breaking news
Ad - Sakshi_Home_Sticky
-
అఫీషియల్: ఓటీటీకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్'. ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. గతంలో రిలీజైన డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 29 ప్రేక్షకుల ముందుకొచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కావడంతో ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుంది. 'చరిత్ర పునరావృతం అవ్వడం సాధారణం. అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవ్వుతాయి. అట్లుంటది టిల్లుతోని. టిల్లు స్క్వేర్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 26న వస్తుంది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. History repeat avvadam normal. Adhe Tillu vasthe History, mystery, chemistry anni repeat avvuthai. Atluntadhi Tilluthoni. ✨🥰 Tillu Square arrives on 26 April, on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi. pic.twitter.com/SwEzFgJujb — Netflix India South (@Netflix_INSouth) April 19, 2024 -
ముద్దు సీన్లో నటిస్తే తప్పేంటి?: అనుపమ
తమిళసినిమా: పక్కింటి అమ్మాయిగా ఇమేజ్ తెచ్చుకున్న అతి తక్కువ మంది నటీమణుల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అలాంటిది ఇప్పుడీ మలయాళీ భామ కూడా గ్లామర్‌కు గేట్లు ఎత్తేశారు. ప్రేమమ్ చిత్రంతో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా పరిచయం అయిన ఈమె తమిళంలోనూ కొడి, తల్లిపోగాదే, సైరన్ వింటి చిత్రాల్లో నటించారు. ఇక తెలుగులో కథానాయకిగా పలు హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కాగా ఇటీవల టిల్లు స్క్వేర్ అనే తెలుగు చిత్రంలో లిప్‌లాక్, అందాలారబోత అంటూ విజృంభించారు. దీంతో నటి అనుపమ పరమేశ్వరన్‌నే ఇలా నటించింది? అని చాలా మంది ఆశ్చరపడుతున్నారు. కొందరైతే అంతా బాగా ఉందిగా సడన్‌గా ఈ అమ్మడికి ఏమొచ్చిందీ? అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మొత్తం మీద అ కేరళ కుట్టి ఇప్పుడు వార్తలో నానుతున్నారు. గుడ్డిలో మెల్ల అన్న సామెత మాదిరి ఈమె నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం హిట్ అయ్యింది. అందాలారబోత అనే విషయాన్ని పక్కన పెడితే అనుపమ పరమేశ్వరన్‌కు ఈ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. గ్లామర్‌గా నటించడంపై వస్తున్న విమర్శనలపై అనుపమ ఘాటుగానే స్పందించారు. ఈమె ఒక భేటీలో పేర్కొంటూ తాను లిప్‌లాక్ సన్నివేశంలో నటించడాన్ని ఏదో పెద్ద తప్పు చేసినట్లు విమర్శిస్తున్నారనీ, తాను ముద్దు సన్నివేశాల్లో నటించననీ, గ్లామరస్‌గా నటించనని చెప్పింది తన 18 ఏళ్ల వయసులోనని అన్నారు. అయితే నటిగా తానిప్పుడు చాలా పరిణితి చెందానన్నారు. కథకు అవసరం అయితే లిప్‌లాక్ వంటి సన్నివేశాల్లో నటించడం తప్పేకాదని అన్నారు. అంతే కాకుండా ఒకేరకమైన మూస పాత్రల్లో నటించి బోర్ కొడుతోందని పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే టిల్లు స్క్వేర్ చిత్రం చూసిన తరువాత ప్రశంసించడమో, విమర్శించడమో చేయవచ్చు గానీ, చిత్రం చూడకుండానే విమర్శించడం కరెక్ట్ కాదని నటి అనుపమ పరమేశ్వరన్ ఫైర్ అయ్యారు. -
Tillu Square Box Office Collection: బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘టిల్లుగాడు’
లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినంటోన్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్వ్కేర్’. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుంది. టిల్లుగాడి మ్యానరిజం, పంచ్ డైలాగ్స్‌కి సినీ ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు. ఫలితంగా తొలిరోజు భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి ఫస్ట్‌డే రూ.23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. (చదవండి: ‘టిల్లు స్వ్కేర్’ మూవీ రివ్యూ) అలాగే అమెరికాలో ఈ చిత్రం తొలిరోజు 1 మిలియన్ డాలర్స్‌కి పైగా వసూళ్లను రాబట్టింది. హిట్ టాక్ రావడంతో వీకెండ్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేస్తుందని నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2022లో వచ్చిన డీజే టిల్లు చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే ‘టిల్లు స్వ్కేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. Tillu Registers a 𝐃𝐎𝐔𝐁𝐋𝐄 𝐁𝐋𝐎𝐂𝐊𝐁𝐔𝐒𝐓𝐄𝐑 Start at the Box-Office with 𝟐𝟑.𝟕 𝐆𝐑𝐎𝐒𝐒 on 𝐃𝐀𝐘 𝟏 🔥 Our Starboy 🌟 is shattering the records all over! 💥💥 Book your tickets here - https://t.co/vEd8ktSAEW #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala… pic.twitter.com/Dz7hqglg5Z — Sithara Entertainments (@SitharaEnts) March 30, 2024 -
టిల్లు స్క్వేర్ పబ్లిక్ టాక్.. ఎలా ఉందంటే!
