breaking news
-
Apoorva Srinivasan Wedding: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ (ఫోటోలు)
-
World Health Day: ఏయే వయసుల్లో.. ఏయే వ్యాక్సిన్లు! ఏయే వైద్య పరీక్షలు..?
ఆరోగ్య సమస్య ఏమైనా వస్తే చికిత్స తప్ప ప్రత్యామ్నాయం లేదు. కానీ సమస్య రాకుండా ముందే నివారించుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. చికిత్స కంటే నివారణే మేలు అనే సూక్తి మేరకు వ్యాధుల నివారణకు ఉపయోగపడే అంశాల్లో మొట్టమొదటి అంశం టీకాలు (వ్యాక్సిన్లు). రెండో అంశం.. లక్షణాలు కనిపించగానే చేయించాల్సిన వైద్యపరీక్షలు. నేడు ‘వరల్డ్ హెల్త్ డే’. ఈ సందర్భంగా ఏ వయసులో. వారు ఏయే వ్యాక్సిన్లు తీసుకోవాలన్న అంశంపై అవగాహన కోసం ఈ కథనం. టీకాలు.. చిన్నారి పుట్టిన వెంటనే.. ఓపీవీ, బీసీజీలతో పాటు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత 6, 10, 14 వారాల్లో ఇస్తారు). ఆరు వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా ఫస్ట్ డోస్ హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా ఫస్ట్ డోస్ ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్)/ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా ఫస్ట్ డోస్ పీసీవీ 13 (న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా) ఫస్ట్ డోస్ రొటావైరస్ టీకా మొదటి డోస్ (ఇది నోటిద్వారా ఇస్తారు) హెపటైటిస్–బి వ్యాక్సిన్ రెండో డోస్. పది వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా రెండో మోతాదు హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా రెండో మోతాదు ఐపీవీ / ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా రెండోడోస్ పీసీవీ 13 రెండో మోతాదు నోటిద్వారా ఇచ్చే రొటావైరస్ టీకా రెండో డోస్ హెపటైటిస్–బి మూడో డోస్. పద్నాలుగు వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా మూడో మోతాదు హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా మూడోమోతాదు ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్)/ ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా మూడో మోతాదు పీసీవీ 13 (న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా) మూడో మోతాదు రొటావైరస్ టీకా మూడో డోస్ (ఇది నోటిద్వారా ఇచ్చే డోస్) హెపటైటిస్–బి వ్యాక్సిన్ నాలుగో మోతాదు. ఆరు నెలల వయసప్పుడు: ఇన్ఫ్లుయెంజా టీకా మొదటి మోతాదు ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) మొదటి మోతాదు ఏడు నెలల వయసప్పుడు: ఇన్ఫ్లుయెంజా టీకా రెండో మోతాదు తొమ్మిది నెలల వయసప్పుడు: ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) రెండో మోతాదు ఎమ్ఎమ్ఆర్ (తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా) టీకా ఫస్ట్ డోస్ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఇస్తారు. పన్నెండు