breaking news
-
అద్భుతమైన సిక్సర్లు.. తండ్రిని గుర్తు చేసిన రాకీ ఫ్లింటాఫ్
ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ చిన్న కొడుకు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటున్నాడు. రాకీ.. తండ్రి తరహాలోనే భారీ సిక్సర్లు కొడుతూ శభాష్ అనిపించుకుంటున్నాడు. లాంకాషైర్ రెండో జట్టుకు ఆడుతూ డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాకీ కొట్టిన సిక్సర్లు తండ్రి ఆండ్రూను గుర్తు చేశాయి. రాకీ కొట్టిన సిక్సర్లకు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది. రాకీ సిక్సర్లు కొట్టిన విధానం తండ్రిని పోలి ఉందని నెటిజన్లు కితాబునిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో రాకీ మూడు సిక్సర్లు బాదగా.. అందులోని ఓ సిక్సర్ ఆండ్రూ ట్రేడ్ మార్క్ సిక్సర్‌కు (పుల్‌షాట్) మక్కీ టు మక్కీగా ఉందని అభిమానులు అనుకుంటున్నారు. రాకీ మెరుపు షాట్లు ఆడుతూ తండ్రి బాటలోనే నడుస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. Rocky Flintoff with 3️⃣ sixes on his way to an unbeaten half-century for the 2nd XI! 💥👏 Our 2nd XI clash with Durham ends in a draw as the rain interrupts once again. Scorecard 📋➡ https://t.co/WieghotbNI 🌹 #RedRoseTogether pic.twitter.com/Rrc2SWUB9t — Lancashire Cricket (@lancscricket) April 18, 2024 డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో తండ్రి తరహాలోనే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాకీ రెండు బౌండరీలు, మూడు సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో వర్షం మొదలుకావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ సమయానికి లాంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్ పెద్ద కొడుకు కోరె ఫ్లింటాఫ్ కూడా లాంకాషైర్కే ఆడటం మరో విశేషం. ఆండ్రూ అలియాస్ ఫ్రెడ్డీ ఇద్దరు కొడుకులు క్రికెట్లో రాణిస్తుండటంతో ఇంగ్లండ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెడ్డీ 20వ శతాబ్దం చివరి నుంచి దాదాపు పదేళ్ల పాటు ఇంగ్లండ్ క్రికెట్‌కు మకుటం లేని మహారాజుగా వెలిగిన విషయం తెలిసిందే. 2005 యాషెస్ సిరీస్‌లో ఫ్రెడ్డీ ఆల్‌రౌండర్‌గా విశేషంగా రాణించాడు. 2009లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం ప్రొఫెషనల్ బాక్సర్‌గా, ఫ్యాషన్ ప్రమోటర్‌గా, కార్ రేసర్‌గా, టీవీ ప్రజెంటర్‌గా పలు రంగాల్లో కాలు మోపిన ఫ్రెడ్డీ ప్రతి రంగంపై తనదైన ముద్ర వేశాడు. 2022లో కారు ప్రమాదానికి గురైన ఫ్రెడ్డీ.. ఇటీవలే క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. 46 ఏళ్ల ఫ్రెడ్డీ ఇంగ్లండ్ వన్డే జట్టుకు జీతం లేకుండా కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో ఫ్రెడ్డీ హండ్రెడ్ లీగ్‌లోని నార్త్రన్ సూపర్ చార్జర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత హండ్రెడ్ ఎడిషన్‌లో ఫ్రెడ్డీ సూపర్ చార్జర్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. -
క్రికెటర్ల ప్రాణం మీదకు తెచ్చిన రోడ్డు ప్రమాదాలు
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం క్రికెట్ అభిమానులను కలవరపాటుకు గురి చేసింది. అదృష్టవశాత్తూ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న పంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అయితే వేగంతో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో పంత్‌కు గాయాలు తీవ్రంగానే అయ్యాయి. ఈ గాయాల ప్రభావం భవిష్యత్తులో అతని ఆటపై ప్రభావం చూపకూడదని దేవుడిని కోరుకుందాం. అయితే ఈ ఏడాది క్రికెటర్లకు కలిసి రాలేదనే చెప్పాలి. ఒక్క ఏడాదిలోనే నలుగురు క్రికెటర్లు సహా ఒక అంపైర్ రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. దురదృష్టవశాత్తూ ఒక క్రికెటర్, అంపైర్ తమ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. వారిద్దరే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్, అంపైర్ రూడీ కోర్ట్జెన్. రిషబ్ పంత్: డిసెంబర్ 30(శుక్రవారం తెల్లవారుజామున) ఢిల్లీ నుంచి తన ఎస్యూవీ కారును పంత్ స్వయంగా నడుపుకుంటూ వచ్చాడు. మంచి వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు 200 మీటర్ల దూరం దూసుకెళ్లింది. ఈలోగా కారులో మంటలు చెలరేగాయి. అయితే ఇది గమనించిన బస్ డ్రైవర్ పంత్‌ను కారులో నుంచి బయటకు లాగి అతన్ని రక్షించాడు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్ నుదుటి రెండు కాట్లు పడ్డాయి. అదే సమయంలో కుడి మోకాలి లిగ్మెంట్ పక్కకు జరగడంతో సర్జరీ అవసరం కానుంది. ఇంకా చాలా గాయాలు అయ్యాయి. పంత్ కోలుకోవడానికి కనీసం మూడు నెలలు పట్టేలా ఉంది. ఆండ్రూ ఫ్లింటాఫ్: ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఇదే నెలలో డిసెంబర్ 14న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బీబీసీలో ప్రసారమయ్యే "టాప్ గేర్" ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సర్రేలోని డన్స్‌ఫోల్డ్ పార్క్ ప్రాంతంలో మంచుతో నిండిన పరిస్థితులలో షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫ్లింటాఫ్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అతడిని పరిశీలించిన వైద్యులు ఎటువంటి ప్రాణాప్రాయం లేదని తెలిపారు. దీంతో అతడి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆండ్రూ సైమండ్స్: క్రికెట్ ఆస్ట్రేలియాకు ఈ ఏడాది పెద్ద విషాదం అని చెప్పొచ్చు. ఈ ఏడాది ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు కన్నుమూశారు. ఒకరు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అయితే.. మరొకరు ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్. కారు ప్రమాదం ఆండ్రూ సైమండ్స్ ప్రాణాలను బలిగొంది. మే 14న టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో కారును స్వయంగా తానే నడుపుతున్నాడు. అయితే కారు అదుపు తప్పి రివర్ బ్రిడ్జీ సమీపంలో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో సైమండ్స్ అక్కడికక్కడే మృతి చెందడం అందరిని కలిచివేసింది. బరోడా వుమెన్స్ జట్టు: అక్టోబర్ 21 బరోడా వుమెన్స్ జట్టుతో వెళ్తున్న బస్సు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వెళ్లే దారిలో ప్రమాదానికి గురైంది. తాటి చెట్లపాలెం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రక్కును బస్సు వేగంగా గుద్దుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు బరోడా మహిళా క్రికెటర్లకు తీవ్ర గాయాలు కాగా..మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రూడీ కోర్ట్జెన్: ఇదే ఏడాది ఆగస్టు 9న సౌతాఫ్రికాకు చెందిన మాజీ అంపైర్ రూడి కోర్ట్జెన్(73) కన్నుమూశాడు.సౌతాఫ్రికాలోని రివర్‌డేల్‌లో ఉన్న గోల్ఫ్ కోర్స్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆయన కారు యాక్సిడెంట్‌కు గురయ్యింది. ఈ ప్రమాదంలో కోర్ట్జెన్‌తో పాటు మరో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్, స్టీవ్ బక్నర్ తర్వాత అత్యధిక టెస్టులకు అంపైర్ గా చేసిన ఘనత సాధించాడు.బ్యాటర్ క్యాచ్ ఔట్, స్టంప్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్ అయినప్పుడు ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చే విధానం కూడా హైలైట్ గా ఉండేది. మెల్లిగా చేతిని పైకెత్తుతూ ఆయన ఔట్ ఇచ్చే విధానానికి కల్ట్ ఫ్యాన్స్ ఉండడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ లో దీనిని ‘ది స్లో ఫింగర్ ఆఫ్ డెత్’గా అభివర్ణించేవారు. చదవండి: పీలే టాప్-10 స్టన్నింగ్ గోల్స్‌పై లుక్కేయాల్సిందే మూడేళ్ల క్రితమే పంత్‌ను హెచ్చరించిన ధావన్ -
కారు ప్రమాదంలో ఆండ్రూ ఫ్లింటాఫ్‌కు తీవ్ర గాయాలు..
