breaking news
-
కమల్, అమల హిట్ సినిమా.. రీమేక్ ప్లాన్ చేస్తున్న యంగ్ హీరో
ఇండస్ట్రీ ఏదైనా సరే మంచి విజయాన్ని సాధించిన చిత్రాన్ని రీమేక్ చేయడం అంటే కత్తి మీద సామే అవుతుంది. ఇంతకు ముందు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ''బిల్లా ' చిత్రాన్ని ఆ తరువాత అజిత్ హీరోగా రీమేక్ చేశారు. లక్కీగా ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. అదే విధంగా రీమేక్ చేసిన కొన్ని చిత్రాలతో నిర్మాతల చేతులు కాలాయి. ఇకపోతే నటుడు కమలహాసన్ 1988లో కథానాయకుడిగా నటించిన చిత్రం 'సత్య'. ఇందులో అక్కినేని అమల హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి సురేశ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తే.. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కమల్ హాసన్ నిర్మించారు. అప్పట్లో ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కోలీవుడ్‌లో ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. 'సత్య' చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. అందులోని పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇకపోతే సత్య చిత్రం అర్జున్ అనే హిందీ చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. కాగా కమలహాసన్ నటించిన సత్య చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇందులో కమలహాసన్ పాత్రను నటుడు అశోక్‌సెల్వన్ పోషించనున్నట్లు తెలిసింది. కోలీవుడ్‌లో అశోక్‌సెల్వన్ వైవిధ్య భరిత కథా పాత్రలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ఫుల్ బాటలో పయనిస్తున్నాడు. సత్య రీమేక్ కోసం ఆయన ప్రత్యేకంగా ఫొటో షూట్‌ను కూడా నిర్వహించినట్లు సమాచారం. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈయన ఇటీవల పోర్ తొళిల్, బ్లూస్టార్ వంటి చిత్రాల విజయాలతో మంచి ఖుషీగా ఉన్నారు. పోర్ తొళిల్ చిత్రం ఓటీటీ ద్వారా తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ చిత్రం తెలుగు వారిని కూడా మెప్పించింది. కాగా సత్య చిత్ర రీమేక్ ను పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా తెరకెక్కించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి అధికారికంగా తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
అమల-నాగార్జున ప్రేమలో పడింది ఆ సినిమాతోనే!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ జాబితాలో నాగార్జున- అమల జోడీకి ప్రత్యేకస్థానం ఉంటుంది. వీళ్లిద్దరు కలిసి అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన శివతో పాటు చాలా చిత్రాల్లో జంటగా నటించారు. అయితే ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట రియల్ లైఫ్‌లోనూ ఒక్కటయ్యారు. అయితే పెళ్లి తర్వాత అమల సినిమాలకు దూరమైంది. చాలా కాలం తర్వాత 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం ద్వారా అమ్మ పాత్రలో కనిపించింది. ఆ మధ్య ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో శర్వానంద్‌కు తల్లిగా నటించింది. ఇలా కేవలం కొన్ని సెలెక్టివ్‌గా సినిమాలు మాత్రమే చేస్తూ అభిమానులకు దగ్గరవుతోంది. అయితే సెప్టెంబర్ 12న ఆమె బర్త్ డే సందర్భంగా అమల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. (ఇది చదవండి: మరి ఇంత బోల్డ్ గానా?.. హీరోయిన్ పోస్ట్‌పై దారుణ కామెంట్స్!) అమల కుటుంబం అమల అక్కినేని తెలుగు సినిమాల్లో నటించడమే కాదు.. జంతు సంక్షేమ కార్యకర్త కూడా పనిచేస్తున్నారు. ఆమె అసలు పేరు అమల ముఖర్జీ కాగా.. తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు కాగా.. తండ్రి బెంగాళీకి చెందినవారు. అమల పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించింది. ఆమె తండ్రి ఇండియన్ నేవీలో అధికారిగా పని చేశారు. అమల హైదరాబాద్‌లోని బ్లూ క్రాస్, జంతు హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వేతర సంస్థ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. అమల