breaking news
-
Lok sabha elections 2024: జాతీయ పార్టిలకు... ద్రవిడ స్వప్నం!
దక్షిణాదిన జాతీయ పార్టిలకు కొరకరాని కొయ్యగా నిలుస్తున్న రాష్ట్రాల్లో ప్రధానమైనది తమిళనాడు! 50 ఏళ్లకు పైగా ఇక్కడ ప్రాంతీయ పార్టిలదే హవా. తమిళులు కూడా సినీ గ్లామర్, ప్రాంతీయ సమస్యలు, అంశాలకే ప్రాధాన్యమిస్తారు. కానీ 39 లోక్‌సభ స్థానాలతో సీట్లపరంగా దేశంలో ఐదో అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడును పక్కనపెట్టే పరిస్థితి లేదు. దాంతో కాంగ్రెస్, బీజేపీ ఇక్కడి ప్రాంతీయ పార్టితో పొత్తులు పెట్టుకోక తప్పడం లేదు. ఈసారి మాత్రం రాష్ట్రంలో బీజేపీ గట్టిగా ఉనికిని చాటే ప్రయత్నాల్లో ఉంది... ఇండియా కూటమిదే హవా? ఒకప్పుడు కరుణానిధి డీఎంకే, జయలలిత అన్నాడీఎంకేలకు కంచుకోటైన నిలిచిన తమిళనాట వారి తదనంతరం పరిస్థితులు మారుతున్నాయి. అన్నాడీఎంకే వంటి ప్రధాన ప్రాంతీయ పార్టీ బలహీనపడటంతో ఆ రాజకీయ శూన్యతను భర్తీ చేసి ఈ కీలక దక్షిణాది రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ కూడా ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా పాలక డీఎంకేతో జట్టుకట్టింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన యూపీఏ కూటమి ఎన్డీఏను మట్టికరిపించింది. ఏకంగా 38 సీట్లను ఎగరేసుకుపోయింది. స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే 23 స్థానాల్లో పోటీ చేసి 23 సీట్లు చేజిక్కించుకుంది. కాంగ్రెస్ 9 స్థానాలకు 8 దక్కించుకుంది. సీపీఐ, సీపీఎం చెరో రెండు, ఇతర చిన్న పార్టీలు ఒక్కో సీటు గెలుచుకున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జయలలిత సారథ్యంలో 37 స్థానాలు కొల్లగొట్టిన అన్నాడీఎంకే 2019లో బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి బొక్కబోర్లా పడింది. 21 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటు గెలుచు కుంది. బీజేపీ, పీఎంకే, డీఎండీకే, టీఎంసీ (ఎం) ఖాతా కూడా తెరవలేదు. ఈసారి ఇండియా కూటమి నుంచి డీఎంకే 21, కాంగ్రెస్ 9, సీపీఐ, సీపీఎం, వీసీకే రెండేసి స్థానాల్లో, ఎండీఎంకే, ఐయూఎంఎల్ చెరో చోట పోటీ చేస్తున్నాయి. ఒక స్వతంత్రుడు డీఎంకే మద్దతుతో ఆ పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నారు. అవినీతి వర్సిటీకి చాన్సలర్ మోదీ దేశంలో అత్యంత అవినీతిమయమైన పార్టీ బీజేపీయే. అవినీతి పేరుతో యూనివర్సిటీ పెడితే దానికి మోదీయే చాన్సలర్ అవుతారు. ఆ అర్హతలన్నీ ఆయనకే ఉన్నాయి. – చెన్నై రోడ్‌షోలో సీఎం స్టాలిన్ బీజేపీ పాగా వేసేనా? ద్రవిడ రాజ్యంలో పాగా వేయాలని తహతహలాడుతున్న కమలనాథులకు అన్నాడీఎంకే దూరమవడంతో ఈసారి ఆదిలోనే షాక్ తగిలింది. దాంతో చిన్నాచితకా పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ (ఎం)కు 3, ఎస్.రాందాస్‌కు చెందిన పట్టాలి మక్కల్ కచి్చకి 10, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)కు 2 సీట్లు కేటాయించింది. మరో 4 చోట్ల కూటమిలోని ఇతర పక్షాలు కమలం గుర్తుపై పోటీ చేయనున్నాయి. అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్‌సెల్వంకు బీజేపీ మొండిచేయి చూపింది. ప్రధాని మోదీ తమిళనాట సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. అయోధ్య, డీఎంకే అవినీతి, కుటుంబ పాలనను ప్రచారా్రస్తాలుగా మలచడంతో పాటు తమిళ భాషకు పెద్దపీట వేస్తామంటూ పదేపదే ప్రకటిస్తున్నారు. దివంగత విజయకాంత్ పార్టీ డీఎండీకే (5 సీట్లు), మరో రెండు పార్టిలతో (చెరో సీటు) అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తోంది. 