breaking news
-
చంద్రబాబు, లోకేశ్ ప్రకటించిన ఆస్తులు రూ.1,474 కోట్లు
సాక్షి, అమరావతి: చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ వారి ఆస్తుల గురించి ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించిన వివరాలు చర్చనీయాంశమయ్యాయి. అపారమైన ఆస్తులు ఉన్నా చాలా తక్కువ ఆస్తుల్ని మాత్రమే వారు బయటపెట్టినట్లు తెలుస్తోంది. కుప్పం అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా లోకేశ్ విడివిడిగా ఆస్తులు చూపించారు. కానీ వారు కలిసే ఉంటున్నారు. ఆస్తుల్ని మాత్రం పక్కాగా పంచుకున్నారు. అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉంటున్నప్పటికీ, విడివిడిగా ఆస్తుల్ని చూపించడం ద్వారా తక్కువ ఆస్తిపరులని ప్రజలను మభ్య పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అఫిడవిట్లలో అధికారికంగా వారు ప్రకటించిన ఆస్తుల విలువ రూ.1,474 కోట్లు. చంద్రబాబు, భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.931.83 కోట్లు కాగా, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఆస్తుల విలువ రూ.542.17 కోట్లుగా చూపారు. వారి ఆస్తుల్లో ఎక్కువ హెరిటేజ్ షేర్ల రూపంలో ఉన్నాయి. స్థిరాస్తులు హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా ఉండగా, కొన్ని తమిళనాడులోనూ ఉన్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మాత్రం నామమాత్రంగా రెండు స్థలాలున్నాయి. వారు తమదిగా చెప్పుకునే అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో మాత్రం ఈ కుటుంబంలోని ఐదుగురిలో ఎవరికీ ఒక్క ఆస్తి కూడా లేదు. వారి సొంతిల్లు హైదరాబాద్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. లోకేశ్, భువనేశ్వరి హెరిటేజ్ షేర్ల విలువే రూ.1102 కోట్లు చంద్రబాబు ఆస్తుల్లో ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్‌కి ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ల విలువే రూ.1102.11 కోట్లు. భువనేశ్వరికి రూ.763 కోట్ల విలువైన షేర్లు ఉండగా, లోకేశ్‌కి రూ.339.11 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. మొత్తంగా చంద్రబాబు, భువనేశ్వరి పేరు మీద రూ.121.41 కోట్ల స్థిరాస్తులు, రూ.815.17 కోట్ల చరాస్తులుగా చూపించారు. అలాగే భువనేశ్వరికి రూ.1.84 కోట్ల విలువైన బంగారం, రూ. 1.09 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాభరణాలు, రూ.30 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పులు రూ. 10.31 కోట్లుగా చూపారు. లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌కు కలిపి రూ.394 కోట్ల చరాస్తులు ఉండగా, స్థిరాస్తులు రూ.148.07 కోట్ల విలువైనవి ఉన్నట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణికి 2500.338 గ్రాముల బంగారం, 97.441 కిలోల వెండి, రూ.1.48 కోట్లు విలువైన వజ్రాభరణాలు ఉండగా, దేవాన్స్ వద్ద 7.5 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఆస్తుల విలువ తగ్గించి చూపారు చంద్రబాబు కుటుంబం అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల విలువను తక్కువ చేసి చూపించింది. హైదరాబాద్ మదీనగూడలో లోకేశ్, భువనేశ్వరి పేరు మీద ఉన్న 10 ఎకరాల వ్యవసాయ భూమి విలువను రూ.100 కోట్లుగా చూపించారు. నిజానికి అక్కడ ఎకరం రూ.50 కోట్లకు పైనే ఉంటుంది. ఆ లెక్కన ఆ భూమి విలువ రూ.500 కోట్లకు పైమాటే. అలాగే ఈ భూమి వ్యవహారాన్ని చంద్రబాబు గతంలో రహస్యంగా ఉంచారు. 