breaking news
-
నామినేషన్ వెనక్కి తీసుకున్న ఆప్ కౌన్సిలర్
ఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి రెబల్ ఆప్ కౌన్సిలర్ 'నరేంద్ర కుమార్' తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. విజయ్ కుమార్ ఆ పదవికి సెల్ఫ్-నామినేట్ చేసిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం జరిగింది. ఏప్రిల్ 18న, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD) మేయర్ ఎన్నికలకు తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత , మేయర్ పదవికి మహేష్ ఖిచి, డిప్యూటీ మేయర్‌గా రవీందర్ భరద్వాజ్‌ని నిలబెట్టారు. అయితే కౌన్సిలర్లు విజయ్ కుమార్, నరేంద్ర మధ్య ఉన్న అంతర్గత విభేదాల కారణంగా వారు నామినేషన్స్ దాఖలు చేశారు. కాగా ఇప్పుడు నరేంద్ర కుమార్ నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. నరేంద్ర కుమార్ తన నామినేషన్‌ను ఎందుకు వెనక్కు తీసుకున్నారు అనేదానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. పార్టీ నుంచి తనకు ఎటువంటి ఒత్తిడి లేదని పేర్కొన్నారు. పార్టీ ఎంపికకు వ్యతిరేఖంగా ఎందుకు నామినేషన్ వేశారు అనే దానికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. నరేంద్ర కుమార్ వార్డు-119 మంగళపురి కౌన్సిలర్ కాగా, విజయ్ కుమార్ వార్డు-192 త్రిలోకపురి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
‘కేజ్రీవాల్‌ను మూడోసారీ ఓడించలేకపోతే చంపేద్దాం.. ఇదీ వారి కుట్ర’
న్యూఢిల్లీ, సాక్షి: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో చంపే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నాయకురాలు, రాష్ట్ర మంత్రి అతిషి ఆరోపించారు. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్ అయిన కేజ్రీవాల్ పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడం లేదని తెలిపారు. మద్యం పాలసీ స్కామ్ ఆరోపణలతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. తాజాగా కేజ్రీవాల్ తన రెగ్యులర్ డాక్టర్‌తో వీడియో సంప్రదింపుల కోసం చేసిన అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించిన అనంతరం ఆప్ నేతల నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి. ‘అరవింద్ కేజ్రీవాల్‌ను మూడు ఎన్నికల్లో (మూడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు) బీజేపీ ఓడించలేకపోతే, ఆయన్ను జైల్లో ఉంచి చంపేందుకు పథకం పన్నుతోంది’ అని అతిషి అన్నారు. "అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్నారని అందరికీ తెలుసు. ఆయనకు గత 30 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. తన చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారు" అని ఆమె పేర్కొన్నారు. ‘ఇంత తీవ్రమైన మధుమేహం ఉన్న వ్యక్తి మాత్రమే అంత ఇన్సులిన్ తీసుకుంటాడు. కావాలంటే ఏ డాక్టర్నైనా అడగండి.. అందుకే అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి, డాక్టర్ సూచించిన ఆహారాన్ని తినడానికి కోర్టు అనుమతించింది’ అన్నారు. అయితే బీజేపీ తన అనుబంధ సంస్థ (ఈడీ) ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఈడీ పదే పదే అబద్ధాలు చెబుతోందని అని ఆమె కోర్టులో ఏజెన్సీ వాదనలను తిప్పికొట్టారు. తన వైద్యుడితో సంప్రదింపు కోసం చేసిన అభ్యర్థనను వ్యతిరేకిస్తూ, మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని మామిడిపండ్లు, స్వీట్లను కేజ్రీవాల్ తింటున్నారని, చక్కెర కలిగిన టీ తాగుతున్నారని ఈడీ వాదించింది. దీనికి కౌంటర్ ఇస్తూ ఇది పూర్తిగా అబద్ధమని, డాక్టర్ సూచించిన స్వీటెనర్ తోనే టీ, స్వీట్లను కేజ్రీవాల్ తీసుకున్నారని అతిషి చెప్పుకొచ్చారు. -
‘ఆప్ కా రామ్‌రాజ్య్’ లాంచ్ చేసిన ఆమ్ ఆద్మీ!