32 చోట్ల ఆ పార్టీ బరిలో ఉంది. అన్నామలై... బీజేపీ తురుపుముక్క బీజేపీకి తమిళనాట ఎట్టకేలకు కె.అన్నామలై రూపంలో ఫైర్‌బ్రాండ్ నాయకుడు దొరికారు. 2021లో 36 ఏళ్ల అతి చిన్న వయసులో పార్టీ పగ్గాలు అందుకుని శరవేగంగా కీలక నేతగా ఎదిగారు. ‘సింగమ్ అన్న’గా పేరొందిన ఈ మాజీ ఐపీఎస్ మొత్తం పాదయాత్రతో క్రేజ్ సంపాదించారు. డీఎంకే అవినీతిని ఎండగట్టడంతో పాటు హిందుత్వ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దూకుడు, వాగ్ధాటితో బీజేపీకి జోష్ తెచ్చారు. కోయబత్తూరు నుంచి బరిలో ఉన్నారు. రాజధానిని నాగపూర్‌కు ఎలా మారుస్తారు? అర్థంపర్థముందా? కమల్ పిచ్చాసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకుంటే మంచిది. డీఎంకే ప్రాపకం, రాజ్యసభ స్థానం కోసమే ఆయన పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు – కోయంబత్తూరు ర్యాలీలో అన్నామలై ఐదుగురు ‘సినీ’ సీఎంలు తమిళ రాజకీయాలకు, సినిమాలకు బ్రిటిష్ కాలం నుండీ విడదీయరాని బంధం! నాటి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) నుండి తాజాగా విజయ్ దాకా వెండితెరపై ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లోకి వచి్చనవారే. సినీ పరిశ్రమ నుంచి తమిళనాట ఐదుగురు ముఖ్యమంత్రులయ్యారు. ద్రవిడ సిద్ధాంతాలను సినిమాల్లో చొప్పించిన వారిలో రాష్ట్ర తొలి ద్రవిడ సీఎం సీఎన్ అన్నాదురై ముందుంటారు. ఇక కవిగా, స్క్రీన్‌ప్లే, సంభాషణ రచయితగా పేరొందిన ఎం.కరుణానిధి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడైన తమిళ సినీ దిగ్గజం ఎంజీఆర్ కూడా ముఖ్యమంత్రులయ్యారు. ఎంజీఆర్ మరణానంతరం అతి స్వల్పకాలం పాటు సీఎంగా చేసిన ఆయన భార్య జానకీ రామచంద్రన్ కూడా సినీ నటే. అనంతరం ఎంజీఆర్ వారసురాలైన స్టార్ హీరోయిన్ జయలలిత సీఎంగా చెరగని ముద్ర వేశారు. తర్వాతి తరంలో విజయకాంత్ (ఎండీఎంకే), కమల్‌హాసన్ (మక్కల్ నీది మయం) పార్టిలు పెట్టినా రాణించలేదు. కమల్ ఈసారి ఇండియా కూటమికి మద్దతు తెలిపారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టినంత పని చేసి చివరికి విరమించుకున్నారు. తాజాగా సూపర్‌స్టార్ విజయ్ కూడా తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ పెట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించారు. హీరో విశాల్ కూడా పార్టీ పెడతానని ప్రకటించారు. ఇండియా కూటమికే సర్వేల మొగ్గు తమిళనాట ఇండియా కూటమి మళ్లీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. బీజేపీకి ఓట్ల శాతం భారీగా పెరుగుతుందని, నాలుగైదు స్థానాలూ వస్తాయని మరో సర్వే అంటోంది. అవినీతికి మారుపేరు డీఎంకే. దానిపై తొలి కాపీరైట్ ఆ పార్టిదే. అదో ఫ్యామిలీ కంపెనీ. రాష్ట్రాన్ని లూటీ చేస్తోంది. భాష, కులం, మతం, విశ్వాసం అంటూ విద్వేష, విభజన రాజకీయాలు చేస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో డీఎంకే వంటి కుటుంబ పార్టిలు అవినీతిపరులకు కొమ్ముకాస్తున్నాయి. కచ్చతీవు దీవిని 1974లో శ్రీలంకకు ధారాదత్తం చేసింది ఈ రెండు పార్టిలే. – వెల్లూరు సభలో ప్రధాని మోదీ ఎన్డీఏ ఈసారి అధికారంలోకి వస్తే దేశ రాజధానిని నాగపూర్‌కు మార్చేస్తుంది. త్రివర్ణ పతాకాన్ని కూడా కాషాయ జెండాగా మర్చాలని చూస్తున్నారు. గుజరాత్ మోడల్ కంటే ద్రవిడ మోడల్ చాలా గొప్పది. మేం దాన్నే అనుసరిస్తాం. – డీఎంకే తరఫున ప్రచారంలో కమల్ హాసన్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: మరాఠా గడ్డపై మహా పోరు!