10 ఎకరాల్లో 5 ఎకరాలు లోకేశ్‌కి ఉన్నట్లు బయటపడినప్పుడు అది ఎలా వచ్చిందనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. నానమ్మ అమ్మణ్ణమ్మ నుంచి లోకేశ్‌కి గిఫ్ట్‌గా రాసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ విషయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కుప్పంలో ఉండే అమ్మణ్ణమ్మకు ఖరీదైన ప్రాంతంలో అంత భూమి ఎలా వచ్చిందనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పలేదు. మదీనగూడలోనే మరో 5 ఎకరాలను భువనేశ్వరి కొన్నట్లు చూపారు. రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల ఆస్తి కొన్న దేవాన్ష్ చంద్రబాబు మనుమడు దేవాన్ష్ రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల విలువైన ఆస్తిని కొన్నట్లు చూపడం విశేషం. జూబ్లీహిల్స్‌లో తల్లి బ్రాహ్మణితో కలిపి ఉన్న వాణిజ్య భవనాన్ని దేవాన్ష్ 2017లో కొన్నట్లు పేర్కొన్నారు. అతను పుట్టింది 2015లో. పిల్లలకు వారసత్వంగా ఆస్తి ఇవ్వడం మామూలుగా జరుగుతుంటుంది. కానీ ఆ వయసులో కొన్నట్లు చూపడమే కొసమెరుపు. చంద్రబాబు పేరుతో ఉన్న స్థిరాస్థులు 1. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కొడుకు లోకేశ్‌తో కలిపి 1,285 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.70.20 కోట్లుగా చూపారు. 2. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి వద్ద 96.23 సెంట్ల భూమి. విలువ రూ.77.33 లక్షలుగా చూపించారు. 3. నారావారిపల్లె శేషాపురంలో ఇల్లు. విలువ రూ.43.66 లక్షలుగా పేర్కొన్నారు. భువనేశ్వరి పేరుతో స్థిరాస్థులు 1. హైదరాబాద్ మదీనగూడలో 5 ఎకరాల వ్యవసాయ భూమి (ఫామ్ హౌస్). దాని విలువ రూ.55 కోట్లుగా చూపారు. 2. తమిళనాడు కాంచీపురం జిల్లా సెన్నేర్ కుప్పం గ్రామంలో 2.33 ఎకరాల వాణిజ్య భూమి. విలువ రూ.30.10 కోట్లుగా చూపారు. లోకేశ్ స్థిరాస్థులు 1. హైదరాబాద్ మదీనగూడలో నానమ్మ గిఫ్ట్‌గా ఇచ్చిన 5 ఎకరాల వ్యవసాయ భూమి. దాని విలువ రూ.57.21 కోట్లుగా చూపారు. 2. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తండ్రి చంద్రబాబుతో కలిపి (50 శాతం వాటా) 1285 గజాల్లో నివాస భవనం. విలువ రూ.35.10 కోట్లుగా పేర్కొన్నారు. బ్రాహ్మణి స్థిరాస్థులు 1. హైదరాబాద్ మాదాపూర్‌లో 924 గజాల స్థలం. విలువ రూ.4.15 కోట్లుగా పేర్కొన్నారు. 2. రంగారెడ్డి జిల్లా మల్లాపూర్‌లో 4 వేల గజాల స్థలం. విలువ రూ.90.39 లక్షలుగా చూపించారు. 3. హైదరాబాద్ మణికొండలో 2,440 గజాల స్థలం. విలువ రూ.3.66 కోట్లుగా చూపారు. 4. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కొడుకు దేవాన్ష్‌తో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల్లో వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా చూపారు. 5. చెన్నైలో 383 గజాల స్థలం. విలువ రూ.6.69 కోట్లుగా పేర్కొన్నారు. దేవాన్ష్ స్థిరాస్థులు 21. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తల్లి బ్రాహ్మణితో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా పేర్కొన్నారు. -
