breaking news
Ad - Sakshi_Home_Sticky
-
IPL 2024: తొలి ఫాస్ట్ బౌలర్‌గా మయాంక్ సంచలన రికార్డు
మయాంక్ యాదవ్.. 21 ఏళ్ల ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్‌లోకి ఓ బుల్లెట్లా దూసుకువచ్చాడు. అరంగేట్రంలోనే తన స్పీడ్ పవర్‌తో సత్తా చాటిన ఈ యువ ఫాస్ట్ బౌలర్.. రెండో మ్యాచ్‌లోనూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన పేస్ పదునుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లకు చెమటలు పట్టించిన మయాంక్.. లక్నోను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన స్పెల్(3/14)తో ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు ఈ యంగ్ స్పీడ్ గన్. First the catch and now an excellent direct-hit! 🎯#RCB lose both their openers courtesy of DDP 👏👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG | @devdpd07 pic.twitter.com/oXoYWi5PC8 — IndianPremierLeague (@IPL) April 2, 2024 తద్వారా వరుసగా రెండోసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ అందుకున్నాడు మయాంక్ యాదవ్. ఇక ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ సందర్భంగా ఈ రైటార్మ్ పేసర్ సంచలన డెలివరీతో మెరిశాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్ వేసిన మయాంక్.. రెండో బంతిని గంటకు 156.7 కిలో మీటర్ల వేగంతో సంధించాడు. 𝙎𝙃𝙀𝙀𝙍 𝙋𝘼𝘾𝙀! 🔥🔥 Mayank Yadav with an absolute ripper to dismiss Cameron Green 👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/sMDrfmlZim — IndianPremierLeague (@IPL) April 2, 2024 క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌లోనే అది ఫాస్టెస్ట్ డెలివరీ కావడం విశేషం. ఇక పదో ఓవర్ వేసిన మయాంక్ బౌలింగ్‌లో రెండో బాల్ స్పీడ్ కూడా 155.3KMPHగా నమోదైంది. ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన మయాంక్.. ఆ మ్యాచ్‌లో 155.8 KMPH వేగంతో బంతిని విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మూడుసార్లు 155 KMPH స్పీడ్‌తో బౌలింగ్ చేసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు మొత్తంగా 48 బంతులు మాత్రమే వేసి ఈ ఘనత సాధించడం విశేషం. ఇక కశ్మీర్ ఎక్స్‌ప్రెస్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే రెండుసార్లు గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశారు. ఇక ఓవరాల్‌గా ఐపీఎల్ ఫాస్టెస్ట్ డెలివరీల విషయానికి వస్తే.. మయాంక్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్-2011లో షాన్ టైట్ 157.7 KMPH వేగంతో బౌలింగ్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన టాప్-5 బౌలర్లు 1. షాన్ టైట్- 157.7 KMPH 2. లాకీ ఫెర్గూసన్- 157.3 KMPH 3. ఉమ్రాన్ మాలిక్- 157 KMPH 4. మయాంక్ యాదవ్- 156.7 KMPH 5. అన్రిచ్ నోర్జే- 156.2 KMPH. 4 overs, 14 runs, 3 wickets, 24 laser beams 🔥⚡pic.twitter.com/pw5NOSbdpM — Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నోర్జేకు చుక్కలు చూపించిన రియాన్ పరాగ్.. కాళరాత్రిలా మార్చేశాడు..!