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బీబీసీలో ప్రసారమయ్యే "టాప్ గేర్" ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సర్రేలోని డన్స్‌ఫోల్డ్ పార్క్ ప్రాంతంలో మంచుతో నిండిన పరిస్థితులలో షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫ్లింటాఫ్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అతడిని పరిశీలించిన వైద్యులు ఎటువంటి ప్రాణాప్రాయం లేదని తెలిపారు. దీంతో అతడి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అదే విధంగా ఈ ప్రమాదంపై బీబీసీ కూడా స్పందించింది. సోమవారం ఉదయం టాప్ గేర్ టెస్ట్ ట్రాక్ వద్ద జరిగిన ప్రమాదంలో ఫ్రెడ్డీ (ఫ్లింటాఫ్) గాయపడ్డాడు. వెంటనే మెడికల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అతడికి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాం. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తాం అని బీబీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ఫ్లింటాఫ్ ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 7315 పరుగులతో పాటు 400 పైగా వికెట్లు సాధించాడు. చదవండి: FIFA WC 2022 Final: ఫైనల్ చేరాం చాలు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు! అంబరాన్నింటిన సంబరాలు -
ఈ ముగ్గురితో పాటు మరో ముగ్గురి బర్త్‌డే కూడా ఈరోజే.. ఈ విశేషాలు తెలుసా?
December 6- Top 6 Cricketers Birthday: టీమిండియా స్టార్స్ రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్.. ఈ ముగ్గురూ ఒకేరోజు జన్మించారు తెలుసా! వీళ్ల ముగ్గురి బర్త్‌డే డిసెంబరు 6నే! భారత ఆల్‌రౌండర్ జడ్డూ 1988లో జన్మించగా... స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 1993లో, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 1994లో జన్మించారు. ఇక వీరితో పాటు మరో ముగ్గురు క్రికెటర్లు కూడా ఇదే రోజు పుట్టినరోజు జరుపుకొంటున్నారు. భారత మాజీ లెఫ్టార్మ్ మీడియం పేసర్ రుద్రప్రతాప్ సింగ్, కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కూడా డిసెంబరు 6నే పుట్టారు. వీళ్లందరికీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరుగురి గురించి కొన్ని ఆసక్తికర అంశాలు 1.జస్ప్రీత్ బుమ్రా- గుజరాత్ ►అహ్మదాబాద్‌లో జననం ►ప్రస్తుత టీమిండియా ప్రధాన పేసర్. ►ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం. ►టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ముగ్గురు భారత బౌలర్ల జాబితాలో చోటు ►కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 162 అంతర్జాతీయ మ్యాచ్‌లు ►పడగొట్టిన వికెట్లు: 319. 2. రవీంద్ర జడేజా- గుజరాత్ ►నవగామ్‌లో జననం ►స్పిన్ ఆల్‌రౌండర్ ►టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ ప్రఖ్యాతి ►ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం ►ఇప్పటి వరకు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో పరుగులు: 5427 ►పడగొట్టిన వికెట్లు: 482 ►ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు. శ్రేయస్ అయ్యర్- మహారాష్ట్ర ►ముంబైలో జననం ►ఐపీఎల్లో ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ►ఇప్పటి వరకు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లు