రేపటి నుంచే నామినేషన్ల పర్వం, సర్వేలన్నీ బంద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో గురువారం నుంచి మరో అంకం ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రేపు (ఏప్రిల్ 18) నోటిషికేషన్ విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. అదే విధంగా నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా గురువారం నుంచి మొదలు కానుంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. 25 నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 26న నామినేషన్ల పరిశీలించి.. 29న నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. సర్వేలు బంద్ రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు పుల్‌స్టాప్ పడ్డట్టయింది. రేపటి నుంచి ఏ సంస్థ, ఏ వ్యక్తి.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించకూడదు, ప్రజలకు వెల్లడించకూడదు. ప్రీపోల్ సర్వే కానీ, ఒపినియన్ పోల్ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించకూడదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు తెలంగాణలోనూ మే 13నే ఎన్నికలు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు, ఒక అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక జూన్ 4న ఓట్ల లెక్కింపు ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ జిల్లాలో ఎవరెవరు బరిలో ఉన్నారు? ఈ లింకు నొక్కండి. ఎన్నికల సమస్త సమాచారం ఒకచోట చూడండి. -
సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో జనగర్జన
ముదిగుబ్బ నుంచి కదిరికి వెళ్లే మార్గం మధ్యలో నడిమిపల్లి వద్ద బస్సు దిగిన సీఎం.. ఓ వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడారు. ‘మీకు వలంటీర్ల ద్వారా పెన్షన్ ఇంటి దగ్గర ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు. ఈసీకి ఫిర్యాదు చేసి ఇంటి దగ్గరకు పెన్షన్ పంపిణీ నిలిపివేయించాడు’ అని చెప్పారు. ఈ క్రమంలో వృద్ధురాలు మాట్లాడుతూ.. ‘చంద్రబాబుతో మాకు పనిలేదు. ఎన్నాళ్లు ఆపుతాడు? మాకు నువ్వే కావాలి. నువ్వుంటే మాకు ఏ కష్టం ఉండదు’ అంటూ ఆమె భావోద్వేగానికి గురైంది. (మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ప్రజాభిమానం పోటెత్తింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఐదో రోజు సోమవారం విజయవంతంగా కొనసాగింది. కిలోమీటర్ల కొద్దీ జనం రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. మండుటెండను కూడా లెక్క చేయకుండా బస్సు వెనుక యువత పరుగులు తీయడం గ్రామ గ్రామాన కనిపించింది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం సంజీవపురంలోని బస కేంద్రం నుంచి ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్ర మొదలైంది. అయితే ఉదయం 6 గంటల నుంచే బస కేంద్రం వద్దకు జనం భారీగా తరలివచ్చారు. అనంతపురం–చెన్నై జాతీయ రహదారిపైకి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు చేరుకోవడంతో పండుగ వాతావరణం తలపించింది. రోడ్‌షో బత్తలపల్లి మండల కేంద్రానికి చేరుకునేలోపే రోడ్డుపై ఇసుకేస్తే రాలనంత మంది సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. బత్తలపల్లి జంక్షన్, ప్రభుత్వ పాఠశాల ఎదురుగా భారీ గజమాలలతో ప్రజలు సీఎంను సత్కరించారు. అంజినమ్మ అనే మహిళ తన పొలంలో పండిన వేరుశనగ పంటను సీఎంకు అందించింది. ఈ క్రమంలో ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా ఇతర పథకాలు అందాయా.. అని ఆమె కుటుంబ యోగ క్షేమాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. అప్పస్వామి అనే వ్యక్తి సీఎం జగన్‌కు గొంగడి (కంబడి), గొర్రె పిల్లను బహూకరించారు. జన సముద్రాన్ని తలపించిన బత్తలపల్లి జంక్షన్లో సీఎం కాన్వాయ్ ఎంతో కష్టంతో ముందుకు వెళ్లాల్సి వచ్చింది. 