ఓవరాక్షన్ స్టార్ అని పేరున్న రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్.. తనపై వేసిన ఆ ముద్ర తప్పని నిరూపించుకుంటున్నాడు. తరుచూ అతి చేష్టలతో వార్తల్లో నిలిచే పరాగ్.. గత కొంతకాలంగా ఓవరాక్షన్ తగ్గించుకుని ఆటపై దృష్టి పెడుతున్నాడు. ఈ క్రమంలో సక్సెస్ రుచి చూస్తున్నాడు. ఇటీవలికాలంలో అతని ప్రదర్శనలు అదిరిపోతున్నాయి. ఫార్మాట్ ఏదైనా రియాన్ చెలరేగిపోతున్నాడు. గతకొంతకాలంగా భీకర ఫామ్‌లో ఉన్న పరాగ్.. తన ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో 43 పరుగులతో అలరించిన పరాగ్.. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో 45 బంతులు ఎదుర్కొన్న అతను.. 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. Riyan Parag at one point 26(26) and he smashed 24*(8) and he completed his fifty in 34 balls. - RIYAN PARAG, THE STAR. ⭐ pic.twitter.com/X1uHZRpQ7F — CricketMAN2 (@ImTanujSingh) March 28, 2024 పరాగ్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో రాజస్థాన్ ఢిల్లీని మట్టికరిపించింది. మ్యాచ్ మొత్తానికి రియాన్ మెరుపు ఇన్నింగ్సే హైలైట్‌గా నిలిచింది. మరి ముఖ్యంగా రియాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నోర్జే చుక్కలు చూపించిన తీరు విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. ఈ ఓవర్లో రియాన్ వరుసగా 4, 4, 6, 4, 6, 1 పరుగులు చేసి 25 పరుగులు పిండుకున్నాడు. రియాన్ దెబ్బకు నోర్జేకు నిన్నటి రాత్రి కాళరాత్రిలా మారింది. RIYAN PARAG SMASHED 25 RUNS IN THE FINAL OVER AGAINST NORTJE. 🔥🤯 - The Madman of Rajasthan Royals.pic.twitter.com/5bg7riHxY2 — Johns. (@CricCrazyJohns) March 28, 2024 నోర్జేను బహుశా ఏ బ్యాటర్ రియాన్లా చితబాది ఉండడు. రియాన్ ధాటికి నోర్జే 4 ఓవర్లలో ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. రియాన్ నోర్జేకు చుక్కలు చూపిస్తున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. He was trolled badly in previous seasons for having self confidence and today he converted his words into action, Riyan Parag is here to rule. Missed his dance though @ParagRiyan ❤️pic.twitter.com/higJiikEQ7 — Yashvi (@BreatheKohli) March 28, 2024 ఒకనాడు ఓవరాక్షన్ స్టార్ అన్న నోళ్లే ఇప్పుడు రియాన్‌ను పొగుడుతున్నాయి. రాజస్థాన్ అభిమానులు రియాన్‌కు జేజేలు పలుకుతున్నారు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో రియాన్ ఓవర్‌నైట్ హీరో అయిపోయాడు. రాయల్స్ మున్ముందు పరాగ్ నుంచి ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తుంది. కాగా, డీసీతో మ్యాచ్‌లో రియాన్ రెచ్చిపోవడంతో రాయల్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఢిల్లీ 173 పరుగులకే పరిమితై సీజన్లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో రియాన్‌తో పాటు అశ్విన్ (29; 3 సిక్సర్లు), జురెల్ (20; 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ఢిల్లీ విషయానికొస్తే.. నామమాత్రపు ఛేదనలో డేవిడ్ వార్నర్ (49) పర్వాలేదనిపించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లు బర్గర్ (3-0-29-2), చహల్ (3-0-19-2), ఆవేశ్ ఖాన్ (4-0-29-1) రాణించారు. -
సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన క్రికెట్ సౌతాఫ్రికా
2024-25 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ ప్రకటించింది. ఈ జాబితాలో స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే పేరు కనిపించలేదు. గతేడాది కాలంలో నోర్జే జాతీయ జట్టుకు అడపాదడపా ప్రాతినిథ్యం వహించడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. సౌతాఫ్రికా గతేడాదికాలంలో అన్ని ఫార్మాట్లలో కలిపి 37 మ్యాచ్‌లు ఆడగా.. నోర్జే కేవలం తొమ్మిది మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. సీఎస్ఏ సెంట్రల్ కాంట్రాక్ లిస్ట్‌లో నోర్జే పేరుతో పాటు సిసండ మగాల, వేన్ పార్నెల్, కీగన్ పీటర్సన్ పేర్లు కూడా కనిపించలేదు. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన టెస్ట్ కెప్టెన్ డీన్ ఎల్గర్, టీ20లకు మాత్రమే పరిమతమైన క్వింటన్ డికాక్ పేర్లను సైతం సీఎస్ఏ అధికారులు తొలగించారు. కొత్తగా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆశించిన కైల్ వెర్రిన్, డేవిడ్ బెడింగ్హమ్లకు మొండిచెయ్యి ఎదురైంది. పేస్ బౌలర్ నండ్రే బర్గర్, ఓపెనింగ్ బ్యాటర్ టోనీ డి జోర్జీ కొత్తగా కాంట్రాక్ట్ దక్కించుకోగా.. అండీల్ ఫెహ్లుక్వాయో ఏడాది గ్యాప్ తర్వాత తిరిగి కాంట్రాక్ట్‌ను పొందాడు. గతేడాది మొత్తం 20 మంది సెంట్రల్ కాంట్రాక్ట్ పొందగా.. ఈ ఏడాది ఆ సంఖ్యను 18కే కుదించారు. మహిళల విషయానికొస్తే.. సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ప్లేయర్స్ సంఖ్య 15 నుంచి 16కు పెరిగింది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన షబ్నిమ్ ఇస్మాయిల్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోగా.. కొత్తగా అయండ హ్లుబి, ఎలిజ్-మారి మార్క్స్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. 2024-25 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన సౌతాఫ్రికా పురుష క్రికెటర్లు.. టెంబా బవుమా, నండ్రే బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ, టోనీ డి జోర్జి, జోర్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ఆండీల్ ఫెహ్లుక్వాయో, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంషి, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన మహిళా క్రికెటర్లు.. అన్నేకే బోష్, తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, లారా గుడాల్, అయాండా హ్లూబి, సినాలో జాఫ్తా, మారిజన్ కప్, అయాబొంగా ఖాకా, మసాబాటా క్లాస్, సున్ లూస్, ఎలిజ్-మారీ మార్క్స్, నోంకులులేకో మ్లాబా, తుమీ సెఖుఖునే, క్లో ట్రైయాన్, డెల్మి టక్కర్, లారా వోల్వార్డ్ట్ -
IPL 2024: రాజస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త
జైపూర్ వేదికగా ఈనెల 28న రాజస్థాన్ రాయల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త అందింది. గాయం కారణంగా సీజన్ తొలి మ్యాచ్‌కు (పంజాబ్) దూరమైన ఆ జట్టు స్టార్ పేసర్ ఎన్రిచ్ నోర్జే జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని డీసీ యాజమాన్యం ట్విటర్ వేదికగా వెల్లడించింది. నోర్జేకు స్వాగతం ఓ వీడియోను కూడా షేర్ చేసింది. Everything moved a little 𝘕𝘖𝘙𝘛𝘑𝘌 today 😉🤯 Welcome 🔙, 𝟏𝟓𝟔.𝟐 𝐤𝐩𝐡 🔥#YehHaiNayiDilli pic.twitter.com/me5uirhY30 — Delhi Capitals (@DelhiCapitals) March 25, 2024 ఇదిలా ఉంటే, ఈ నెల 23న పంజాబ్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 174 పరుగులు చేసి దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అభిషేక్ పోరెల్ (32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అభిషేక్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గగా రాణించలేకపోయారు. వార్నర్ (29), మార్ష్ (20), షాయ్ హోప్ (33), అక్షర్‌లకు (21) శుభారంభాలు అందినప్పటికీ వారు వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ (4-0-20-2), అక్షర్ పటేల్ (4-0-25-0), ఇషాంత్ శర్మ (2-0-16-1) పర్వాలేదనిపించగా.. ఖలీల్ అహ్మద్ (4-0-43-2), మిచెల్ మార్ష్ (4-0-52-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. -
అయ్యో దక్షిణాఫ్రికా.. ఊహించిందే జరిగింది! ఇక కష్టమే మరి
వన్డే ప్రపంచకప్-2023కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బతగిలింది. అంతా ఊహించినట్టుగానే ఆ జట్టు స్టార్ పేసర్లు అన్రిచ్ నోర్జే, సిసిందా మగాల గాయాల కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యారు. వరల్డ్‌కప్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల ప్రోటీస్ జట్టులో వీరిద్దరూ భాగంగా ఉన్నారు. ఇక వీరిద్దరి స్ధానాలను ఫాస్ట్ బౌలర్లు ఆండిలే ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్‌లతో దక్షిణాఫ్రికా క్రికెట్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా వైట్-బాల్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ధృవీకరించాడు. కాగా నోర్జే వెన్నుగాయంతో బాధపడుతుండగా.. మగాల మోకాలి గాయంతో తప్పుకున్నాడు.అన్రిచ్, సిసిందా ఇద్దరూ వరల్డ్‌కప్‌కు దూరం కావడం మాకు పెద్ద ఎదురుదెబ్బ. ఇది మమ్నల్ని చాలా నిరాశపరిచింది. వారిద్దరూ మా జట్టుకు చాలా విలువైన బౌలర్లు. వారు రీ ఎంట్రీ ఇవ్వడానికి మా సపోర్ట్ ఎల్లప్పడూ ఉంటుంది. వీరి స్ధానంలో ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్‌లకు అవకాశం ఇచ్చాం. వీరిద్దరూ కూడా ఆస్ట్రేలియాతో జరిగిన వైట్ బాల్ సిరీస్‌లలో ప్రోటీస్‌కు ప్రాతినిథ్యం వహించారు. వారు తమ టాలెంట్‌ను చూపించడానికి ఇదొక మంచి అవకాశమని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రాబ్ వాల్టర్ పేర్కొన్నాడు. ఇక వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 7న ఢిల్లీ వేదికగా శ్రీలంకతో తలపడనుంది. చదవండి: ODI World Cup: పిచ్ క్యూరేటర్లకు ఐసీసీ కీలక ఆదేశాలు..
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019