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 'టిల్లు స్క్వేర్'. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ ఉదయాన్నే ఓవర్సీస్తో పాటు మొదటి షో థియేటర్లలో అలరిస్తోంది. ఈ సినిమా చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి ఈ సినిమా డీజే టిల్లు మరిపించిందా? అన్న విషయంపై ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు. కొందరేమో ఫుల్ ఫన్ రోలర్‌కోస్టర్‌గా అలరించిందని కామెంట్స్ చేస్తున్నారు. సిద్ధు ఎనర్జీ, అనుపమ ఫర్మామెన్స్ కట్టిపడేశాయని అంటున్నారు. సిద్ధు గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సిద్ధూ తన ట్రేడ్‌మార్క్ చూపించాడని పోస్ట్ చేస్తున్నారు. ఫన్ ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా ఉందని అంటున్నారు. ఫస్ హాఫ్ డీసెంట్‌గా ఉందని.. సెకండాఫ్‌లో ట్విస్టులు అదిరిపోయాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. #TilluSquare is one hell of a movie; it's literally a square of entertainment that we had in DJ Tillu. Moreover, those one-liners 👌, as usual, Star Boy Siddu shines, Anupama did well, and the music is a big plus 💯. Overall: 3.5/5.#TilluSquarereview — keishhh (@FCB_LM_91) March 29, 2024 Show stealer siddhu buoy show throughout…same DJ Tillu treatment…if you love DJ Tillu you will love #TilluSquare ..just go to the theatres and enjoy the senseless lol ride 🍻🍻 https://t.co/Rbxi2TyWAd — 🌶️🔥 (@PenuToofan) March 29, 2024 First half of #TilluSquare is entertaining! Lot of Déjà Vu of #DJTillu in the movie. Siddhu 👍 https://t.co/C4pgRwbN0Q — idlebrain jeevi (@idlebrainjeevi) March 29, 2024 #TilluSquare - a rollercoaster of fun! Siddhu's energy lights up the screen, Anupama is good, and the never ending one-liners kept me hooked. Despite the occasional disjointed scenes & questionable green screens, it still manages to captivate! Perfect for a one-time watch! 3/5 😍 pic.twitter.com/W3qnppCjYF — Swathiiii 🌸 (@Swathi_Prasad96) March 29, 2024 #TilluSquare Decent 1st Half! Siddhu is back again with his trademark energetic avatar and one liners that are carrying the film. Comedy works in parts so far but feels redundant at times . Fun interval twist sets up the 2nd half well. — Venky Reviews (@venkyreviews) March 29, 2024 -
టిల్లుకి, నాకు ఆ ఒక్కటే తేడా : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ