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సీఎం రోడ్‌షో ఆ ఊరిలోనే కొనసాగిందంటే ఎంతగా అభిమాన జనం అడ్డుపడ్డారో అర్థం చేసుకోవచ్చు. పెత్తందారులతో పోరుకు మీ వెంటే అంటూ జనం నినాదాలు చేశారు. మేమంతా సిద్ధం అంటూ గర్జించారు. కాన్వాయ్‌తో సమాంతరంగా పరుగులుపెట్టారు. మురిసిన ముదిగుబ్బ బత్తలపల్లి నుంచి ముదిగుబ్బ మధ్య రామాపురం, కట్టకిందపల్లి, రాళ్ల అనంతపురం సహా పలు గ్రామాల ప్రజలు జాతీయ రహదారిపైకి చేరుకుని సీఎంకు ఘన స్వాగతం పలికారు. రామాపురంలో బస్సు దిగి సీఎం జగన్ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ముదిగుబ్బకు చేరుకునేలోపే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపై బారులు తీరారు. అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, జగనన్న చేదోడు తదితర పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా తాము నిలదొక్కుకోవడానికి, గౌరవ ప్రదమైన జీవనం కొనసాగించడానికి దోహదపడ్డ నాయకుడిని ఒక్కసారైనా చూడాలనే పట్టుదలతో ఆ ప్రాంత ప్రజలు పోటీపడ్డారు. మధ్యాహ్నం 2.50 గంటలకు ముదిగుబ్బ చేరుకున్న సీఎంకు గజమాలతో స్వాగతం చెప్పారు. పెద్ద ఎత్తున కదలివచ్చిన జనానికి బస్సుపై నుంచి సీఎం అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. 3.27 గంటల వరకు సుమారు 37 నిమిషాలు సీఎం జగన్ ముదిగుబ్బ జనంతో మమేకమయ్యారు. అక్కడి నుంచి కదిరికి బయలుదేరిన సీఎం జగన్‌ను గ్రామగ్రామాన ప్రజాభిమానం అడ్డుకుంది. నాగారెడ్డిపల్లి గ్రామస్తులు భారీ గజమాలతో సీఎంకు స్వాగతం పలికారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం కదం తొక్కిన కదిరి కదిరి పట్టణంలోకి వస్తున్న సీఎం జగన్‌కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. సీఎం రాక నేపథ్యంలో నేల ఈనిందా అన్నట్టు జనంతో కదిరి రోడ్లు కిటకిటలాడాయి. జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ప్రజలు కదం తొక్కారు. సీఎం వస్తున్నారని ఉదయం నుంచే కదిరి పట్టణంలో పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది. ప్రజాభిమానం అడ్డు పడటం వల్ల నిర్దేశించిన షెడ్యూల్ కంటే మూడు గంటలు పైనే ఆలస్యం అయినప్పటికీ, తమ అభిమాన నేతను చూడాలన్న ఆశతో ప్రజలు ఓపికతో వేచి చూశారు. సాయంత్రం 5:45 గంటలకు కదిరిలోకి ప్రవేశించిన సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తమ సెల్ఫోన్లలోని టార్చ్లైట్లను ఆన్ చేసి ప్రజలు సీఎం జగన్ యాత్రకు సంఘీభావం తెలిపారు. ఇలా రాత్రి 7.55 గంటల వరకు సీఎం జగన్ రోడ్‌షో రెండు గంటల పాటు కదిరిలోనే కొనసాగింది. అనంతరం బస్సుపై నుంచి రోడ్‌షో నిర్వహించిన సీఎం జగన్.. పీవీఆర్ కళ్యాణ మండపంలో ముస్లిం సోదరులతో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ‘సాధారణంగా ఎన్నికల సమయంలో మీకు ఫలానా మేలు చేస్తాం.. మాకు ఓటు వేయండి’ అని ప్రజలకు నాయకులు హామీ ఇవ్వడాన్ని చూస్తుంటాం. అయితే బస్సు యాత్రలో సీఎం జగన్‌ను కలిసిన పలువురు ‘మీ పాలనలో ఏదో ఒక రూపంలో మా ఇంటికి మేలు జరిగింది. వచ్చే ఎన్నికల్లో తిరిగి మిమ్మల్నే గెలిపించుకుంటాం’ అని హామీ ఇస్తున్నారు. అటువైపు బీజేపీ, టీడీపీ, జనసేన, ఇలా ఎన్ని పార్టీలు, ఎంత మంది వ్యక్తులు కలిసి వచ్చినా మీ వెంట మేమంతా ఉన్నామంటూ ప్రజలు సీఎంకు భరోసానిచ్చారు. కదిరి నుంచి నల్లచెరువు, తనకల్లు