breaking news
-
అమితాబ్.. రెహమాన్‌లకు లతా మంగేష్కర్ అవార్డు
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డుకు ఎంపిక అయ్యారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ 2022న ఫిబ్రవరి 6న మరణించిన సంగతి తెలిసిందే. ఆమె జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు, సమాజానికి సేవలందిస్తున్న వారికి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ పురస్కారాన్ని అందజేస్తున్నారు. తొలుత ఈ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే ఈ పురస్కారం అందుకున్నారు. 2024కి గాను అమితాబ్ బచ్చన్‌కి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డు ఇవ్వనున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు ప్రకటించారు. అదే విధంగా భారతీయ సంగీతానికి చేసిన కృషికిగానూ ఏఆర్ రెహమాన్ కూడా ఈ పురస్కారం అందుకుంటారు. అలాగే సామాజిక సేవా రంగంలో ‘దీప్‌స్తంభ్ ఫౌండేషన్’ మనోబల్‌కు కూడా ఈ అవార్డును ఇవ్వనున్నారు. ఈ నెల 24న లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి. అదే రోజు ఈ పురస్కారాల పంపిణీ ఉంటుంది. -
25 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో రిపీట్
-
25 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో రిపీట్
తమిళసినిమా: కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఆసక్తిని క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి కాంబినేషన్ నటుడు, నృత్యదర్శకుడు ప్రభుదేవా, ఆస్కార్ నాయకుడు ఏఆర్.రెహ్మాన్‌లది. ఇంతకుముందు 1990 ప్రాంతంలో వీరి కాంబినేషన్లో కాదలన్, మిస్టర్ రోమియో, లవ్‌బర్డ్స్ చిత్రాలు రూపొందాయి. కాగా ప్రభుదేవా, ఏఆర్.రెహమాన్ కలిసి చివరిగా 1997లో మిన్సార కనవు చిత్రం చేశారు. ఇప్పుడు అంటే 25 ఏళ్ల తరువాత ఈ క్రేజీ కాంబోలో చిత్రం రూపొందబోతోందన్నది తాజా సమాచారం. బిహైండ్ వుడ్ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ఈ క్రేజీ కాంబోలో చిత్రాన్ని నిర్మించనుంది. దీని గురించి శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. దీనికి ఈ సంస్థ వ్యస్థాపకుడు మనోజ్.ఎన్ఎస్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రక్తపాతం, హింసాత్మక సంఘటనలు వంటివి ఉండవని, వైవిధ్యభరిత కథాంశంతో తెరకెక్కించనున్న ఈ చిత్రం తమిళ సినీ చరిత్రలో గుర్తిండిపోతుందని దర్శకుడు మనోజ్ పేర్కొన్నారు. చిత్ర షూటింగ్‌ను మే నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుదేవా హీరోగా నటించిన చివరి చిత్రం భగీరా. ప్రస్తుతం ఆయన నటుడు విజయ్ హీరోగా నటిస్తున్నది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారన్నది గమనార్హం. దీని తరువాత మనోజ్ దర్శకత్వంలో నటించనున్నారు. View this post on Instagram A post shared by Prabhudeva (@prabhudevaofficial) -
IPL 2024 Opening Ceremony: అట్టహాసంగా ఆరంభం
IPL 2024 Opening Ceremony: ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ డ్యాన్స్‌తో దుమ్ములేపారు. జోష్‌గా స్టెప్పులేస్తూ చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించారు. 𝗣𝗼𝘄𝗲𝗿𝗵𝗼𝘂𝘀𝗲 💥@iTIGERSHROFF starts the #TATAIPL Opening Ceremony with his energetic performance 😍👏 pic.twitter.com/8HsssiKNPO — IndianPremierLeague (@IPL) March 22, 2024 𝙀𝙡𝙚𝙘𝙩𝙧𝙞𝙛𝙮𝙞𝙣𝙜 ⚡️⚡️ Chennai erupts in joy as @akshaykumar leaves his mark at the #TATAIPL Opening Ceremony 🥳 pic.twitter.com/TMuedfuvyU — IndianPremierLeague (@IPL) March 22, 2024 💃🕺 Chennai grooves to the melodies of Sonu Nigam during the Opening Ceremony#TATAIPL pic.twitter.com/jVnlskQKQj — IndianPremierLeague (@IPL) March 22, 2024 అనంతరం సోనూ నిగమ్ మధుర గాత్రంతో వందేమాతరం ఆలాపనతో ప్రేక్షకుల్లోని దేశభక్తిని తట్టిలేపగా... ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మా తుజే సలాంతో గూప్‌బంప్స్ తెప్పించాడు. ఆ తర్వాత మోహిత్ చౌహాన్ కూడా ఈ స్వర తరంగానికి తోడయ్యాడు. భల్లే లక్కా, మసక్కలి, ఛయ్య ఛయ్య పాటలతో దుమ్ములేపాడు. అనంతరం లేడీ సింగర్లు నీతి మోహన్ బర్సోరే సాంగ్‌తో శ్రోతల చెవుల్లో స్వాతి చినుకుల వర్షం కురిపించింది. 𝙰 𝙼𝚞𝚜𝚒𝚌𝚊𝚕 𝙼𝚊𝚜𝚝𝚎𝚛𝚢 🎶@arrahman has left everyone in awe of his brilliance at the #TATAIPL Opening Ceremony 😍 🙌 pic.twitter.com/tbiiROXdog — IndianPremierLeague (@IPL) March 22, 2024 బీసీసీఐ బాస్‌లు, కెప్టెన్ల ఆగమనం వినోద కార్యక్రమాలు ముగిసిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా మిగతా ఆఫీస్ బేరర్లు వేదిక మీదకు విచ్చేశారు. ఆ తర్వాత ఢిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్-2024 ట్రోఫీని స్టేజీ మీదకు తీసుకువచ్చాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా వేదిక మీదకు చేరుకున్నాడు. అంతా కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చారు. అనంతరం ఆరంభ మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. -
ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీలో పెర్ఫార్మ్ చేయబోయేది వీరే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ ఎడిషన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మెగా ఫైట్ ప్రారంభమవుతుంది. AR Rahman, Sonu Nigam, Akshay Kumar and Tiger Shroff will perform at the IPL opening ceremony. pic.twitter.com/9kR2dpyOOV — Mufaddal Vohra (@mufaddal_vohra) March 20, 2024 సీజన్ తొలి మ్యాచ్ కావడంతో మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనీ అరేంంజ్ చేశారు నిర్వహకులు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. ఈ కార్యక్రమం మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు (6:30 గంటలకు) జరుగనుంది. ఈ ఈవెంట్‌ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. జియో సినిమాలో డిజిటల్ స్ట్రీమింగ్ జరుగనుంది. ఇదిలా ఉంటే, సీఎస్కే-ఆర్సీబీ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఈ మైదానంలో సీఎస్కే ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019