‘డీజే టిల్లు’ సమయంలో ప్రేక్షకుల్లో అంచనాల్లేవు. హీరో పాత్ర ఎలా ఉంటుంది అనేది ముందు తెలీదు. అందుకే ఆ పాత్రను చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు అదే పాత్రతో ‘టిల్లు స్వ్కేర్’ చేయాల్సి రావడంతో కాస్త ఒత్తిడి ఉండటం సహజం. అయితే ఒత్తిడిని జయించి మెరుగైన అవుట్ పుట్ని అందించడానికి ప్రయత్నించాం’ అన్నారు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్వ్కేర్’. 'డీజే టిల్లు'చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. మార్చి 29న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో గురువారం సిద్ధు జొన్నలగడ్డ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ‘డీజే టిల్లు’ కథకి, టిల్లుగాడి పాత్రకి కొనసాగింపుగా ఈ చిత్రం ఉంటుంది. పాత్ర కొనసాగింపు పూర్తి స్థాయిలో ఉంటుంది. కథ కొనసాగింపు కూడా కొంత ఉంటుంది కానీ.. అది పాత కథను గుర్తుచేస్తూ కొత్త అనుభూతిని ఇస్తుంది. టిల్లు పాత్ర కూడా సీక్వెల్ లో ఇంకా ఎక్కువ ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటి అనేది ఇప్పుడే చెప్పను. థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు. చాలా సర్ ప్రైజ్ లు, షాక్ లు ఉంటాయి. సినిమా అంతా నవ్వుకుంటూనే ఉంటారు. టిల్లు ఎక్కడా నవ్వడు.. కానీ అందరినీ ఫుల్ గా నవ్విస్తాడు. ► డీజే టిల్లులో హీరో, హీరోయిన్ రెండు పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా అలాగే ఉంటుంది. హీరో పాత్ర లేకపోతే హీరోయిన్ పాత్ర పండదు, అలాగే హీరోయిన్ పాత్ర లేకపోతే హీరో పాత్ర పండదు. ► ఈ సినిమాలోని టిల్లు పాత్ర నా ఆలోచనలు, నేను చూసిన అనుభవాల నుంచి పుట్టింది. టిల్లుకి, నాకు ఒక్కటే తేడా. టిల్లు తన మనసులో ఉన్నవన్నీ బయటకు అంటాడు. నేను మనసులో అనుకుంటాను అంతే తేడా. ► ఈ సినిమా నిడివిని కావాలని తగ్గించలేదు. సినిమాకి ఎంత అవసరమో అంత ఉంచాము. కామెడీ సినిమా కాబట్టి ఎక్కువ నిడివి లేకపోతేనే ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రేక్షకులను పూర్తిస్థాయి వినోదాన్ని అందించగలం. ► సీక్వెల్ చేద్దాం అనుకున్న సమయంలో విమల్ వేరే ప్రాజెక్ట్ కమిట్ అయ్యి ఉండటంతో అందుబాటులో లేరు. మరోవైపు నేను, మల్లిక్ ఒక సినిమా చేద్దామని అప్పటికే అనుకుంటున్నాము. మా కలయికలో డీజే టిల్లు సీక్వెల్ చేస్తే బాగుంటుంది అనిపించి.. అలా మల్లిక్ న దర్శకుడిగా తీసుకోవడం జరిగింది. ► త్రివిక్రమ్ గారి సలహాలు, సూచనలు ఖచ్చితంగా సినిమాకి హెల్ప్ అవుతాయి. అయితే ఆయన ఎప్పుడూ కథలో మార్పులు చెప్పలేదు. ఈ భాగం ఇంకా మెరుగ్గా రాస్తే బాగుంటుంది వంటి సలహాలు ఇచ్చేవారు. ► ఈ సినిమా సీక్వెల్ అనుకున్నప్పుడు లక్కీగా ఒక మంచి కథ తట్టింది. అలాగే పార్ట్-3 కి కూడా జరుగుతుందేమో చూడాలి. రెండు మూడు ఐడియాస్ ఉన్నాయి.. చూడాలి ఏమవుతుందో. అయితే టిల్లు-3 కంటే ముందుగా మరో విభిన్న కథ రాసే ఆలోచనలో ఉన్నాను. ప్రస్తుతం ఐతే నా దృష్టి అంతా టిల్లు స్క్వేర్ పైనే ఉంది. ► ఇలాంటి సినిమాలకు సంభాషణలే కీలకం. అవి ఎంతలా ప్రేక్షకులకు చేరువైతే అంత వినోదం పండుతుంది. సంభాషణలు నా మనసు నుంచి, నా మెదడు నుంచి పుట్టాయి కాబట్టి.. ఏ ఉద్దేశంతో రాశాను, ఎలా పలకాలి అనే దానిపై నాకు పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే డీజే టిల్లు పాత్ర ప్రేక్షకులకు అంత దగ్గరైంది.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019