మండల కేంద్రాల మీదుగా రాత్రి 10 గంటలకు చీకటివానిపల్లె విడిది కేంద్రానికి సీఎం జగన్ చేరుకున్నారు. షెడ్యూల్ కంటే నాలుగు గంటలు ఆలస్యమైనా ప్రజలు, మహిళలు దారి పొడవునా వేచి చూశారు. ఇదే మా హామీ వితంతు మహిళనైన నాకు ఈ ప్రభుత్వంలో ఇంటి స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి అండగా నిలిచారు. వితంతు పెన్షన్‌ను నెలనెలా ఒకటో తేదీనే ఇంటికి పంపారు. ఇంత మేలు చేసిన ఆయన్ను గెలిపించుకోకుంటే ఇంకెవరిని గెలిపించుకుంటాం? ఇది జగనన్నకు మా హామీ. – వెంకటలక్ష్మి, బత్తలపల్లి మళ్లీ జగన్‌ను గెలిపించుకుంటాం నాకు 60 ఏళ్లు పైనే ఉన్నాయి. కర్రసాయం లేనిదే నడవలేని పరిస్థితి. నా కొడుకు చనిపోయాడు. ఈ క్రమంలో నెలనెలా రూ.3 వేల పెన్షన్‌ను ఇంటికి పంపి పెద్ద కొడుకులా సీఎం జగన్ నన్ను సాదుకొచ్చాడు. ఆ టీడీపీ వాళ్లు వలంటీర్లతో పెన్షన్ పంచకుండా అడ్డుపడ్డారట. ఏం పర్లేదు. ఒకటి రెండు నెలలేగా.. మళ్లీ నా పెద్ద కొడుకు జగన్ ఇంటి దగ్గరకే పెన్షన్ పంపుతాడు. ఆయన్ను మేం గెలిపించుకుంటాం. – సాకలి చెన్నప్ప, కదిరి శివారు గ్రామం కుటగుళ్ల ఏమ్మా.. తల్లీ ఎలా ఉన్నారు? ‘ఏమ్మా తల్లీ.. ఎలా ఉన్నారు? ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా? వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారా’ అంటూ మహిళా కూలీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముచ్చటించారు. బస్సు యాత్ర బత్తలపల్లి సమీపంలోకి వచ్చినప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డిని చూడాలన్న తపనతో పొలంలో వేరుశనగ తొలగిస్తున్న కూలీలు పరుగు పరుగున రోడ్డుపైకి చేరుకున్నారు. వారిని గమనించిన సీఎం వైఎస్ జగన్... బస్సు ఆపించి వారితో మాట్లాడారు. ‘ఆసరా డబ్బులు చేతికి అందాయా తల్లీ.. పొదుపు సంఘాలు ఎలా నడుస్తున్నాయి.. అమ్మఒడి వస్తోందా...’ అని ఆరా తీశారు. తమను అంత ఆప్యాయంగా పలకరించే సరికి సంబరపడిన కూలీలు..‘మన ప్రభుత్వంలో అన్నీ అందుతున్నాయి సార్..’ అని బదులిచ్చారు. -
కింజరాపు కోటపై తిరుగుబాటు బావుటా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘అచ్చెన్నకు మాపై ఎందుకంత కక్ష’.. అంటూ మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ వందలాది ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అచ్చెన్న, కూన రవికుమార్ కుట్ర వల్లే నాకు టికెట్ రాలేదు. ఎంపీకై నా ఇక్కడి ఓట్లు అక్కర్లేదా..’ అంటూ పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కార్యకర్తల ముందు బాధనంతా వెళ్లగక్కారు. బాబాయ్, అబ్బాయ్‌ల ఆధిపత్య ధోరణిపై జిల్లా టీడీపీ సీనియర్ నాయకులంతా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. టికెట్ల ప్రకటన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. పార్టీలో ఏం జరిగినా తమ కనుసన్నల్లోనే జరగాలనే ధోరణిలో వ్యవహరిస్తున్న కింజరాపు కుటుంబంపై స్వపక్ష నాయకులంతా గుర్రుగా ఉన్నారు. శ్రీకాకుళంలో కావాలనే.. శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండ ఫ్యామిలీని తొక్కాలని కింజరాపు ఫ్యామిలీ మొదటి నుంచీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడది మరింత ఎక్కువైంది. తమ చెప్పు చేతుల్లో ఉండే నాయకుడు తప్ప తమ ను ప్రశ్నించే నాయకుడు ఉండకూదని గుండ అప్ప లసూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులను సమ యం వచ్చినప్పుడల్లా టార్గెట్ చేస్తున్నారు. వ్యూహాత్మకంగానే