నుంచి 15 నెలల వయసప్పుడు: ఎమ్ఎమ్ఆర్ (తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా) టీకా రెండో మోతాదు వారిసెల్లా (చికెన్‌పాక్స్) టీకా మొదటి మోతాదు హెపటైటిస్–ఏ టీకా మొదటి మోతాదు (దీని రెండో డోస్ సాధారణంగా 18 నెలలప్పుడు ఇస్తారు) పీసీవీ (ప్యాక్డ్ సెల్ వాల్యూమ్) బూస్టర్. పద్దెనిమిది నెలల వయసప్పుడు: డీట్యాప్ టీకా మొదటి బూస్టర్ డోస్ హెచ్ఐబీ (హిబ్) టీకా మొదటి బూస్టర్ డోస్ ఐపీవీ లేదా ఓపీవీ టీకా హెపటైటిస్–ఏ రెండో డోస్. మూడేళ్ల వయసప్పుడు: వారిసెల్లా వ్యాక్సిన్ రెండో డోస్ టీకా. ఐదేళ్లప్పుడు: డీ–ట్యాప్ టీకా రెండో బూస్టర్ ఐపీవీ టీకా ∙ఎమ్ఎమ్ఆర్ టీకా మూడో డోస్. పది నుంచి పన్నెండేళ్ల వయసప్పుడు: హెచ్‌పీవీ టీకా మొదటి డోస్ (దీని రెండు, మూడు డోసులు 9 నుంచి 18 ఏళ్ల వయసప్పుడు) టీడ్యాప్ టీకా బూస్టర్ డోస్ ∙మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా మొదటి డోస్ (దీని బూస్టర్ 16 ఏళ్ల వయసప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది). పదిహేను నుంచి 16 ఏళ్ల వయసప్పుడు: మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా బూస్టర్ డోస్ టీడీ / డీటీ టీకా. 18 నుంచి 65 ఏళ్ల వరకు: ఈ వయసులో ఎవరికైనా మంచి వ్యాధి నిరోధకత ఉంటుంది. గతం లో ఏదైనా వ్యాక్సిన్ తీసుకోకపోతే... డాక్టర్ సలహా మేరకు తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నదీ లేనిదీ గుర్తులేనప్పుడు డాక్టర్‌కు ఆ విషయం చెబితే... వారు కొన్ని పరీక్షల ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నదీ లేనిదీ నిర్ధారించి అవసరమైతే ఇస్తారు. 65 ఏళ్లు పైబడిన వారికి: ఈ వయసు దాటాక కొన్ని వ్యాక్సిన్లు తప్పనిసరిగాను, మరికొన్ని అవసరాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. పీసీవీ–13 అండ్ పీపీఎస్వీ 23 అనే వ్యాక్సిన్లను సాధారణంగా 65 ఏళ్లు దాటినవారికి ఇస్తుంటారు. ఇవి నిమోనియాను నివారించే నిమోకోకల్ వ్యాక్సిన్స్‌లు. ఇందులో తొలుత పీసీవీ–13 ఇస్తారు. ఆ తర్వాత రెండు నెలలకు పీపీఎస్వీ–23 ఇస్తారు టీ–డ్యాప్ వ్యాక్సిన్: చిన్నప్పుడు తీసుకున్న టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ వ్యాధులను నివారించే వ్యాక్సిన్ తాలూకు బూస్టర్ డోసులను 65 ఏళ్లు పైబడ్డ తర్వాత ప్రతి పదేళ్లకోమారు తీసుకుంటూ ఉండాలి. - డాక్టర్ బీవీఎస్ అపూర్వ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. పరీక్షలు.. ముందుగానే కొన్ని వైద్య పరీక్షలు చేయించడం వల్ల కొన్ని వ్యాధుల్ని కనుగొని సంపూర్ణంగా నయం చేసుకోవచ్చు. ఉదాహరణకు సర్వైకల్ క్యాన్సర్ అనే వ్యాధికి సుదీర్ఘమైన ముందస్తు వ్యవధి ఉంటుంది. అంటే అసలు వ్యాధి రావడానికి పదేళ్ల ముందునుంచే ‘ప్రీ–సర్వైకల్ పీరియడ్’ ఉంటుంది. పాప్ స్మియర్ అనే పరీక్ష ద్వారా వ్యాధి రాబోయే దశాబ్దకాలం ముందుగానే దాన్ని కనుగొనవచ్చు. క్యాన్సర్ ను ఎంత త్వరగా కనుగొంటే అంత తేలికగా నయమవుతుంది. ఆరోగ్యంగా ఉండటం కోసం ముందస్తుగా ఏయే వయసుల్లో ఏయే వైద్యపరీక్షలు ఉపకరిస్తాయో తెలుసుకుందాం. 