సినీ కెరీర్ అమల తొలిసారిగా రాజేందర్ దర్శకత్వం వహించిన మైథిలి ఎనై కథలి అనే తమిళ చిత్రంలో నటించింది . ఆ మూవీ సూపర్‌హిట్ కావడంతో 1987 లో విడుదలైన పుష్పక విమానంలో కమల్ హాసన్ సరసన అమల కీలక పాత్ర పోషించింది . అంతే కాకుండా 1991 మలయాళ చిత్రం ఉలడక్కమ్లో తన పాత్రకు ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. చినబాబుతో టాలీవుడ్ ఎంట్రీ తెలుగులో అమల నటించిన తొలి చిత్రం చినబాబు. డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంలో నాగార్జున హీరోగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి జూన్ 11, 1992న వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు 1994లో అక్కినేని అఖిల్ జన్మించారు. అయితే నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత అమల నటనకు స్వస్తి పలికింది. చాలా ఏళ్ల తర్వాత 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే తెలుగు సినిమాలో కనిపించింది. (ఇది చదవండి: పెళ్లయ్యాక కోడలిని చదవనిస్తారా?.. సరికొత్త కథనంతో 'మామగారు'!) కోల్‌కతాలోని ఝాలాలో జన్మించిన అమల ఇవాళ 56వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అమల 1986 నుంచి 1992 వరకు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. తెలుగులో చినబాబు, పుష్పక విమానం, శివ, ప్రేమ యుద్ధం, ఘర్షణ, నిర్ణయం, రాజా విక్రమార్క(చిరంజీవి), మనం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హై ప్రీస్టెస్ 2019 (వెబ్ సిరీస్), ఒకే ఒక జీవితంలో నటించారు. View this post on Instagram A post shared by Amala Akkineni (@akkineniamala) -
నాగార్జున హిట్ సాంగ్‌కు అమల అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్
టాలీవుడ్ బ్యూటిఫుల్ జోడి జాబితాలో నాగార్జున-అమలది ముందుంటుంది. ఇద్దరు కలిసి శివతో పాటు పలు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని రిలయ్ లైఫ్‌లోనూ జోడీగా మారారు. పెళ్లి తర్వాత అమల సినిమాలకు దూరమైంది. చాలా కాలం తర్వాత 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ మధ్య ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో శర్వానంద్‌కు తల్లిగా నటించిది. ఇలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ.. ఎక్కువ సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తుంది. ఇదిలా ఉంటే..తాజాగా అమల నాగార్జున పాటకు స్టెప్పులేసి అలరించింది. తాజాగా అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో జరిగిన ఓ వేడుకకి ముఖ్య అతిథిగా అమల వెళ్లారు. అక్కడ స్టేజ్‌పై అందరూ ఒక్కో పాటకు డ్యాన్స్ చేశారు. ఇత అమల కూడా నాగార్జున హీరోగా నటించిన ‘హలో బ్రదర్’లోని ‘ప్రియ రాగాలే’ పాటకు ఆమె కాలు కదిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై మీరూ ఒక లుక్కేయండి. నిన్న అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజ్ లో జరిగిన NEO FIESTA 2K23 లో చాలా ఏళ్ళ తరువాత అమల గారు డాన్స్ 👌#AmalaAkkineni#Amala pic.twitter.com/NSMuAGVhzL — Lakshmi Bhavani (@iambhavani1) September 3, 2023 -
'ఆరు నెలల పాటు సినిమాలు వదిలేశా '.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో సందడి చేశారు. మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను కింగ్ నాగార్జున చేతులమీదుగా విడుదల చేశారు. ఈవెంట్లో పాల్గొన్న నాగార్జున తన కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో తన భార్య అమల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమల గర్భంతో ఉండగా తాను ఆరునెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో అమలతోనే ఉన్నానంటూ నాగ్ వెల్లడించారు. కాగా.. అమల, నాగార్జున జంటకు అఖిల్ జన్మించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!) నాగార్జున మాట్లాడుతూ..' 