breaking news
-
సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ కాంతారతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ సప్తమిగౌడ. ఈ సినిమాలో ఫారెస్ట్ కానిస్టేబుల్ పాత్రలో అభిమానులను మెప్పించింది. ఆ తర్వాత కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు దక్కిచుకుంది. ఇటీవల శాండల్‌వుడ్‌లో యువ చిత్రంలో హీరోయిన్గా నటించింది. యువ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ద్వారా శివరాజ్‌కుమార్ అన్నయ్య కుమారుడు యువరాజ్‌కుమార్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఈ మూవీ ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. కేవలం ఇరవై రోజుల వ్యవధిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం రెంటల్ విధానంలో మాత్రమే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లో ఉచితంగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. సంతోష్ ఆనంద్రామ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రంలో యువరాజ్‌కుమార్ రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించాడు. మరోవైరు ఈ ఏడాదిలోనే సప్తమి గౌడ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిస్తోన్న తమ్ముడు మూవీలో సప్తమి గౌడ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. -
ఓటీటీకి సరికొత్త మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వైభవ్, నందితాశ్వేత జంటగా నటించిన చిత్రం రణం. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో రణం అరమ్ థవరేల్ పేరుతో ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆద్యంతం ట్విస్టులతో ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాదు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.15 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఓ సిరియల్ కిల్లర్ చేసిన హత్యలను చేధించే కథాంశంతో ఈ సినిమాను దర్శకుడు షరీఫ్ తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్కు రాబోతోంది. ఈ నెల 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఓవర్సీస్ ఆడియన్స్ కోసం టెంట్కోట్టాలోనూ స్ట్రీమింగ్కు రానుంది. దాదాపు థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ చిత్రంలో ఓ స్కెచ్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. ఈ సినిమాలో నందితా శ్వేత నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మరో హీరోయిన్ తాన్యా హోప్ ఇన్స్పెక్టర్ పాత్రలో కనిపించింది. వీళ్లంతా కలిసి సీరియల్ కిల్లర్‌ను పట్టుకున్నారా? లేదా అన్నదే కథ. థియేటర్లలో చూడలేనివారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. Vaibhav’s #Ranam will be streaming from Apr 19 on AMAZON PRIME. pic.twitter.com/cHXxx2331L — Christopher Kanagaraj (@Chrissuccess) April 17, 2024 -
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన రూ.1500 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపే చూస్తున్నారు. ఎంచక్కా ఇంట్లోనే ఉంటూ కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేస్తున్నారు. దీంతో ఓటీటీ ప్రేక్షకుల కోసం ఎప్పటికప్పుడు సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ డ్యూన్ పార్ట్- 2 ఓటీటీలోకి వచ్చేసింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం రెంటల్ విధానంలోనే మాత్రం అందుబాటులో ఉంది. ప్రస్తుతం రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్‌తో పాటు బుక్‌మై షో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు రూ.1500 కోట్ల బడ్డెజ్తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.4500 కోట్ల వసూళ్లు సాధించింది. 2024లో హాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్‌లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా.. లెజెండరీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ బ్యానర్లపై డెనీస్ విల్లెన్యువే దర్శకత్వంలో రూపొందించారు. ఫ్రాంక్ హెర్బర్ట్ రచించిన డ్యూన్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో తిమోతీ ఛాలామెట్, జెండ్యా, రెబాకా ఫెర్గూసన్, జోష్ బ్రోలిన్, ఆస్టిన్ బట్లర్ కీలక పాత్రలు నటించారు. 2021లో విడుదలైన అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా డ్యూన్‌కు సీక్వెల్‌గా పార్ట్- 2 తీసుకొచ్చారు. మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. -
ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!