0 – 10 ఏళ్ల వయసులో: ఈ వయసులో అవసరం అయితే తప్ప పెద్దగా వైద్యపరీక్షలు అవసరం లేదు. 11 – 20 ఏళ్లు: ఇది యుక్తవయసులోకి మారే దశ. నిర్దిష్టంగా ఏవైనా వైద్యసమస్యలు ఉండటం లేదా లక్షణాలు కనిపించడం వంటి సమయాల్లో తప్ప... ఈ వయసులోనూ పెద్దగా వైద్యపరీక్షలు అవసరం పడవు. 20 – 30 ఏళ్లు: ఈ వయసులో కొన్ని లైంగిక సాంక్రమిక వ్యాధులు (ఎస్టీఐ’స్) కోసం మరీ ముఖ్యంగా హెపటైటిస్–బీ నిర్ధారణ పరీక్షలు చేయించి హెచ్‌బీఐజీ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే అమ్మాయిలైతే పాప్‌స్మియర్ వంటి గైనిక్ పరీక్ష లు చేయించుకుని, 12 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్యకాలంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ప్రయోజనకరం. 30 నుంచి 40 ఏళ్లు: ఈ వయసు నుంచి డయాబెటిస్ కోసం హెచ్‌బీఏ1సీ అనే రక్తపరీక్షలు, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా తేడాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి ఈసీజీ, టూ డీ ఎకో, అవసరాన్ని బట్టి ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేయించాలి. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలూ మంచిదే. మహిళలైతే డాక్టర్ సలహా మేరకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మామోగ్రామ్ పరీక్ష చేయించాలి. 40 – 50 ఏళ్లు: ఈ వయసు నుంచి దేహంలో కొన్ని మార్పులు మొదలవుతాయి. అందుకే ఈ వయసులో పరీక్షలు తరచూ చేయిస్తుండటం మేలు. రక్తపోటును తెలుసుకోవడం కోసం సిస్టోల్, డయాస్టోల్ ప్రెషర్స్, రక్తలో చక్కెర మోతాదుల కోసం హెచ్‌బీఏ1సీతో పాటు అవసరమైతే గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ), పొద్దున్నే పరగడుపున, ఏదైనా తిన్న తర్వాత చేసే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ్రపాండియల్ వైద్య పరీక్షలతోపాటు అవసరాన్ని బట్టి కొన్నిరకాల క్యాన్సర్ పరీక్షలు చేయించడం మంచిది. అలాగే మహిళలైతే ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ డెన్సిటీ పరీక్ష చేయించాలి. దాంతోపాటు మామోగ్రామ్, పాప్ స్మియర్ పరీక్షలను డాక్టర్ చెప్పిన వ్యవధుల్లో చేయించాలి. ఇక పురుషులైతే ఈ వయసు నుంచి ్రపోస్టేట్ స్పెసిఫిక్ ఏంటీజెన్... సంక్షిప్తంగా పీఎస్ఏ అనే పరీక్షను డాక్టర్లు చెప్పిన వ్యవధుల్లో చేయించుకుంటూ ఉండాలి. 