'మాతృత్వం అనేది నిజంగా ఓ అద్భుతమైన అనుభవం. అప్పుడు జరిగిన ప్రతి సంఘటన నాకు గుర్తే. అప్పడు హలో బ్రదర్ చిత్రంలో నటిస్తున్నా. అదే సమయంలో అమల గర్భం ధరించింది. దీంతో ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. ఆరు నెలలపాటు అమలతో ఉన్నాను. ఏ సినిమా చేయలేదు. చివరికీ డెలివరీ టైంలో కూడా చేయి పట్టుకుని దగ్గరే ఉన్నా. డెలివరీ అంటే ఒక ప్రాణం పోయడం. అఖిల్ డెలివరీ టైమ్‌లో ఆరు నెలలు ఏ షూటింగ్స్ పెట్టుకోకుండా అమలతోనే ఉన్నా. ఆ టైమ్ నా లైఫ్‌లో బెస్ట్ మూమెంట్. మిస్టర్ ప్రెగ్నెంట్ అనగానే మగవాళ్లు ప్రెగ్నెంట్ ఎలా అవుతారు, అది సినిమాలో ఎలా చూపించారు అనే ఆసక్తి కలిగింది. ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి ఏర్పడింది. ' అని అన్నారు. హీరో సోహైల్ మాట్లాడుతూ .. 'తెలుగు ప్రేక్షకుల్లో నాకు దక్కిన గుర్తింపునకు నాగార్జునే కారణం. ఆయన బిగ్ బాస్‌లో మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. ఈ సినిమా గ్లింప్స్ ఆయనకు చూపించి, ట్రైలర్ రిలీజ్‌కు రావాలని కోరా. గుర్తు పెట్టుకుని మరీ వచ్చారు. తొమ్మిది నెలలు బిడ్డను మోసి కనేందుకు తల్లి ఎంత కష్ట పడుతుందో మనం వింటుంటాం. కానీ ఆ కష్టాన్ని ఒక అబ్బాయిగా నా పాత్ర ద్వారా చూపించబోతున్నా. ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్లి అమ్మను హగ్ చేసుకుంటారు. ఫ్యామిలీతో కలిసి మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చూడండి.' అని అన్నారు. యంగ్ హీరో సోహైల్, రూపా కొడవయూర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ ప్రెగ్నెంట్'. ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను నాగార్జున చేతుల మీదుగా హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నెల 18న 'మిస్టర్ ప్రెగ్నెంట్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. టైటిల్ ఆసక్తికరంగా ఉండండతో ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. (ఇది చదవండి: 'ఎవరితోనైనా కమిట్ అయితేనే అలా..' బుల్లితెర నటిపై దారుణ కామెంట్స్!) -
అమల అక్కినేనితో బాలీవుడ్ హీరో, ఫోటో వైరల్
బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో జరిగిన ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలు చూసి అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. 1987లో ముంబైలో ఓ ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోలు క్లిక్‌మనిపించారు. ఇందులో సంజయ్ బ్లూ కలర్ షర్ట్‌లో హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. అతడి పక్కనే అమల అక్కినేని ఉండగా ఆమె కూడా బ్లూ కలర్ డ్రెస్ ధరించి ఉంది. 'ఇది నా ఫస్ట్ ఫోటోషూట్.. అందమైన, తెలివైన అమలతో కలిసి ఈ షూట్లో పాల్గొన్నాను. అన్నీ వర్కవుట్ అయ్యుంటే తనే నాతో కలిసి నటించిన తొలి హీరోయిన్ అయ్యుండేది, కానీ అలా జరగలేదు' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్ స్పందిస్తూ.. 1987.. అప్పుడు నాకు కేవలం 14 ఏళ్లే అని కామెంట్ చేసింది. కాగా అమల అక్కినేని తమిళ చిత్రం 'మైథిలి ఎన్నై కాదలై'తో తన కెరీర్ మొదలుపెట్టింది. ఈ చిత్రం 1986లో రిలీజైంది. ఆ మరుసటి ఏడాదే సంజయ్ కపూర్‌తో ఫోటోషూట్‌లో పాల్గొంది. ఇకపోతే టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలో టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునను పెళ్లాడింది. తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ఇకపోతే సంజయ్ కపూర్ 1995లో వచ్చిన 'ప్రేమ్' సినిమాతో తన సినీప్రయాణం ప్రారంభించాడు. చివరగా అతడు 'బ్లడీ డాడీ' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సంజయ్.. 'మెర్రీ క్రిస్మస్' మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 15న విడుదల కానుంది. దీనితో పాటు 'మర్డర్ ముబారక్', 'మేడ్ ఇన్ హెవెన్ 2' కూడా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Sanjay Kapoor (@sanjaykapoor2500) చదవండి: అలా జరగాలని కోరుకుంటే లేనిపోని ఒత్తిడి: నిహారిక
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019