మరాఠా గడ్డపై ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. పొత్తుకు పై పొత్తు అన్నట్లుగా ఏ పార్టీ ఎప్పుడు ఏ కూటమిలో ఉంటుందో తెలియని ట్విస్టులతో మహారాష్ట్రలో రాజకీయం నానా మలుపులు తిరుగుతోంది. శివసేన, దిగ్గజ నేత శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) పగ్గాలు చీలిక వర్గాల చేతికి వెళ్లడంతో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. ఆ రెండు పార్టీలతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లోనూ వాటితో కలిసే కూటమిగా పోటీ చేస్తోంది. మరోపక్క, ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్)తో సహా చిన్నాచితకా పార్టీలు జట్టు కట్టి రంగంలోకి దిగాయి... స్టేట్ స్కాన్ 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్ర సీట్లపరంగా ఉత్తరప్రదేశ్ తర్వాత రెండో అతి పెద్ద రాష్ట్రం. ఇక్కడి రాజకీయాలు ఎక్కువగా స్థానికాంశాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఎన్నికల వేళ అనూహ్య రాజకీయ మార్పులూ పరిపాటే. ఏ పార్టీ కూడా ఒంటిచేత్తో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న దాఖలాలు పెద్దగా లేవు. రెండేళ్లలో అంతా తలకిందులు పొత్తు రాజకీయాలకు పేరొందిన మహారాష్ట్రలో గడిచిన రెండేళ్లలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వాములుగా పోటీ చేసిన బీజేపీ, శివసేన ఏకంగా 41 స్థానాలు కైవసం చేసుకున్నాయి. బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేసి 23 సీట్లు దక్కించుకోగా, శివసేన 23 చోట్ల పోటీ చేసి 18 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీ మరో రెండు ప్రాంతీయ పార్టీలను కలుపుకొని బరిలోకి దిగినా ప్రభావం చూపలేకపోయాయి. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేసి ఒక్క చోటే గెలిచింది. ఎన్సీపీ 19 చోట్ల అభ్యర్థులను నిలబెట్టి 4 సీట్లతో సరిపెట్టుకుంది. ఇతర పార్టీలు ఎన్డీఏ సునామీలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు శివసేన, ఎన్సీపీ రెండుగా చీలిపోయాయి. ఒకటి ఎన్డీఏలో, మరోటి మహాకూటమి పంచన చేరాయి. 48 లోక్‌సభ స్థానాల్లో 5 సీట్లు ఎస్సీలకు, 4 ఎస్టీలకు కేటాయించారు. మాటల యుద్ధం ఎన్నికల ప్రచారం జోరందుకుంటున్న కొద్దీ నేతల మాటల్లో వాడి, వేడి కూడా పెరుగుతోంది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే బీజేపీకి బేషరతు మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ తప్పుబట్టారు. ‘రాజ్ ఠాక్రే బీజేపీ ముందు మరీ ఇలా సాగిలపడిపోతారనుకోలేదు. పులి కాస్త గొర్రెలా మారింది. ఠాక్రే వంటి పోరాట యోధుడు బానిసగా మారారు. అతను బీజేపీకి మద్దతు ప్రకటించినా ఎన్నికల్లో మా విపక్ష ఎంవీఏ కూటమిపై ఎలాంటి ప్రభావం ఉండదు’ అని విజయ్ పేర్కొన్నారు. కాగా, బుధవారం నాగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. ‘సర్వేలన్నీ ఎన్డీఏ బంపర్ విజయం ఖాయమంటున్నాయి. ప్రతిపక్షాలు నాపై చేస్తున్న విమర్శలు, దూషణలతో మా బలం మరింత