టెస్టులు 5, వన్డేలు 37, టీ20లు 49. ►పరిమిత ఓవర్ల క్రికెట్లో స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు ఆర్పీ సింగ్- ఉత్తరప్రదేశ్ ►1985లో రాయ్ బరేలీలో జననం ►లెఫ్టార్మ్ మీడియం పేసర్ ►అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు ఆడిన ఆర్పీ సింగ్ ►అంతర్జాతీయ కెరీర్లో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ►2018లో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతూ రిటైర్మెంట్ ప్రకటన కరుణ్ నాయర్ ►1991లో జననం ►దేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాటర్ ►టీమిండియా తరఫున ఇప్పటి వరకు 6 టెస్టులు, 2 వన్డేలు ఆడిన కరుణ్ నాయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ►లంకషైర్లో 1977లో జననం ►1998లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం ►ఇంగ్లండ్ కెప్టెన్‌గా పనిచేసిన ఆల్‌రౌండర్ ►ఫాస్ట్ బౌలర్, మిడిలార్డర్ బ్యాటర్‌గా సేవలు ►2010లో ఆటకు వీడ్కోలు.. ప్రస్తుతం కామెంటేటర్‌గా ఉన్న ఫ్లింటాఫ్. చదవండి: Ind Vs Ban: చెత్త బ్యాటింగ్.. రోహిత్ ఇకనైనా మారు! అతడిని అన్ని మ్యాచ్‌లలో ఆడించాలి: మాజీ క్రికెటర్ Ivana Knoll FIFA WC: జపాన్ను అవమానించిన క్రొయేషియా సుందరి -
ఆ ఇంగ్లీష్ బౌలర్ పీక కోస్తానన్నాడు.. అందుకే అలా చేశా
న్యూఢిల్లీ: 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తన పీక కోస్తానని వార్నింగ్ ఇచ్చాడని సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాటి ఇంగ్లండ్ కెప్టెన్ ఫ్లింటాఫ్ తనను రెచ్చగొట్టడం వల్లే స్టువర్డ్ బ్రాడ్‌పై ఎదురుదాడికి దిగానని, ఈ క్రమంలోనే 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పానని ఆయన గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ 17వ ఓవర్లో ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో తాను వరుసగా రెండు ఫోర్లు కొట్టానని, దీంతో అసహనానికి గురైన ఫ్లింటాఫ్ తనపై నోరుపారేసుకున్నాడని పేర్కొన్నాడు. రెండు చెత్త షాట్లు ఆడి సంబర పడొద్దని, తనను గేలి చేశాడని తెలిపాడు. దీనికి తాను కూడా అదే రితీలో స్పందించడంతో మాటామాటా పెరిగి కొట్టుకునే పరిస్థితి వరకు వెళ్లిందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఫ్లింటాఫ్.. ‘నీ గొంతు కొస్తా' అని నన్ను హెచ్చరించగా, నేను కూడా బ్యాట్‌తో తలపై బాదుతానని బదులిచ్చానన్నాడు. అయితే ఫ్లింటాఫ్‌పై కోపానికి ఆ మరుసటి ఓవర్ బౌల్ చేసిన స్టువర్ట్ బ్రాడ్ బలయ్యాడని యువీ తెలిపాడు. బ్రాడ్ వేసిన ఆ ఓవర్లో అంతకుముందెన్నడూ ఆడని షాట్లను ఆడానని, యార్కర్ బంతులను సైతం స్టాండ్స్‌లోకి పంపానని అలనాటి మధుర క్షణాలను స్మరించుకున్నాడు. ఆఖరి బంతిని సిక్సర్ బాదాక ఫ్లింటాప్ వైపు చూసి ఓ చిరునవ్వు నవ్వానని యువీ చెప్పుకొచ్చాడు. యువీ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌పై 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రముఖ స్కోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ నాటి అద్భుత క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు. చదవండి: కెప్టెన్సీ నాకే ఇస్తారనుకున్నా.. కానీ మధ్యలో అతనొచ్చాడు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019