50 – 60 ఏళ్లు: చాలామంది 50 ఏళ్ల వరకు ఎలాంటి పరీక్షలు చేయించకపోవచ్చు. అయితే అలాంటివాళ్లంతా ఈ 50 – 60 ఏళ్ల మధ్యవయసులో తప్పక వైద్యపరీక్షలు చేయించాల్సిన అవసరం తప్పక వస్తుంది. ముందు నుంచి పరీక్షలు చేయించని వాళ్లతోపాటు ఈ వయసులోని అందరూ ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ స్కాన్, కోలన్ క్యాన్సర్ నిర్ధారణ కోసం కొలనోస్కోపీ, గుండె జబ్బుల కోసం తరచూ ఈసీజీ, టూ డీ ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలతో పాటు లక్షణాలను బట్టి ఇతర వైద్యపరీక్షలు చేయిస్తుండాలి. మహిళలకు 50 ఏళ్ల వయసు తర్వాత మెనోపాజ్ రావడంతో గుండెకు ఉండే ఒక సహజ రక్షణ తొలగిపోతుంది. అందువల్ల గతంలో చేయించినా, చేయించక పోయినా ఈ వయసు నుంచి మహిళలు గుండెకు సంబంధించిన అన్ని స్క్రీనింగ్ పరీక్షలు అంటే ఈసీజీ, టూడీ ఎకో, ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేయించాలి. 60 నుంచి 70 ఏళ్లు: ఈ వయసులో వాళ్లనే సీనియర్ సిటిజెన్‌గా పరిగణిస్తుంటారు. పురుషులూ మహిళలు అన్న తేడాలేకుండా... ఈ వయసు నుంచి అందరూ... ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ స్కాన్, కోలన్ క్యాన్సర్ నిర్ధారణ కోసం కొలనోస్కోపీ, గుండెజబ్బుల కోసం తరచూ ఈసీజీ, టూ డీ ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలతోపాటు లక్షణాలను బట్టి మరికొన్ని ప్రత్యేకమైన పరీక్షలు అవసరమవుతాయి. 70+ పైబడ్డాక.. ఆపైన కూడా.. ఈ వయసు నుంచి లక్షణాలను బట్టి ఓ వ్యక్తి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండేందుకు పైన పేర్కొన్న వైద్యపరీక్షలతో పాటు కొన్ని వ్యాక్సిన్లు, మరికొన్ని మందులు తీసుకోవాలి. ఒకవేళ పోషకాహార లోపం ఉంటే, తగిన ఆహారం తీసుకోవాలి. దాంతోపాటు అవసరం అయితే మరికొన్ని హెల్త్ సప్లిమెంట్స్ వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. - డాక్టర్ హరికిషన్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్. ఇవి చదవండి: మన తెలుగువాడి బయోపిక్ -
ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం
‘కాలంతో పాటు నడవాలి’ అంటారు పెద్దలు.‘కాలంతో పాటు నడుస్తూనే భవిష్యత్‌పై ఒక కన్ను వేయాలి’ అంటారు విజ్ఞులు. అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్... అనే ముగ్గురు మిత్రులు రెండో కోవకు చెందిన దార్శనికులు. లెర్న్ అండ్ ఎర్న్ ప్లాట్‌ఫామ్ ‘ఇంట్రాక్ట్’తో వెబ్3 వరల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు... ఐటీఐ–దిల్లీలో చదువుకున్న అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్ సంభాషణాల్లో సరదా విషయాల కంటే సాంకేతిక విషయాలే ఎక్కువగా చోటు చేసుకునేవి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు? వివిధ దేశాల్లో ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు? ఏ రంగాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? మన దేశంలో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు, ఇంటర్నెట్ అభివృద్ధిలో మూడు ప్రధాన దశలు, వెబ్3 టెక్నాలజీతో అపారమైన ఉద్యోగావకాశాలు...ఇలా ఒకటా రెండా బ్లాక్‌చైన్, క్రిప్టో టెక్నాలజీ, వెబ్3 టెక్నాలజీ గురించి గంటల తరబడి మాట్లాడుకునేవారు. వారు మాట్లాడుకున్న విషయాలేవి వృథా పోలేదు.