ఓటీటీల్లో బోర్ కొట్టని జానర్ అంటే థ్రిల్లరే. మిగతా సినిమాల సంగతేమో గానీ థ్రిల్లర్స్ ని థియేటర్లలో కంటే సింగిల్ గా ఇంట్లోనే చూడటం బెస్ట్ అని చెప్పొచ్చు. అలా హాలీవుడ్ లో 2014లోనే వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మూవీ 'ప్రీ డెస్టినేషన్'. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా నిజంగా అంత బాగుందా? ఏంటనేది డీటైల్డ్ గా చూద్దాం. (ఇదీ చదవండి: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ) 'ప్రీ డెస్టినేషన్' విషయానికొస్తే.. ఈ సినిమాలో బేబీ జేన్, జేన్, జాన్, బార్ కీప్, ఫిజిల్ బాంబర్ అని ఐదు పాత్రలు ఉంటాయి. 1945-1992 మధ్య కాలంలో స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. అసలు వీళ్ల ఐదుగురికి కనెక్షన్ ఏంటి? చివరకు ఏమైందనేదే అసలు కథ. కొన్ని సినిమాలు చూడటానికి చాలా సాధారణంగా ఉంటాయి. 40 నిమిషాలు అయ్యేవరకు 'ప్రీ డెస్టినేషన్' కూడా అలానే అనిపిస్తుంది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడా అని డౌట్ వస్తుంది. కానీ ఐదు పాత్రలకు సంబంధించిన డీటైల్స్ అన్ని ప్రేక్షకుల అర్థమైన దగ్గర నుంచి థ్రిల్ కలిగిస్తుంది. ఐదు పాత్రలు టైమ్ ట్రావెలింగ్ చేస్తుంటే.. చూస్తున్న మనకు సరికొత్త అనుభూతి, థ్రిల్ అనిపిస్తుంది. ఇక్కడ నిజంగా టైమ్ ట్రావెల్ అనేది సాధ్యమా కాదా అనేది పక్కనబెట్టి చూస్తే మాత్రం మూవీ నచ్చేస్తుంది. ఇంతకంటే ఒక్క విషయం ఎక్కువ చెప్పినా సరే మళ్లీ కథ లీక్ చేసి, మేమే మీకు స్పాయిలర్స్ ఇచ్చేసినట్లు అయిపోద్ది! (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య) 'ప్రీ డెస్టినేషన్' సినిమాని గ్రేటెస్ట్ అని చెప్పలేం కానీ డిఫరెంట్ మూవీస్ అంటే ఇష్టపడే మూవీ లవర్స్ కచ్చితంగా మిస్సవకుండా చూడాల్సిన మూవీ. 2014లోనే రిలీజైన ఈ చిత్రం హాలీవుడ్ ఆడియెన్స్ కి తెగ నచ్చేసింది. ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత గ్లోబల్ ఆడియెన్స్ కి మరింత చేరువైంది. ఇదే మూవీ కథని స్ఫూర్తిగా తీసుకుని తెలుగులో పలు సినిమాలు తీయడం విశేషం. అవేంటో చెబితే మళ్లీ స్టోరీ చెప్పిసినట్లు అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్.. ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత 'అత్తారింటికి దారేది' సినిమాలోని ఫేమస్ డైలాగ్ కచ్చితంగా గుర్తొస్తుంది. అదేంటనేది 'ప్రీ డెస్టినేషన్' చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. కేవలం 97 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాని అలా మొదలుపెడితే ఇలా ముగించేయొచ్చు. మరి ఇంకెందుకు లేటు త్వరగా చూసేయండి. (ఇదీ చదవండి: ఖరీదైన బంగ్లాలోకి హీరోయిన్ పూజాహెగ్డే.. రేట్ తెలిస్తే మైండ్ బ్లాకే!) -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 10 చిత్రాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. మరోవైపు రంజాన్ పండగ వచ్చేసింది. దీంతో ఈ హాలీడేస్‌లో సినీ ప్రియులకు పండగే. వేసవి సెలవులు కూడా కలిసి రావడంతో ఫ్యామిలీతో చిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ కావటం లేదు. ఈ వారంలో గీతాంజలి మళ్లీ వచ్చింది మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంతే కాకుండా ఒకటి, రెండు చిన్న చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రియులు ఓటీటీ వైపు చూస్తున్నారు. ఈ వీకెండ్లో సందడి చేసేందుకు హిట్ సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ శుక్రవారం విశ్వక్సేన్ గామి, ఓం భీమ్ బుష్, రజినీకాంత్ లాల్ సలామ్, మలయాళ హిట్ మూవీ ప్రేమలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. వీటితో పాటు మరికొన్ని వెబ్ సిరీస్‌లు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. మీకిష్టమైన సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ లాల్ సలామ్(తమిళ డబ్బింగ్ సినిమా)- ఏప్రిల్ 12 అమర్ సింగ్ చమ్కిలా (హిందీ సినిమా)- ఏప్రిల్ 12 గుడ్ టైమ్స్ -(యానిమేటెడ్ సిట్కామ్)- ఏప్రిల్ 12 లవ్ డివైడెడ్ - (స్పానిష్ రోమాంటిక్ కామెడీ)- ఏప్రిల్ 12 స్టోలెన్ - (స్వీడిష్ చిత్రం)- ఏప్రిల్ 12 ఊడీ ఉడ్‌పెక్కర్ గోస్ టూ క్యాంప్ (2024) (కిడ్స్ యాక్షన్ యానిమేషన్ సిరీస్)- ఏప్రిల్ 12 అమెజాన్ ప్రైమ్ ఓం భీం బుష్(తెలుగు సినిమా)- ఏప్రిల్ 12 ఎన్డబ్ల్యూఎస్ఎల్(అమెజాన్ ఒరిజినల్ సిరీస్)- ఏప్రిల్ 12 జీ5 గామి(తెలుగు సినిమా)- ఏప్రిల్ 12 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రేమలు(తమిళం, మలయాళం, హిందీ వర్షన్)- ఏప్రిల్ 12
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019