పెరుగుతోంది. ’అబ్కీ బార్ 400 పార్’ ట్రెండ్ బలపడుతోంది‘ అని స్పష్టం చేశారు. బీజేపీ తరపున డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వంటి నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కాగా, రెండు నెలల క్రితం కాంగ్రెస్‌ను వీడిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కూడా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లలో ఉండటం విశేషం. ఆయనకు బీజేపీ రాజ్యసభ సీటు కట్టబెట్టింది. మరోపక్క, కాంగ్రెస్ ప్రచారంలో రాహుల్ గాం«దీ, మల్లిఖార్జున ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే దన్నుగా నిలుస్తున్నారు. అధికార కుమ్ములాటలు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసి మెజారిటీ సాధించాయి. మహా వికాస్ అఘాఢీ (ఎంవీఏ) పేరిట కలిసి బరిలో దిగిన కాంగ్రెస్, ఎన్సీపీ ప్రతిపక్షానికి పరిమితయ్యాయి. అధికార పంపకంపై బీజేపీ, శివసేన కుమ్ములాట చివరికి కూటమి నుంచి సేన వైదొలిగేందుకు దారితీసింది. శివసేనకు ఎంవీఏ సీఎం పదవి ఆఫర్ చేయడంతో అది కూటమిలో చేరింది. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టారు. 100కు పైగా సీట్లను దక్కించుకున్నా అధికారం దక్కకపోవడంతో బీజేపీ అదను చూసి శివసేనకు షాకిచ్చింది. శివసేన నేత ఏక్నాథ్ షిండే మెజారిటీ ఎమ్మెల్యేలను చీల్చి వేరుకుంపటి పెట్టుకున్నారు. ఆయన సీఎంగా బీజేపీ–శివసేన సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసింది. శివసేన పార్టీ, గుర్తు షిండే వర్గానికే దక్కాయి. అటు ఎన్సీపీలోనూ అజిత్ పవార్ తిరుగుబావుటా ఎగరేశారు. ఎమ్మెల్యేలను చీల్చి అధికార సంకీర్ణంలో చేరి డిప్యూటీ సీఎం అయ్యారు. ఎన్సీపీ పేరు, గుర్తు కూడా అజిత్ వర్గానికే దక్కడంతో శరద్ పవార్ కొత్త పేరు, గుర్తుతో పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది! ‘మహా’యుతి కూటమి బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి బలంగా కన్పిస్తోంది. శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమిలో ఉన్నాయి. అయోధ్య రామ మందిరం సాకారం, అభివృద్ధి నినాదాలతో బీజేపీ ప్రచారం సాగిస్తోంది. మోదీ కేబినెట్లో రెండు విడతల్లోనూ మంత్రి పదవి దక్కించుకున్న మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) షిర్డీ లోక్‌సభ సీటు డిమాండ్ చేస్తోంది. దాన్ని తమ సిట్టింగ్ ఎంపీకే కేటాయించాలని సీఎం షిండే పట్టుబడుతున్నారు. షిర్డీ నుంచి తాను పోటీ చేసినా, చేయకపోయినా ఎన్డీఏతోనే ఉంటానని ఆర్పీఐ చీఫ్ రాందాస్ అథవాలే ప్రకటించారు. ఆయనకున్న ఓటు బ్యాంకు చాలా స్థానాల్లో కూటమికి కలిసొస్తుందని భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. బీజేపీ దాదాపు 30 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. కానీ ఎన్సీపీ 10, శివసేన 18 సీట్లు కోరుతున్నాయి. ఇప్పటిదాకా బీజేపీ 24, శివసేన 8, ఎన్సీపీ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. గత ఎన్నికల్లో మహారాష్ట్రలో 7 శాతం ఓట్లు సాధించిన అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ సారథ్యంలోని బహుజన్ అఘాడీ కూడా బీజేపీతో సీట్ల బేరం సాగిస్తోంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా తాజాగా మోదీకి జై కొట్టారు. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమికి బేషరతుగా మద్దతు ప్రకటించారు! ‘ఇండియా’ పైచేయి సాధించేనా? ప్రతిపక్ష ఎంవీఏ కూటమిలో ఎట్టకేలకు సీట్ల పంపకం కొలిక్కి వచి్చంది. శివసేన (ఉద్ధవ్) 21 సీట్లు, కాంగ్రెస్ 17 స్థానాలు, ఎన్సీపీ (శరద్ పవార్) 10 స్థానాల చొప్పున పంచుకున్నాయి. ఎన్సీపీ, శివసేన ఓటు బ్యాంకు తమతోనే ఉందని ఎంవీఏ చెబుతోంది. కాంగ్రెస్ 6 న్యాయాలు, 25 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. మహాయుతి కూటమికి ఎంవీఏ గట్టి పోటీ ఇస్తున్నట్టు కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో మహారాష్ట్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సర్వేల సంగతేంటి? సర్వేల్లో మహారాష్ట్రపై మిశ్రమ అంచనాలు వెలువడుతున్నాయి. కొన్ని అధికార మహాయుతి కూటమికే మెజారిటీ సీట్లు కట్టబెట్టగా మరికొన్ని ఎంవీఏ భారీగా పుంజుకుని పైచేయి సాధిస్తుందంటున్నాయి. తాజా సర్వే ఒకటి ఎంవీఏ కూటమికి ఏకంగా 26 స్థానాలు అంచనా వేయడంతో కాంగ్రెస్ తదితర విపక్షాల్లో ఉత్సాహం నెలకొంది. – సాక్షి నేషనల్ డెస్క్ -
హస్తినలో విపక్షాల ర్యాలీ నేడే
న్యూఢిల్లీ: ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఆదివారం తలపెట్టిన భారీ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీతో పాటు కూటమికి చెందిన పలువురు నేతలు ప్రసంగిస్తారన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పాల్గొనే అవకాశముందని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని, ర్యాలీలో దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తామని తెలిపారు. డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), శరద్ పవార్ (ఎన్సీపీ–ఎస్సీపీ), తేజస్వీ యాద వ్ (ఆర్జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు పాల్గొంటారన్నారు. ఇండియా కూటమి భాగస్వామి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ర్యాలీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ సారథి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీగా జన సమీకరణ చేసి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. -
పొత్తులపై ఏపీ బీజేపీ మరోసారి క్లారిటీ
సాక్షి, విజయవాడ: బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్న చంద్రబాబుకు షాక్ తగిలింది. జనసేనతో జతకట్టిన చంద్రబాబు.. ఘోర ఓటమి భయం వెంటాడటంతో బీజేపీతో పొత్తు కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి. అయితే, పొత్తులపై ఏపీ బీజేపీ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. రెండు రోజుల సమావేశాల్లో పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తులు చేశామని, 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్ధానాల్లో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియని చేపట్టామని ఆమె పేర్కొన్నారు. ‘‘26 జిల్లాలు.. 175 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీశాం. అభ్యర్థుల ఎంపిక.. సామాజిక సమీకరణ సహా అన్ని అంశాలపై చర్చించాం. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి నివేదిస్తాం. పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తారు. నిర్ణయిస్తారు. పొత్తులు సహా ఎలాంటి నిర్ణయమైనా పార్టీ హైకమాండ్‌దే’’ అని పురందేశ్వరి స్పష్టం చేశారు. మరోవైపు, బీజేపీలోని చంద్రబాబు మద్దతుదారులు పొత్తు కోసం ఢిల్లీలో పైరవీ చేస్తున్నా.. ఢిల్లీ పెద్దలు మాత్రం అంగీకరించడంలేదని టాక్. బీజేపీలో చేరినప్పటికీ వీరు చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలే చెబుతుంటారు. అందుకోసమే చంద్రబాబు డైరక్టన్లోనే బీజేపీ వైపు నుంచి పొత్తు కోసం ప్రతిపాదన వచ్చేలా పైరవీలు సాగించారు. వీరితో పాటు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి సైతం పొత్తు కోసమే ప్రయత్నించారనే టాక్ నడిచింది. చంద్రబాబు మార్కు రాజకీయాలు అన్నీ తెలిసిన బీజేపీ అధిష్టానం పొత్తులపై ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం. ఇదీ చదవండి: వల్లనోరిమామా నేనెళ్లను.. చీపురుపల్లి పోనంటున్న తమ్ముళ్లు -
బీజేపీతో పొత్తు ఉంటుంది: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో BRS పార్టీకి పొత్తు ఉంటుందంటూ బాంబు పేల్చారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇప్పటివరకు ఉప్పు, నిప్పులా ఉన్న BJP, BRS లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటూ అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్‌చాట్‌లో అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉన్న పరిస్థితుల్లో మల్లారెడ్డి చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. బీజేపీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి మల్లారెడ్డి ఆ మాటలు చెప్పాడా? లేక లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా అన్నది వచ్చే కొద్ది రోజుల్లో తెలుస్తుంది. మల్లారెడ్డి ఏమన్నాడంటే.. "బీజేపీతో BRSకు పొత్తు ఉండే అవకాశం ఉంది, మా ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారే ప్రసక్తే లేదు, అసలు మా ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీతో టచ్‌లోనే లేరు, రెండు పార్టీలు పొత్తుతో పోటీ చేస్తే.. BRSకు మల్కాజ్ గిరి సీటు ఇస్తారు. BJPతో BRS పొత్తు ఉండే అవకాశమున్నప్పుడు.. మా ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారని బండి సంజయ్ ఎలా మాట్లాడతారు? బండి సంజయ్‌తో అయ్యేది లేదు...పొయ్యేది లేద" అన్నారు మల్లారెడ్డి మల్కాజి గిరి లోక్‌సభ సీటు గురించి మాట్లాడుతూ.. "మా మల్కాజిగిరి లోక్‌సభ టిక్కెట్ భద్రంగా వుంది, బీజేపీతో బిఆర్ఎస్ పొత్తు ఉన్నా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం మాదే. మా అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు, మా కుటుంబం వేరు. నా కొడుకుకు టిక్కెట్ ఇస్తే మాదంతా ఉమ్మడి కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. మా యూనివర్సిటీల్లో అక్రమ కట్టడాలు వుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే నేను ఏం చేయలేను" అన్నాడు మల్లారెడ్డి. మల్లారెడ్డి మాటలకు నేపథ్యమేంటీ? ఇవ్వాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు BRS సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. "బీఆర్ఎస్తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. మోదీ.. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే NDAలో బీఆర్ఎస్ను చేర్చుకోలేదు. ఎటుకాని BRS పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం.? ప్రస్తుతమున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019