‘ఇంట్రాక్ట్’ ప్లాట్‌ఫామ్‌కు పునాదిగా ఉపయోగపడ్డాయి.ప్రజలకు బ్లాక్ చెయిన్, క్రిప్టో టెక్నాలజీని చేరువ చేయాలనే లక్ష్యంతో 2022లో ‘ఇంట్రాక్ట్’ అనే స్టార్టప్ స్టార్ట్ చేశారు ముగ్గురు మిత్రులు. ‘వెబ్3 టెక్నాలజీకి సంబంధించి కేవలం సమాచార వేదికగానే కాకుండా ప్రతిఫలదాయక వేదికగా ఇంట్రాక్ట్ని నిర్మించాం. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ అనేది ఇంట్రాక్ట్ లక్ష్యం. క్వెస్ట్, ఇంటరాక్టివ్ టాస్కుల ద్వారా బ్లాక్ చెయిన్, క్రిప్టో, వెబ్3 టెక్నాలజీతో యూజర్లను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం’ అంటున్నాడు కో–ఫౌండర్ అభిషేక్.సంక్లిష్టమైన రీతిలో కాకుండా ఫన్ అండ్ ఇంటరాక్టివ్ పద్ధతిలో కొత్త ప్రాడక్టులు, సర్వీసులను యూజర్లకు పరిచయం చేయడంలో ‘ఇంట్రాక్ట్’ విజయం సా«ధించింది. టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేసిన యూజర్లకు క్రిప్టో, ఎన్ఎఫ్టీ, లాయల్టీ పాయింట్స్ రూపంలో ప్రోత్సాహకాలు’ అందిస్తోంది. ఎన్నో కలలతో ముగ్గురు మిత్రులు ‘ఇంట్రాక్ట్’ను ప్రారంభించారు. ఆ కలలకు కష్టాన్ని జోడించారు. ఆ కష్టం వృథా పోలేదు. లక్షలాది యూజర్లతో ‘ఇంట్రాక్ట్’ వెబ్3 వరల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తూప్రాఫిటబుల్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. ‘ఇంట్రాక్ట్’ ఇన్వెస్టర్లలో ఆల్ఫా వేవ్ గ్లోబల్, గుమీ క్రిప్టోస్, ఆల్కెమీ, మూన్ పే, వెబ్ 3 స్టూడియోస్, కాయిన్ బేస్...మొదలైన కంపెనీలు ఉన్నాయి. సమీకరించిన నిధులలో కొంత మొత్తాన్ని తమ టీమ్ సభ్యుల సంఖ్యను రెట్టింపు చేయడానికి, సాంకేతిక అవసరాలకు ఉపయోగించారు. సాధించిన విజయంతో సంతృప్తి పడడం లేదు ముగ్గురు మిత్రులు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వెబ్3 టెక్నాలజీపై మార్కెటింగ్ నిపుణులు, కంపెనీల ఫౌండర్లు దృష్టి పెట్టారు. మరో వైపు ఉద్యోగావశాలు లేదా ఆవిష్కరణల కోణంలో యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో పోటీగా ఎన్నో కంపెనీలు మార్కెట్లోకి రావచ్చు. వాటిని తట్టుకొని ముందుకు వెళ్లాలంటే ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాల గురించి ఆలోచించాలనేది ముగ్గురు మిత్రులకు తెలియని విషయం కాదు.‘వెబ్3 క్రియేట్ చేసిన సరికొత్త ఆర్థిక అవకాశాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థల గురించి పరిచయం చేసి యూజర్లకు ఉపయోగపడాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు సంస్థ కో–ఫౌండర్, సీయీవో సంభవ్ జైన్. -
ఖాళీ ప్రిజ్జు ... కోటీశ్వరుడిని చేసింది!
ఖాళీ రిఫ్రిజిరేటర్‌ను చూస్తే ఏమొస్తుంది? అదృష్టం బాగుంటే అద్భుతమైన ఐడియా వస్తుంది. అపూర్వ మెహతా తన ఇంట్లో ఖాళీగా ఉన్న రిఫ్రిజిరేటర్‌ను చూడడంతో గ్రాసరీ డెలివరీ స్టార్టప్ ‘ఇన్‌స్టాకార్ట్’ ఐడియా వచ్చి 37 సంవత్సరాల వయసులోనే కోటీశ్వరుడిగా మారాడు. తన ఇన్స్పిరేషన్ గురించి అపూర్వ మెహతా లింక్డ్ ఇన్‌లో షేర్ చేశాడు. అమెజాన్‌లో సప్లై చైన్ ఇంజనీర్‌గా పని చేçస్తున్న మెహతాకు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే కలలు ఉండేవి. అయితే ఒకటి రెండు వ్యాపారాలు స్టార్ట్ చేసి విఫలం అయ్యాడు. శాన్ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో కూర్చున్న మెహతాకు ఎదురుగా ఖాళీ రెఫ్రిజిరేటర్ కనిపించింది. తాను తినడానికి అందులో ఏమీ లేవు. అలా ఖాళీ రిఫ్రిజిరేటర్‌ను చూస్తున్నప్పుడు ‘ఇన్‌స్టాకార్ట్’ స్టార్టప్‌కు ఐడియా పుట్టింది. -
కరోనా హీరో డాక్టర్ అపూర్వ
ప్రాణాలను కాపాడే శక్తి డాక్టర్ల చేతిలో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ శక్తి అందరి చేతుల్లోకి వచ్చింది.కరోనా మీద పోరాటం డాక్టర్లుగా మాకు పెద్ద చాలెంజ్. ఈ చాలెంజ్‌లో మమ్మల్ని గెలిపించగలిగింది మీరే. బాధ్యతాయుతమైన పౌరులని నిరూపించుకోండి. స్నేహితులకు చెప్పండి... ఇంట్లో వాళ్లకు చెప్పండి. అందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పండి. మనల్ని మనం కాపాడుకుందాం. మన తోటి వారిని కాపాడుదాం. ఇది ఒక డాక్టర్ చేస్తున్న విన్నపం. డాక్టర్ అపూర్వ చేస్తున్న అపూర్వమైన విన్నపం. డాక్టర్ అపూర్వ చేసిన మూడున్నర నిమిషాల వీడియో పది రోజులుగా వైరల్ అవుతోంది. కరోనా వైరస్ కంటే వేగంగా విస్తరిస్తోంది. జనతా కర్ఫ్యూ, లాక్డౌన్ నేపథ్యంలో రూపొందించిన వీడియోను ఫేస్బుక్లో లక్షమందికి పైగా వీక్షించారు. యూట్యూబ్‌లో ఇరవై గంటల్లో నాలుగు లక్షల వ్యూస్ వచ్చాయి. జనమంతా ఇంత ఘనం చూడడానికి అందులో ఏముంది? అంటే... కరోనా గురించిన పూర్వాపరాలతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలున్నాయి. వాట్సాప్ యూనివర్సిటీ వెదజల్లుతున్న సొంత పరిజ్ఞానాన్ని, ఇతర సోషల్ మీడియాలో నడుస్తున్న ఫేక్ న్యూస్ సునామీని అదుపు చేయడం కోసమే ఆ వీడియో చేశానన్నారు గైనకాలజీ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ అపూర్వ. తన దగ్గరకు వచ్చిన పేషెంట్ల సందేహాలకు సమాధానాలే తన వీడియోలని చెప్పారు అపూర్వ. తన దగ్గరకు వచ్చిన పేషెంట్లకయితే ఒక్కొక్కరికీ ఓపిగ్గా ఆద్యంతం వివరించడం సాధ్యమవుతోంది. తరచూ డాక్టర్ దగ్గరకు రాలేని గర్భిణులు మనదేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్లకు అందుబాటులో ఉన్న డాక్టర్లకు ఈ మహిళల సందేహాలన్నింటికీ సమాధానం చెప్పే సమయం, సహనం ఉన్నాయో లేదో కూడా అనుమానమే. అందుకే తానే వాళ్లందరి దగ్గరకు వెళ్లాలనుకున్నారు డాక్టర్ అపూర్వ. కాలనీకు వెళ్లి, గర్భిణుల కోసం అవగాహన సదస్సులు పెట్టి స్వయంగా మాట్లాడవచ్చు. ఇప్పుడా పరిస్థితి లేదు, అంత సమయమూ లేదు. అందుకే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకూ చేరుకున్నారు. ఆ వీడియోల్లో