శివబాల ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం అనంతపురం నగర శివారులోని చెరువుకట్ట శ్మశాన వాటికలో భర్త నాగరాజు సమాధిపై ఉన్న ‘టీడీపీ కార్యకర్త’ అనే నేమ్‌బోర్డును తొలగించారు. ఆ పార్టీని బొంద పెట్టేదాకా విశ్రమించబోమని భర్త సమాధిపై శపథం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. నలభై ఏళ్లుగా టీడీపీనే కుటుంబంగా..కుటుంబమే పారీ్టగా పని చేశామన్నారు. పార్టీ కోసం తన భర్తతో పాటు బావ పావురాల కిష్టాను కోల్పోయామని చెప్పారు. తనకు అనంతపురం అసెంబ్లీ లేదా పార్లమెంటు అభ్యర్థిగా అవకాశం ఇస్తామని లోకేశ్ పాదయాత్రలో హామీ ఇచ్చారన్నారు. అనంతపురం అర్బన్‌తో కనీస పరిచయం లేని దగ్గుపాటికి సీటిచ్చిన చంద్రబాబు.. పార్టీ కోసం కష్టపడిన ప్రభాకరచౌదరికి మొండిచేయి చూపారని మండిపడ్డారు. చంద్రబాబు నా వెంట్రుకతో సమానమన్న గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు అభ్యర్థిగా, కాంట్రాక్టులు చేసుకునే అమిలినేని సురేంద్రబాబుకు కళ్యాణదుర్గం అభ్యర్థిగా అవకాశం కల్పించి.. చాలా ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న తనలాంటి బీసీలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. బీసీల పార్టీ అని పదేపదే చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు వాస్తవానికి బీసీలను ఏనాడూ పట్టించుకోలేదని శివబాల విమర్శించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముగ్గురు కురుబలకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారని చెప్పారు. వైఎస్సార్‌సీపీతోనే బీసీలకు గుర్తింపు దక్కిందని చెప్పారు. -
హీరోయిన్‌పై చేయి చేసుకున్న డైరెక్టర్.. క్లారిటీ ఇదే!
ఇటీవల యంగ్ హీరోయిన్, మలయాళ భామ మమితా బైజు పేరు వార్తల్లో తెగ వైరలవుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన చిత్రం ప్రేమలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మలయాళంలో హిట్ కావడంతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఓ డైరెక్టర్ తనపై అనవసరంగా చేయి చేసుకున్నారంటూ మమితా ఆరోపించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ దర్శకుడు బాల తెరకెక్కించిన వనంగాన్ సినిమా షూటింగ్ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పలువురు రాసుకొచ్చారు. (ఇది చదవండి: డైరెక్టర్ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్) అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై మమితా బైజు స్పందించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నాపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టి పారేసింది. బాలతో ‘వనంగాన్’ సినిమా కోసం ఏడాది పాటు పని చేసినట్లు తెలిపింది. కానీ ఆయన చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి అని.. నన్ను ఏ రకంగాను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది. అతను నాపై ఎప్పుడూ చేయి చేసుకోలేదని.. కొన్ని కమిట్మెంట్స్ ఉండడం వల్లే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు మమితా వివరించింది. కాగా.. ప్రేమలు సినిమా తెలుగు రైట్స్ రాజమౌళి తనయుడు కార్తికేయ దక్కించుకున్నారు. ఈ నెల 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలై రూ.50కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా.. వణంగాన్ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్, సముద్రఖని, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది. -
Mamitha Baiju: డైరెక్టర్ చేతిలో చీవాట్లు తిన్న హీరోయిన్ (ఫోటోలు)
-
డైరెక్టర్ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్
మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది ప్రేమలు మూవీ. ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రేమలు చిత్రంలో హీరోయిన్గా నటించింది మమిత బైజు. ఈ మూవీ కంటే ముందు వణంగాన్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే చిత్రీకరణ సమయంలో దర్శకుడు తనను దూషించడంతో పాటు కొట్టాడని వెల్లడించింది హీరోయిన్. ఎక్స్పర్ట్లా యాక్ట్ చేయాలి.. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమిత బైజు మాట్లాడుతూ.. వణంగాన్ మూవీలో ఓ సంగీతపరికరాన్ని వాయించే సన్నివేశం ఉంటుంది. నేను అప్పటికే ప్రాక్టీస్ చేసిన అమ్మాయిలా నటించాలా? లేదంటే మొదటిసారి దాన్ని ప్రయత్నిస్తున్నట్లు యాక్ట్ చేయాలా? అని అడిగాను. డైరెక్టర్ బాలా.. అనుభవం ఉన్న కళాకారిణిగా నటించమన్నాడు. అప్పుడు నేను డ్రమ్స్ వాయిస్తూ అనుభవం ఉన్న అమ్మాయిగా పాట పాడాలి అంతేగా అనుకున్నాను. కొన్నిసార్లు డైరెక్టర్ తిట్టాడు.. కానీ ఇంతలో ఆయన నన్ను ఆపి నా వెనకాల ఉన్న అమ్మాయిని చూపించి అలా చేయమన్నాడు. ఇంతలోనే రెడీ అన్నాడు. నేను షాకయ్యాను. ఎందుకంటే వాళ్లు ఏం పాడుతున్నారో నాకసలు అర్థం కావట్లేదు. మూడు టేకులయ్యాయి. మధ్యలో కొన్నిసార్లు డైరెక్టర్ తిట్టాడు. అయితే సెట్లో ఎప్పుడైనా కోప్పడతానని, దాన్ని సీరియస్‌గా తీసుకోవద్దని నాకు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి నేను దానికి మానసికంగా రెడీ అయ్యే సెట్లోకి వచ్చాను. కానీ ఆయన దూషణతో ఆగిపోలేదు, కొట్టాడు కూడా! తిట్టడమే కాదు కొట్టాడు కూడా! హీరో సూర్య సర్‌కు ఇదంతా తెలుసు. వారు ఎంతోకాలంగా కలిసి పని చేస్తున్నారు. వారి మధ్య ఆ అనుబంధం ఉంది. కానీ నాకిదంతా కొత్త కదా' అని చెప్పుకొచ్చింది. కాగా వణంగాన్ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్, సముద్రఖని, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది. -
వరలక్ష్మి శరత్ కుమార్ ఇంతలా కష్టపడిందా.. రివీల్ చేసిన టాప్ డైరెక్టర్
వరలక్ష్మి శరత్ కుమార్‌ను ప్రశంసించని వారు ఉండరనే చెప్పాలి. ఆమె స్టార్ వారసురాలైనా ప్రతిభతోనే కథానాయకిగా రంగ ప్రవేశం చేసింది. వరలక్ష్మి శరత్‌కుమార్ సూపర్ బెల్లీ డ్యాన్సరన్న విషయం చాలామందికి తెలియదు. ఆమె కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. తన తండ్రి శరత్ కుమార్ సిఫార్సునే తీసుకోని ఆమె ప్రతిభనే నమ్ముకుని వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. ఆమెను దర్శకుడు బాలా తనకు నచ్చిన నటి అని ప్రశంసించడం విశేషం. సేతు, నందా, శివ పుత్రుడు వంటి పలు సంచలన విజయాలను సాధించిన చిత్రాల దర్శకుడు బాలా. ఈయన ప్రస్తుతం కోలీవుడ్‌లో వణంగాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మొదట నటుడు సూర్య కథానాయకుడిగా నటించారు. ఆ తర్వాత అనివార్య కారణాలవల్ల ఆయన చిత్రం నుంచి వైదొలగడంతో నటుడు అరుణ్ విజయ్ ఆ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు బాలా ఇటీవల ఒక భేటీలో మాట్లాడుతూ తాను చాలా తక్కువ మంది కథానాయకిలతోనే చిత్రాలు చేశానని, అందులో తనకు నచ్చిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ అని పేర్కొన్నారు. తాను ఇంతకుముందు తెరకెక్కించిన తారై తప్పట్టై చిత్రం షూటింగ్లో ఘనంగా నటించిన ఆర్కే సురేష్‌కు నటి వరలక్ష్మి శరత్ కుమార్‌కు మధ్య జరిగిన సన్నివేశంలో ఆమె ఒంటి ఎముక చిట్లినా లెక్కచేయకుండా మళ్లీ మళ్లీ టేక్ చెప్పినా నటించారని చెప్పారు. అసలు ఆర్కే సురేష్ ఆమైపె బలంగా పడాలన్నారు. షార్ట్ సరిగ్గా రావాలని తాను గట్టిగా అరవడంతో ఆర్కే సురేష్ ఆమైపె బలంగానే పడ్డారన్నారు. అలా తొలి షాట్ లోనే వరలక్ష్మి శరత్ కుమార్ ఒంటి ఎముక చిట్లిందన్నారు. ఆమె తనతో ఆ విషయాన్ని చెప్పలేదన్నారు. తాను పర్ఫెక్షన్ కోసం మరో రెండు మూడు టేకులు చేశానన్నారు. ఆమె కాదనకుండా నటించారని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఊరికి తిరిగి వచ్చిన తర్వాత తదుపరి షెడ్యూల్ చిత్రీకరిస్తున్నప్పుడు తన ఒంటి ఎముక చిట్లినదానికి సంబంధించిన ఎక్స్‌రేను చూపించడంతో ఇది నిజమా అని అడిగానన్నారు. దాంతో ఆమె నిజమేనని చెప్పి చాలా కష్టపడినట్లు చెప్పారన్నారు. అలా ఆమె కఠిన శ్రమజీవి అని దర్శకుడు బాలా పేర్కొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సుస్మితా సేన్ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019