breaking news
-
ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్
దుబాయ్: ఈ ఏడాది మహిళల ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 19 నుంచి 28 వరకు దంబుల్లాలో ఈ టోర్నీ జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. చివరిసారి 2022లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ టోర్నిలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఏడోసారి విజేతగా నిలిచింది. క్రితంసారి ఏడు జట్లు పాల్గొనగా... ఈసారి ఎనిమిది జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్... గ్రూప్ ‘బి’లో శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్‌లాండ్ జట్లున్నాయి. భారత్ తమ మూడు లీగ్ మ్యాచ్‌లను వరుసగా యూఏఈ (జూలై 19న), పాకిస్తాన్ (జూలై 21న), నేపాల్ (జూలై 23న) జట్లతో ఆడుతుంది. జూలై 26న సెమీఫైనల్స్... జూలై 28న ఫైనల్ జరుగుతాయి. -
ఒక్క గోల్, ఒక్క పాయింట్ లేకుండానే ఓటమితో ముగించిన టీమిండియా
దోహా: ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సిరియాతో జరిగి న చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో సునీల్ ఛెత్రి నాయకత్వంలోని టీమిండియా 0–1 గోల్ తేడాతో ఓడిపోయింది. సిరియా తరఫున ఆట 76వ నిమిషంలో ఒమర్ ఖిరిబిన్ ఏకైక గోల్ చేసి తమ జట్టును గెలిపించాడు. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయకుండానే, ఒక్క విజయం కూడా లేకుండా ని్రష్కమించింది. తొలి మ్యాచ్‌లో భారత్ 0–2తో ఆస్ట్రేలియా చేతిలో, రెండో మ్యాచ్‌లో 0–3తో ఉజ్బెకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. ఏడు పాయింట్లతో ఆస్ట్రేలియా, ఐదు పాయింట్లతో ఉజ్బెకిస్తాన్ ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించాయి. -
మళ్లీ ఓడిన భారత్.. వరుసగా రెండో పరాజయం
ఆసియా కప్ పురుషుల ఫుట్‌బాల్ టోర్నీలో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా దోహాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 0–3 గోల్స్ తేడాతో ఉజ్బెకిస్తాన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత జట్టుకు నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఈనెల 23న జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో సిరియాతో భారత్ ఆడుతుంది. -
34 ఏళ్ల నిరీక్షణకు తెర.. బంగ్లాదేశ్ రియల్ హీరో అతడే
అండర్-19 ఆసియాకప్ 2023లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఛాంపియన్స్‌గా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో యూఏఈను 160 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లా జట్టు.. తొలిసారి ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడింది. సీనియర్ జట్టుకు కూడా సాధ్యం కానిది జూనియర్ బంగ్లా టైగర్స్ చేసి చూపించారు. దీంతో తమ 34 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు. 1989 నుంచి ఆసియాకప్ టైటిల్ కోసం పోరాడతున్న బంగ్లా అండర్-19 జట్టు ఎట్టకేలకు సాధించింది. కాగా సెమీస్‌లో భారత్ వంటి పటిష్ట జట్టును ఓడించి మరి బంగ్లాదేశ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అతడే రియల్ హీరో.. బంగ్లాదేశ్ తొలిసారి అండర్-19 ఆసియాకప్ విజేతగా నిలవడంలో ఆ జట్టు హెడ్ కోచ్ స్టువర్ట్ లాది కీలక పాత్ర. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ లా గతేడాది జూలైలో బంగ్లా అండర్-19 జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి బంగ్లా యువ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. అతడి నేతృత్వంతో యువ క్రికెటర్లు మరింత రాటుదేలారు. ఆసియాకప్ టోర్నీకి ముందు దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ బంగ్లా యువ జట్టు అదరగొట్టింది. కాగా గతంలో బంగ్లా సీనియర్ జట్టుకు హెడ్‌కోచ్‌గా స్టువర్ట్ లా పనిచేశారు. 2011 నుంచి 2012 వరకు ఏడాది పాటు బంగ్లా ప్రధాన కోచ్‌గా లా కొనసాగారు. అతడి పర్యవేక్షణలో తమీమ్ ఇక్భాల్, ముష్ఫికర్ రహీం వంటి వారు వరల్డ్‌క్లాస్ క్రికెటర్లగా ఎదిగారు. అదే విధంగా అతడు శ్రీలంక, వెస్టిండీస్ జట్ల హెడ్‌కోచ్‌గా కొనసాగారు. ఇక అతడి నేతృత్వంలోని బంగ్లా జట్టు దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్‌కప్‌లోనూ అద్భుతాలు సృష్టించే ఛాన్స్ ఉంది. వీరే ఫ్యూచర్ స్టార్స్.. ఈ ఆసియాకప్ టోర్నీతో బంగ్లా జట్టుకు అషికర్ రెహ్మాన్ షిబ్లీ రూపంలో యువ సంచలనం దొరికాడు. ఈ టోర్నీ ఆసాంతం అషికర్ రెహ్మాన్ ఓపెనర్‌గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షిబ్లీ... 255 పరుగులతో టోర్నీ టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. యూఏఈతో జరిగిన ఫైనల్లో కూడా షిబ్లీ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు ఇక్బాల్ హుస్సేన్ ఎమోన్, అరిఫుల్ ఇస్లాం కూడా సంచలన ప్రదర్శన కనబరిచారు. కచ్చితంగా వీరిముగ్గురూ అతి త్వరలోనే బంగ్లా జాతీయ జట్టులో కన్పించనున్నారు. చదవండి: IPL 2024: నిన్న రోహిత్... తాజాగా సచిన్ గుడ్‌బై... ముంబై ఇండియన్స్‌లో ఏమవుతోంది? -
ఈనెల 10న భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్
ఇటీవలికాలంలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ల సంఖ్య బాగా పెరిగింది. వన్డే వరల్డ్‌కప్, అంతకుమందు ఆసియాకప్ టోర్నీల్లో టీమిండియా పాక్‌తో తలపడింది. ఈ రెండు టోర్నీలకు ముందు (2023, జులై) ఇరు దేశాల ఎమర్జింగ్ జట్లు ఆసియా కప్ ఫైనల్లో తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్‌పై పాక్ 128 పరుగుల తేడాతో గెలుపొంది ఛాంపియన్‌గా నిలిచింది. అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్-పాక్‌లు మరోసారి తలపడనున్నాయి. ఈనెల 10న దాయాది జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. వన్డే ఫార్మాట్లో సాగనున్న ఈ టోర్నీ ఇవాల్టి (డిసెంబర్ 8) నుంచే మొదలైంది. టోర్నీలో భాగంగా ఇవాళ భారత్, ఆఫ్ఘనిస్తాన్.. నేపాల్, పాకిస్తాన్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో భారత్, పాక్‌తో పాటు మొత్తం ఎనిమిది జట్లు (ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, యూఏఈ, శ్రీలంక, జపాన్) పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ తొలి దశలో భారత్ మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. డిసెంబర్ 8న ఆఫ్ఘనిస్తాన్, 10న పాకిస్తాన్, 12న నేపాల్ జట్లతో యంగ్ ఇండియా తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ డిసెంబర్ 17న జరుగుతుంది. ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగనున్నాయి. భారత అండర్-19జట్టు: అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), అరవెల్లి అవనీష్ రావు (వికెట్‌కీపర్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్‌కీపర్), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019