ఆమె కరోనా మొదట ఎలా బయటపడింది అనే వివరాల నుంచి, ఎలా విస్తరించింది, ప్రభుత్వాలు కట్టడి చేసినప్పుడు ఎంత అదుపులో ఉండింది? దక్షిణ కొరియా మహిళ బాధ్యతరాహిత్యం వల్ల ఎంత మందికి ఎంత త్వరగా వ్యాధి వ్యాప్తి చెందిందనే వివరాలతోపాటు, వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఐసోలేషన్ ఆవశ్యకత, ఈ విపత్కాలంలో ఇంట్లోనే ఉండడాన్ని మించిన మంచిపని మరొకటి లేదనే సూచనలతో ‘స్టే హోమ్... బీ సేఫ్’ అనే సందేశంతో ముగుస్తుందీ వీడియో. చివరగా మలయాళం, తమిళ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో డాక్టర్ల సూచనలు కూడా ఉన్నాయి. ఆమె సేవలకు డబ్లు్యహెచ్‌వో ‘రికార్డ్ ఆఫ్ అచీవ్మెంట్’ సర్టిఫికేట్ ప్రదానం చేసింది. నెలలు నిండక ముందే ప్రసవం ‘‘కరోనా తొలిదశలో ఉన్నప్పుడు ఈ వ్యాధి గర్భిణులకు సోకదనే అనుకున్నారు. కానీ విదేశాల్లో రెండు కేసులు నమోదయ్యాయి. వ్యాధి కారక వైరస్ స్వరూపం మార్చుకుంటూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మార్పులకు అనుగుణంగా వీడియోలు చేస్తున్నాను. గర్భిణులకు వ్యాధి సోకితే ప్రీ టర్మ్ డెలివరీలయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కానీ ప్రైవేట్ హాస్పిటళ్లు మాత్రం ముందస్తు డెలివరీలను దృష్టిలో పెట్టుకుని బెడ్లను సిద్ధంగా ఉంచుకుంటున్నాయి. ఒక కరోనా పాజిటివ్ పేషెంట్‌ను పరీక్షించిన డాక్టర్, ఇతర పారా మెడికల్ స్టాఫ్ ఇతర రోగులను పరీక్షించకుండా ఉండేటట్లు మా డాక్టర్లం కూడా కేటగిరైజ్ చేసుకుని పని చేస్తున్నాం. పాజిటివ్ పేషెంట్లను చూసిన మెడికల్ టీమ్ ఒక వారం డ్యూటీ చేసి, రెండు వారాలు క్వారంటైన్లో ఉంటోంది. ఈ డిసీజ్‌కి సరిహద్దుల్లేవు, మన జాగ్రత్తలతోనే దీనికి అడ్డుకట్ట వేయాలి’’ అని డాక్టర్లుగా తాము కరోనా వ్యాధిని ఎదుర్కొంటున్న తీరును వివరించారామె. వీడియో సందేశం కరోనా వీడియోని మొదట ఇంగ్లిష్ వెర్షన్ చేశాను. అది చూసి మా అమ్మ ‘తెలుగమ్మాయివై ఉండి, తెలుగు వాళ్లను ఎడ్యుకేట్ చేయకుండా ప్రపంచమంతటినీ ఎడ్యుకేట్ చేస్తావా? తెలుగులో కూడా చెయ్యి’ అన్నారు. ఆ మాటతో నాకు మనసులో ఏదో గుచ్చుకున్నట్లయింది. వెంటనే తెలుగులో స్క్రిప్టు రాసుకుని తెలుగులో షూట్ చేశాను. మా అమ్మ ఆ మాట అన్న మూడు గంటల్లో తెలుగు వెర్షన్ చేసి అమ్మకి చూపించాను. ఆశ్చర్యం ఏమింటే... ఇంగ్లిష్ వెర్షన్ ఎంత వేగంగా విస్తరించిందో, అంతే వేగంగా తెలుగు వెర్షన్ కూడా విస్తరించింది. సింగపూర్, యూఎస్‌లో ఉన్న తెలుగు వాళ్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘స్వయంగా డాక్టర్ మాటల్లోనే వినడంతో మాకు ధైర్యంగా ఉంది. మీరు చెప్పినట్లు వ్యాధి అదుపులోకి వచ్చే వరకు ఇంట్లోనే ఉంటాం’ అని హామీ కూడా ఇస్తున్నారు. – డాక్టర్ అపూర్వ పల్లంరెడ్డి, ఫీనిక్స్ క్లినిక్, బెంగళూరు – వాకా మంజులారెడ్డి
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019