breaking news
Ad - Sakshi_Home_Sticky
-
ఎంగేజ్మెంట్ తర్వాత సిద్దార్థ్ ఫస్ట్ బర్త్‌డే.. ప్రియురాలి విషెస్ (ఫోటోలు)
-
తన లవర్‌బోయ్‌కి అదితి లవ్లీ విషెస్
టాలెంటెడ్ హీరో సిద్ధార్థ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్17) . ఈ సందర్భంగా సిద్ధార్థ్ ప్రేయసి, అందాల తార అదితి రావు హైదరీ స్పెషల్ విషెస్ తెలిపింది. ఈ సందర్బంగా తన కాబోయే భర్తతో లవ్లీ ఫోటోలను షేర్ చేసింది. "హ్యాపీయెస్ట్ బర్త్‌డే నా మేనికార్న్’’ కాబోయే భర్త కోసం పుట్టినరోజుకి విషెస అందించింది. ఎంగేజ్మెంట్ తరువాత ఇది ఫస్ట్ బర్త్‌డే కావడంతో అదితి ఆనందంలో మునిగితేలుతోంది. మురిపెంగా ప్రియుడిని లాటర్, చీర్ లీడర్ అంటూ పొగిడేసింది. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం హీరోయిన్ అదితితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. 2021లో 'మహా సముద్రం' తర్వాత నుంచి వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారు.అయితే తెలంగాణలోని వనపర్తిలోని శ్రీరంగనాయక ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు హల్చల్ చేశాయి.అయితే పెళ్లి వార్తలను ఖండించిన సిద్ధార్థ్ తాము రహస్యంగా పెళ్లి చేసుకోలేదనీ, కుటుంబంతో ప్రైవేట్‌గా నిర్వహించిన ఒక పార్టీలో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
ఎంగేజ్మెంట్ సీక్రెట్‌గా జరగలేదు, మా పెళ్లెప్పుడంటే?
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు హీరో సిద్దార్థ్. ఒకప్పుడు సూపర్ హిట్లతో అలరించిన ఇతడికి ఈ మధ్య తెలుగులో విజయాలే కరువయ్యాయి. సినిమాల సంగతి ఎలా ఉన్నా తెలుగు హీరోయిన్ అదితిరావు హైదరితో డేటింగ్ చేస్తూ, షికార్లకు వెళ్తూ అందరి కంట్లో పడ్డాడు. కానీ తన ప్రేమ విషయాన్ని అందరితో పంచుకోవడానికి ఇష్టపడలేదు. పెళ్లి కాస్తా ఎంగేజ్మెంట్ అయింది! ఈ క్రమంలో మార్చి 17న సడన్‌గా వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురంలో ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నాడు. తమిళనాడు నుంచి పురోహితులను తీసుకొచ్చి మరీ ఎంగేజ్మెంట్ కానిచ్చేశారు. కానీ ఆలయ అధికారులకు, పండితులకు అది సినిమా షూటింగ్ అని చెప్పి బురిడీ కొట్టించారు. తర్వాత ఆ డెకరేషన్, సెలబ్రేషన్స్ చూస్తే అది పెళ్లని అందరూ పొరబడ్డారు. దీంతో సిద్దార్థ్ సోషల్ మీడియా వేదికగా తానింకా పెళ్లి చేసుకోలేదని, జరిగింది ఎంగేజ్మెంట్ మాత్రమేనని వెల్లడించాడు. సీక్రెట్ కాదు.. తాజాగా ఓ ఈవెంట్‌కు వెళ్లిన అతడికి ఎందుకు సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు? పెళ్లి ముహూర్తాలు పెట్టించారా? అని వరుస ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి సిద్దార్థ్ స్పందిస్తూ.. చాలామంది మేమేదో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నామంటున్నారు. సీక్రెట్, ప్రైవేట్ అనే పదాలకు చాలా వ్యత్యాసం ఉంది. మేము మా కుటుంబసభ్యులతో కలిసి ప్రైవేట్ ఫంక్షన్ చేసుకున్నాం. ఏ ఒక్కరినీ పిలవకుండా, చెప్పాపెట్టకుండా చేసుకుంటే అది సీక్రెట్ అంటారు. మరి మా వాళ్లందరి సమక్షంలో జరిగిన నిశ్చితార్థం సీక్రెట్ ఎలా అవుతుంది? పెళ్లి వారి చేతుల్లోనే.. ఇకపోతే అదితికి ప్రపోజ్ చేసినప్పుడు ఏం సమాధానం వస్తుందా? అని ఎదురుచూశాను. నా టెన్షన్ పోగొడుతూ తను నాతో జీవితాన్ని పంచుకోవడం సమ్మతమే అని అంగీకరించడంతో సంతోషపడిపోయాను. పెళ్లి విషయానికి వస్తే అది మా పెద్దలు నిర్ణయిస్తారు. నేను డిసైడ్ చేయడానికి ఇదేమీ షూటింగ్ డేట్ కాదు కదా.. పెద్దవాళ్లే ముహూర్తాలు చూసి ఓ మంచిరోజు డిసైడ్ చేస్తారు. అప్పుడే పెళ్లి జరుగుతుంది అని చెప్పాడు. చదవండి: అతడిని ఎంతో ప్రేమించా.. పెళ్లి దగ్గర్లో ఉందనగా నేనంటే ఇష్టం లేదన్నాడు! -
డ్రోన్ షో ద్వారా ‘హీరమండి: ది డైమండ్ బజార్’ ప్రత్యేక విడుదల తేదీ (ఫొటోలు)
-
ఆరుగురు హీరోయిన్లతో రియల్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న తాజా వెబ్ సిరీస్ హీరామండీ: ది డైమండ్ బజార్. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వీడియో షేర్ చేస్తూ రివీల్ చేశారు. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి- ది డైమండ్ బజార్ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్‌సిరీస్ ద్వారా ప్రపంచానికి చూపించనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్‌లో స్పృషించనున్నారు. ఈ సిరీస్‌లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను ప్రధానాంశాలుగా సంజయ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలో తన కలల ప్రాజెక్టు హీరామండీ: ది డైమండ్ బజార్‌తో ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019