గొండు శంకర్‌ను రంగంలోకి దించి ఉసిగొల్పారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించారు. చెప్పాలంటే గుండ ఫ్యామిలీపై గొండు శంకర్‌ను ఎక్కు పెట్టారు. బాగా డబ్బులు ఖర్చు పెట్టగ ల శంకర్‌తో నానా హడావుడి చేయించారు. గొండు శంకర్‌కే తప్ప గుండ ఫ్యామిలీకి ఏమీ లేదన్నట్టుగా అధిష్టానం దృష్టికి వెళ్లేలా చేశారు. చివరికొచ్చేసరికి టికెట్ విషయంలో పైరవీలు చేశారు. ప్రస్తుతం టీడీపీ అంతా డబ్బు మయమైపోయింది. ఎవరెక్కువ ఇస్తే వాళ్లకే టిక్కెట్ అంటూ లాబీయింగ్‌కు పెద్ద పీట వేసింది. ఈ క్రమంలో ఒక వైపు డబ్బు, మరోవైపు కింజరాపు ఫ్యామిలీ ఒత్తిడి వెరసి గుండ ఫ్యామిలీకి టిక్కెట్ దక్కకుండా చేసింది. ఇదంతా బహిరంగ రహస్యమే. డబ్బుతోనే టిక్కెట్ సాధించుకున్నానని, మీకు అది చేతకాలేదని గొండు శంకర్ అందరి దగ్గర అంటున్నారని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుకు రూ.10కోట్లు, లోకేష్‌కు రూ.10కోట్లు, అచ్చెన్నాయుడికి ఇన్ని కోట్లు, రామ్మోహన్నాయుడికి ఇన్ని కోట్లు, కూన రవికుమార్‌కు ఇన్ని కోట్లు ఇచ్చానని టిక్కెట్ సాధించిన వ్యక్తే చెబుతున్నాడని మీడియా ముందు టీడీపీ నాయకులు ఆరోపించ డం గమనార్హం. దీన్ని బట్టి టిక్కెట్ల కేటాయింపులో డబ్బుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతోంది. డబ్బుకు రుచి మరిగారు.. పాతపట్నంలోనూ దాదాపు అదే పరిస్థితి చోటు చేసుకుంది. అక్కడ కూడా మామిడి గోవిందరావు ఆఫర్‌కు తలొగ్గి తనకు అచ్చెన్నాయుడు దెబ్బకొట్టారని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. కింజరాపు ఫ్యామిలీని నమ్ముకుని టిక్కెట్ కోసం ప్రయత్నించగా, సైలెంట్‌గా కింజరాపు ఫ్యామిలీ దెబ్బకొట్టిందని కలమట వెంకటరమణ ఆవేదన చెందుతున్నారు. అంతా వారే చేశారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. పార్టీ పూర్తిగా డబ్బులకు అమ్ముడు పోయిందని, ప్లాట్ల పేరిట డబ్బులు తీసుకుని మోసం చేసిన మామిడి గోవిందరావును అభ్యర్థిగా పెట్టారంటే పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థమైపోయిందని, నాయకులు ఏ విధంగా అమ్ముడు పోయారనేది స్పష్టమవుతుందని టీడీపీని నమ్ముకుని మొదటి నుంచి రాజకీయాలు చేస్తున్న నాయకులు ఓపెన్ అవుతున్నారు. మామిడి గోవిందరావు ఇచ్చిన డబ్బులకు రుచిమరిగి నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టేశారని భంగ పడిన నాయకులంతా ఆరోపిస్తున్నారు. సీనియర్ ఉంటే ఎదురు తిరుగుతారని, జూనియర్‌ను పెట్టుకుంటే చెప్పినట్టు నడుచుకుంటారని, తమ మాట జవదాటరనే ఉద్దేశంతో కలమటకు వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారని చెబుతున్నారు. కళా.. చివరికిలా.. జిల్లాలో మరో సీనియర్ నేత కళా వెంకటరావు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. తమకు సమాంతరంగా రాజకీయాలు చేస్తున్నారన్న కారణంతో ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కే ప్రయత్నం చేశారు. అదును చూసి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కట్టబెట్టేలా పావులు కదిపారు. ఎచ్చెర్లకు ప్రాతిని ధ్యం వహిస్తే తమకు అడ్డు తగులు తారని, ఈ జిల్లాలోనే లేకుండా చేస్తే పనైపోతుందని భావించి కళా వెంకటరావుకు పొత్తు సెగ పెట్టారు. కుడితి లో పడ్డ ఎలుకలా ప్రస్తుతం కళా గిలగిల కొట్టుకుంటున్నారు. కింజరాపు ఫ్యామిలీ కుట్రలను ఛేదించలేక చతికిలపడ్డారు. చివరికి చీపురుపల్లి అసెంబ్లీ స్థానం కేటాయించి పార్టీ చేతులు దులుపుకుంది. ఎన్నికల్లో మూల్యం తప్పదు కింజరాపు ఫ్యామిలీ కుట్రలకు బలైన నాయకులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమను టార్గెట్ చేసి రాజకీయంగా తొక్కేసిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడుకు బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ రామ్మోహన్‌ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తమను ఇబ్బంది పెట్టిన వారికి బదులివ్వాల్సిందేనని, రేపు ఎలా ఓట్లు పడతాయో చూస్తామంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. వారి స్వార్థ రాజకీయాలకు మమ్మల్ని బలి పశువు చేస్తారా? అని ఆగ్రహంతో రగిలిపోయి ఉన్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు అంటేనే ఒంటి కాలితో లేస్తున్నారు. మమ్మల్ని దెబ్బకొట్టినోళ్లకు తమ దెబ్బ ఏంటో చూపిస్తామంటున్నారు. -
టీడీపీ మునస్వామి.. థామస్ ఎలా అయ్యాడు?
‘డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు కాషే ఉంటే ఫేస్‌కు విలువస్తుంది నోటే ఉంటే మాటకు బలమొస్తుంది..’ ఇది ఓ తెలుగు సినిమాలో ఫేమస్ పాట. అచ్చం ఇలాంటిదే జీడీనెల్లూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. టీడీపీ తురఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న వీ.ఎం.థామస్ కులం, మతం, చదవులపై పలు అనునాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్మీడియెట్ టీసీలో వీ.మునస్వామిగా ఉన్న ఆయన పేరు ఆ తర్వాత కొంత కాలానికి వీ.ఎం.థామస్‌గా మారిపోవడం వెనుక ఆంతర్యమేమిటో అంతుపట్టడంలేదు. ఇక ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా పేరుగడిస్తున్న ఆయన చదువుపైనా హిందూ ధర్మ పరిరక్షణ సమితి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నిజనిజాలు నిగ్గు తేల్చాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని గంగాధరనెల్లూరు నియోజకవర్గం టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మునస్వామి (థామస్) 1990–91లో కార్వేటినగరం మండల కేంద్రంలోని ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తిచేశారు. ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీచేయబోతున్న ఆయనపై పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మునస్వామి మతం, విద్యార్హతలు, నేరచరిత్ర పైన సమగ్ర విచారణ చేయాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మిట్టపల్లి సతీష్‌రెడ్డి జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇంటర్మీడియెట్ కోర్సు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టీసీ)లో వీ.మునస్వామిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్టు, కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్‌గా ఎలా అయ్యారనే విషయాన్ని సమగ్ర విచారణ చేయించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంబీబీఎస్ చేయకున్నప్పటికీ డాక్టర్‌గా చెలామణి అవుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం థామస్ అనే క్రిస్టియన్ పేరు మీద చెలామణి అవుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. థామస్ పేరులోనే క్రిస్టియానిటీ ఉందని, కావున అతని ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసి, థామస్ నామినేషన్‌ను తిరస్కరించి, ఎన్నికల్లో అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. తప్పుడు