breaking news
-
బ్రిల్లార్ క్లినిక్ మొదటి వార్షికోత్సవంలో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
మమ్మీ తిరిగొస్తోంది
హాలీవుడ్ హారర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ది మమ్మీ’ రీ రిలీజ్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. స్టీఫెన్ సోమర్స్ దర్శకత్వంలో 1999లో విడుదలైన ‘ది మమ్మీ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ యాక్షన్ అడ్వెంచరస్ హారర్ ఫిల్మ్‌లో బ్రెండెన్ ఫ్రేజర్, రాచెల్ వీజ్, జాన్ హాన్యా, ఆర్నాల్డ్ వోస్లూ, జోనాథన్ హైడ్ లీడ్ రోల్స్‌లో నటించారు. జేమ్స్ జాక్స్, సీన్ డేనియల్ నిర్మించిన ‘ది మమ్మీ’ సినిమాను 1999 మే 7న యూనివర్సల్ పిక్చర్స్ పంపిణీ చేసింది. ఈ సినిమా విడుదలై పాతిక సంవత్సరాలు సమీపిస్తున్న సందర్భంగా ఏప్రిల్ 26న థియేటర్స్‌లో రీ రిలీజ్ చేస్తున్నట్లుగా యూనివర్సల్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. -
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు (2024 మార్చి 3వ తేదీ) 5 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్య వై. రెడ్డి శ్యామల, పీఠాధిపతి, భాషాభివృద్ధి పీఠం, డైరెక్టర్ ఐ/సి, అంతర్జాతీయ తెలుగు కేంద్రం, పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం గారు విచ్చేసి తెలుగు భాష మన దైనందిన జీవితానికి ఎంతో ముఖ్య మైనది అని వివరించారు అన్నమయ్య పద మాధుర్యం గురించి మాట్లాడుతూ శేషుకుమారి గానం, ప్రత్యూష నాట్యం మేళ వింపుతో ప్రేక్షకులను మైమరపింప చేశారు. ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీ శ్వర్, TAS (మనం తెలుగు) అసోసియేషన్ అనిత రెడ్డి శ్రీ సాంస్కృతిక కళా సారథి రత్న కుమార్ కమల క్లబ్ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు మగువ మనసు అడ్మిన్ ఉష, సింగపూర్ తెలుగు వనితలు క్రాంతి, జయ, ప్రత్యూష తదితర సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరు కావటం విశేషం. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి, శిష్యులుచిన్నారులు కీర్తనలు, స్వరలయ ఆర్ట్స్, సింగపూర్‌కు అనుబంధ సంస్థ అభినయ నాట్యాలయ చిన్నారులు ,ప్రత్యూష శిష్య బృందం నాట్యం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు ఆచార్య వై. రెడ్డి శ్యామల బహుమతి ప్రదానం చేశారు. అతిథులకుయడవల్లి శేషుకుమారి ఆచార్య వై. రెడ్డి శ్యామల మూమెంటోలను బహుకరించారు. మృదంగ వాయిద్య సహకారాన్ని శివ కుమార్ అందించారు. ఈ కార్యక్రమానికి సౌజన్య, ప్రసన్న వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. పలువురికీ లలిత కళా రంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 150 మంది హాజరు కావటమే కాకుండా.. సాంఘిక మాధ్యమాలాద్వారా కూడా వీక్షించి విశేషస్పందన తెలియజేయటం అభినందనీయం. -
నటి నుంచి సీఎం వరకూ.. ‘అమ్మ’ జీవితం సాగిందిలా!
పలువురు మహిళలు దేశ రాజకీయాల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. చరిత్రను పరిశీలిస్తే.. సరోజినీ నాయుడు, ఇందిరా గాంధీ, సుచేతా కృపలానీ, సుష్మా స్వరాజ్, ప్రతిభా పాటిల్, మమతా బెనర్జీ, మాయావతి, ప్రియాంక గాంధీ సహా ఎందరో మహిళల పేర్లు దేశ ప్రజల నోళ్లలో మెదులుతాయి. దేశ రాజకీయాల్లో సత్తా చాటుతున్న నటీమణుల విషయానికొస్తే స్మృతి ఇరానీ, నుస్రత్ జహాన్, జయప్రద హేమమాలిని తదితరుల పేర్లు వినవస్తాయి. అయితే అమోఘమైన ప్రజాదరణ పొందిన మహిళా నేతల జాబితాను పరిశీలిస్తే ఒక నాటి నటీమణి, ఆ తరువాత తమిళనాట సీఎంగా సత్తా చాటిన జయలలిత తప్పుకుండా గుర్తుకువస్తారు. తమిళనాడు ప్రజలు జయలలితను ‘అమ్మా’ అని పిలిచేంతటి ఆదరణ ఆమె సొంతం చేసుకున్నారు. ఈరోజు(ఫిబ్రవరి 24) దివంగత సీఎం జయలలిత జన్మదినం. 1948 ఫిబ్రవరి 24న జన్మించిన జయలలిత జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ నేపధ్యం జయలలిత.. ప్రస్తుతం కర్ణాటకలో భాగంగా ఉన్న మైసూర్‌లోని మాండ్య జిల్లాలోని పాండవపురా తాలూకాలోని మేలుర్కోట్ గ్రామంలో అయ్యర్ కుటుంబంలో జన్మించారు. జయలలిత అసలు పేరు ‘కోమలవల్లి’. ఆమె తండ్రి పేరు జయరామ్. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె తల్లి పేరు వేదవల్లి. జయలలిత తల్లి వేదవల్లి ప్రముఖ నటిగా పేరు సంపాదించారు. బాల్యంలో జయలలితకు సినిమాలపై అంతగా ఆసక్తి లేదు. ఆమె ఎప్పుడూ నటి కావాలని కోరుకోలేదు. బలవంతంగా ఆమె సినీ రంగంలోకి వచ్చారని చెబుతుంటారు. సినీ జీవితం చదువులో జయలలిత ఎంతో ప్రతిభ కనబరిచారు. జయలలిత తండ్రి ఆమెను లాయర్‌గా చూడాలనుకున్నారు. అయితే ఆమె తల్లి.. జయలలితను చిన్నతనంలోనే సినీ రంగంలోకి తీసుకువచ్చారు. జయలలిత కేవలం తన 15 ఏళ్ల వయసులోనే అడల్ట్ సినిమాలో నటించారు. ఆమె సినీ జీవితం అక్కడి నుంచే మొదలైంది. ఆమె సినిమాల్లో తన అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. జయలలిత తన కెరీర్లో మొత్తం 85 సినిమాలు చేయగా, అందులో 80 సినిమాలు అమోఘ విజయం సాధించాయి. సినిమాల్లో స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించిన తొలి నటిగా ఆమె గుర్తింపు పొందారు. రాజకీయ ప్రయాణం నాటి రాజకీయ నేత ఎంజీ రామచంద్రన్ నటి జయలలితను సినిమాల నుంచి రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఎంజీఆర్, జయలలిత ప్రేమించుకున్నారని కానీ పెళ్లి చేసుకోలేదని, పైగా వారు తమ బంధాన్ని ఏనాడూ బహిరంగపరచలేదని చెబుతుంటారు. జయలలిత 1982లో ఎంజీ రామచంద్రన్‌తో పాటు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నా డీఎంకే)లో సభ్యురాలయ్యారు. నాటి నుంచే ఆమె రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1984 నుండి 1989 వరకు జయలలిత తమిళనాడు నుండి రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు. ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. సాధించిన విజయాలు తమిళనాడులో జయలలిత ప్రజాదరణ పొందిన నటిగా మాత్రమే కాకుండా మహిళా నేతగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. ఆరు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి కావడం ఆమె రాజకీయాల్లో సాధించిన అమోఘ విజయంగా చెబుతుంటారు. భ్రూణహత్యల నివారణకు ఆమె ‘క్రెడిల్ టు బేబీ స్కీమ్’ను ప్రారంభించారు. ‘అమ్మ’ బ్రాండ్ ప్రారంభించి, ఈ పేరుతో దాదాపు 18 ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశారు. అమ్మ పేరుతో అమలయిన ఈ పథకాలు పూర్తిగా ఉచితం. లేదా భారీగా రాయితీలు అందించేవి. పట్టణ పేదలకు ఒక్క రూపాయికే ఆహారం అందించేందుకు ఆమె ‘అమ్మ క్యాంటీన్’ను ప్రారంభించారు. జయలలిత తన 68వ ఏట 2016 డిసెంబర్ 5న కన్నుమూశారు. -
మహాత్ముని వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు?
బ్రిటీష్‌వారి బానిసత్వం నుండి దేశానికి విముక్తి కల్పించడంలో మహాత్మా గాంధీ ఎనలేని కృషి చేశారు. భారతదేశ స్వాతంత్ర్యం, అభివృద్ధి, శ్రేయస్సు కోసం మహాత్ముడు తన జీవితాన్ని త్యాగం చేశారు. 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపాడు. గాంధీజీ త్యాగాన్ని స్మరించుకునేందుకు ప్రతీ ఏటా జనవరి 30న అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. గాంధీ వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక జీవితం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి శాంతి, అహింస, సామరస్య మార్గాన్ని చూపింది. అది.. 1948, జనవరి 30నాటి సాయంత్రం వేళ.. మహాత్మా గాంధీ ఢిల్లీలోని బిర్లా భవన్లో జరిగే ప్రార్థనా సమావేశంలో ప్రసంగించబోతున్నారు. సరిగ్గా అదే సమయంలో సాయంత్రం 5:17 గంటల ప్రాంతంలో నాథూరామ్ గాడ్సే .. మహాత్మాగాంధీపై కాల్పులు జరిపాడు. గాంధీజీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బాపూజీ మరణానంతరం, ఆయన వర్ధంతి (జనవరి 30)ని ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అమరవీరుల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి కూడా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటుంది. జనవరి 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, త్రివిధ దళాల ఆర్మీ చీఫ్‌లు రాజ్‌ఘాట్‌లోని మహాత్ముని సమాధి వద్ద ఆయనకు నివాళులు అర్పిస్తారు. అలాగే అమరవీరులందరినీ స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలలో మహాత్మా గాంధీని గుర్తుచేసుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈరోజు మహాత్ముడు మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, గురుతులు మనందరి మదిలో సజీవంగా నిలిచి ఉన్నాయి. గాంధీజీ చెప్పిన పరిశుభ్రత మంత్రం నేడు ప్రతి ఒక్కరికీ చేరింది. బాపూజీ త్యాగాన్ని భారతదేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019