శ్రీరామ నవమి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్ కా రామరాజ్య్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆప్ నేత సంజయ్ సింగ్ తెలియజేశారు. జాతిపిత మహాత్మా గాంధీ ప్రస్తావించిన రామరాజ్యంలో అసమానత లేదని, రామరాజ్యం నెలకొల్పాలనే కలను సాకారం చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ ఎంతగానో కృషి చేశారన్నారు. అరవింద్ కేజ్రీవాల్ లేకుండా చేసుకుంటున్న తొలి శ్రీరామనవమి ఇదేనని అన్నారు. అయితే కేజ్రీవాల్ జైలు నుంచి తమకు సందేశాలు పంపుతూనే ఉన్నారని, అతనిపై నిరాధారమైన కేసులు బనాయించారని సంజయ్ సింగ్ ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రధానికి ద్వేషం ఉందని, ఎందుకంటే కేజ్రీవాల్ చేస్తున్న పనులను ప్రధాని చేయలేరన్నారు. ఈ సందర్భంగా మరోనేత అతిశీ మాట్లాడుతూ రఘుకుల సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని, ప్రాణం పోయినా ఇచ్చిన వాగ్దానాలను ఉల్లంఘించకూడదన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఢిల్లీ, పంజాబ్ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ మేలు చేస్తున్నారన్నారు. రాముడు అజ్ఞాతవాసానికి వెళ్లవలసి వచ్చినప్పటికీ, తాను ఇచ్చిన మాట తప్పలేదని, అదేవిధంగా ఢిల్లీలో స్కూళ్లు, హెల్త్, విద్యుత్ వ్యవస్థ బాగున్నాయా లేదా అని తమకు మెసేజ్ పంపారన్నారు. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ రామరాజ్యంలో అందరిలో ప్రేమ, సోదరభావం ఉండేదని అన్నారు. -
ఆప్ పంజాబ్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో మరో నలుగురు
ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్దమవుతున్న పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మంగళవారం నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జలంధర్ నియోజకవర్గంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతో తలపడేందుకు రాష్ట్రంలోని అధికార పార్టీ 'పవన్ కుమార్ టిను'ను బరిలోకి దింపింది. ఈయన శిరోమణి అకాలీదళ్ పార్టీ నుంచి ఆప్ పార్టీలోకి చేరారు. ఇప్పుడు ఎస్సీ కోటా నియోజకవర్గం అయిన జలంధర్ నుంచి పోటీ చేయనున్నారు. ఆప్ పంజాబ్ ఎంపీ అభ్యర్థులు ఫిరోజ్‌పూర్ - జగదీప్ సింగ్ కాకా బ్రార్ గురుదాస్‌పూర్ - అమన్‌షేర్ సింగ్ (షెర్రీ కల్సి) జలంధర్ - పవన్ కుమార్ టిను లూథియానా - అశోక్ పరాశర్ పప్పి 📢 Announcement! 📢 The Aam Aadmi Party proudly presents its candidates for the upcoming Lok Sabha Elections 2024 in Punjab: pic.twitter.com/zPxvgKw2RL — AAP (@AamAadmiParty) April 16, 2024 -
‘ఉగ్రవాదిని కాదు.. నేను అరవింద్ కేజ్రీవాల్‌ని’
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశానికి, ఢిల్లీ ప్రజలకు కోసం ఒక కుమారుడుగా, సోదరుడుగా పనిచేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. తీహార్ జైలు నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని మీడియాకు సంజయ్ సింగ్ వెల్లడించారు. ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్. నేను ఉగ్రవాదిని కాదు. మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేను పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌ను తీహార్ జైల్లో గ్లాస్ గోడ ద్వారా కలిశాను. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆప్‌పై ఎంత ద్వేషం పెంచుకున్నారో తెలుసుకోవడానికి ఇదే నిదర్శనం’ అని సీఎం కేజ్రీవాల్ తెలిపారన్నారు. 24 గంటలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనోభావాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ సింగ్ మండిపడ్డారు. ‘జైలులో ఉన్నది సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆయన ఓ మట్టి మనిషి.. అయన్ను ఎంత విచ్ఛినం చేయాలని చూసినా అంతే బలంగా తిరిగి వస్తారు. తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ కలసిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ భావోద్వేగానికి గురయ్యారు. ఇది మనందరికీ చాలా ఉద్వేగభరితమైన విషయం. ప్రధాని మోదీ, బీజేపీకి సిగ్గు చేటు’ అని సంజయ్ సింగ్ అన్నారు. ‘ప్రధాని మోదీ సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలక్టోరల్ బాండ్ల పథకం ఉత్తమమైనది అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ, చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మోదీ సుప్రీ కోర్టు తీర్పును అవమానించారు. మోదీ సుప్రీం కోర్టుక, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019