పత్రంతో ఎన్నికల్లో పోటీ క్రైస్తవ మతం స్వీకరించిన థామస్‌కు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మతం మారిన ఎస్సీలను బీసీలుగా గుర్తించాలని చట్టం చెబుతోందన్నారు. అయినప్పటికీ ఆయన తప్పుడు కులధ్రువీకరణ పత్రం సమర్పించి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. ఆయన ఎంబీబీఎస్ చదవక పోయినా పీహెచ్‌డీని అడ్డుపెట్టుకుని డాక్టర్‌గా చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తను ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని, 2017లో తన వద్ద డాక్టర్‌గా పనిచేసి మానేసిన డాక్టర్ ఎస్.రమ్యను హత్య చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలున్నాయన్నారు. ఆ కేసులో ఆయనతో పాటు ఆరుగురు అరెస్టు కాగా, తరువాత ఆ కేసు ఏమైందో తెలియడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా కులధ్రువీకరణపత్రం 2022లో కార్వేటినగరం మండలంలో పనిచేసిన తహసీల్దార్ క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే నిబంధనలకు వ్యతిరేకంగా థామస్‌కు కులధ్రువీకరణ పత్రం జారీచేశారని తెలిసింది. 2022లో కార్వేటినగరం తహసీల్దార్‌గా పనిచేసిన షబ్బర్బాషా 26–04–2022న వీ.మునస్వామికి వీ.మునస్వామి థామస్ అని కులధ్రువీకరణ పత్రం ఎలా ఇచ్చారు?.. కులంపై వివాదం వచ్చినపుడు సంబంధిత గ్రామంలో నలుగురిని అడిగి పంచనాయా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కులధ్రువీకరణ పత్రం ఎలా జారీచేశారని ఫిర్యాదుదారులు ప్రశ్నిస్తున్నారు. థామస్ మత మార్పిడి విషయాన్ని సమగ్రంగా విచారణ చేయాలని జై హిందుస్థాన్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అక్కిలిగుంట మధు ఈనెల మార్చి 15న జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్‌కు వినతి పత్రం అందజేశారు. ఆయన అందజేసిన వినతిలో సహజంగా పాస్ పోర్టు మంజూరు సమయంలో ఒక అక్షరం తప్పు ఉన్నా అధికారులు ఆమోదించరన్నారు. అలాంటిది మునస్వామి థామస్ అని పాస్‌పోర్టులో పొందారన్నారు. పేరు మార్చుకోవాలంటే గెజిట్ నోటిఫికేషన్ ఉండాలని, మతం మార్చుకుని ఉంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. కాబట్టి పాస్‌పోర్టు సమయంలో మత మార్పిడి ధ్రువీకరణ పత్రం, గెజిట్ నోటిఫికేషన్ సమర్పించి ఉంటారని, సంబంధిత కార్యాలయం నుంచి నివేదిక తెప్పించుకుని విచారణ చేయాలని ఆ ఫిర్యాదులో కోరారు. వీటిపై సమగ్ర విచారణ 1.ఇంటర్ సర్టిఫికేట్లో వీ.మునస్వామి అని ఉన్న పేరు, పాస్‌పోర్టులో వీ.ఎం.థామస్‌గా ఎలా మారింది? 2.ఆయన జన్మస్థలం అల్లాగుంటని టీసీలోనూ, చైన్నె అని పాస్‌పోర్టులోనూ పేర్కొన్నారు. ఇందులో ఏది నిజం? 3. ఆయన వైద్యశాస్త్రం చదివారా..? లేక డాక్టరేట్ పొందిన వ్యక్తా? 4. ఆయనపై ఉన్న హత్యా ప్రయత్నం కేసు ఏమైంది. విచారణ కొనసాగుతోందా..? లేక కేసు కొట్టి వేశారా? పకడ్బందీగా విచారణ ఆధార్ కార్డులో వీ.ఎం, థామస్ అని ఉంది. ఏప్రిల్ 2022లో పనిచేసిన తహసీల్దార్ జారీచేసిన కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్ అని జారీచేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నుంచి అందిన ఫిర్యాదులను సమగ్రంగా విచారిస్తున్నాం. ఆ ఫిర్యాదులకు సంబంధించిన రుజువులను పంపుతాం. ఈ ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటాను. – పుష్పకుమారి, తహసీల్దార్, కార్వేటినగరం మండలం
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019