breaking news
-
నాకు చాలాసార్లు అబార్షన్ అయింది: స్టార్ హీరో మాజీ భార్య
దర్శకనిర్మాత కిరణ్‌రావు.. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు మాజీ భార్య. 2005లో ఆమిర్.. కిరణ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐవీఎఫ్- సరోగసి పద్ధతి ద్వారా 2011లో ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. ఏళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఆమిర్ దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. అప్పుడే ఆజాద్.. తాజాగా కిరణ్ రావు.. పెళ్లి తర్వాత తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించింది. దోబి ఘాట్ సినిమా (2011) సమయంలో ఆజాద్ పుట్టాడు. అప్పటికే నేను పిల్లలు కావాలని ఎంతగా ప్రయత్నించానో..! ఆ ఐదేళ్లలో ఎన్నోసార్లు అబార్షన్ అయింది. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఒక పిల్లాడు/పాపను పొందడం ఇంత కష్టమా.. అనిపించింది. పదేళ్లు సినీ ఇండస్ట్రీకి దూరం బిడ్డను కనాలని చూస్తున్న నాకు ఐవీఎఫ్- సరోగసి ద్వారా ఆజాద్ జన్మించడంతో సంతోషమేసింది. తల్లిగా తనను ప్రేమగా పెంచాలని డిసైడయ్యాను. తనతో జీవితాన్ని ఆనందంగా గడిపాను. అవి నా జీవితంలోనే ఉత్తమమైన రోజులు. పదేళ్లు సినిమాకు దూరంగా ఉన్నందుకు నాకెలాంటి బాధా లేదు. ఎందుకంటే ఆ రోజుల్ని నేను ఆజాద్‌కి కేటాయించాను అని చెప్పుకొచ్చింది. కాగా కిరణ్ రావు ఇటీవలే లాపతా లేడీస్ సినిమాతో దర్శకురాలిగా రీఎంట్రీ ఇచ్చింది. చదవండి: నూకరాజు- ఆసియా బ్రేకప్? జబర్దస్త్ కమెడియన్ ఏమన్నాడంటే.. -
అది ఫేక్ వీడియో.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అమీర్ ఖాన్
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ 'అమీర్ ఖాన్' రాబోయే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపే ఒక నకిలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఖాన్ స్పందించారు. బాలీవుడ్ నటుడు 'అమీర్ ఖాన్' రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నట్లు వస్తున్న వీడియోలు ఫేక్ అని కొట్టి పారేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని, ఏ పార్టీని తాను ప్రమోట్ చేయలేదని స్పష్టం చేశారు. నా 35 సంవత్సరాల కెరీర్లో ఏ రాజకీయ పార్టీని ఎన్నడూ ఆమోదించలేదని పేర్కొన్నారు. ఎన్నికలలో.. ఎన్నికల సంఘం కోసం ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నం చేసినట్లు వివరించారు. మిస్టర్ ఖాన్ ఒకే పార్టీని ప్రమోట్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలు నకిలీవని ప్రకటించారు. దీనిపైన ముంబై పోలీసుల సైబర్ క్రైమ్ సెల్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు ఖాన్ పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఓటర్లకు అమీర్ ఖాన్ సందేశం ఇచ్చారు. భారతీయులందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని, ఎన్నికల ప్రక్రియలో భాగం కావాలని కోరారు. అయితే ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినట్లు తెలిసింది. भारत का हर नागरिक लखपति है क्योंकि सबके पास काम से कम 15 लाख तो होने ही चाहिए .. क्या कहा आपके अकाउंट में 15 लाख नहीं है.. तो आपके 15 लाख गए कहां ??? तो ऐसे जुमलेबाजों से रहे सावधान नहीं तो होगा तुम्हारा नुकसान 🇮🇳🇮🇳🇮🇳देशहित में जारी🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/hJkEFEL5vG — Mini Nagrare (@MiniforIYC) April 14, 2024 -
టాలీవుడ్ డైరెక్టర్ గురించి విన్నా.. ఆ సినిమా తప్పకుండా చూస్తా: కిరణ్ రావు
బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్‌రావు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల లపట్టా లేడీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ రావు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతని క్రాఫ్ట్ అద్భతంగా ఉంటుందని.. యానిమల్ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. తన సినిమా లపట్టా లేడీస్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపింది. కిరణ్ రావు మాట్లాడుతూ..'లాపట్టా లేడీస్ సినిమాకు విశేషమైన స్పందన వచ్చింది. మీ అభిమానానికి నా ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు యాక్షన్‌తో కూడిన భారీ చిత్రాలనే ఇష్టపడుతున్నారు. యానిమల్ లాంటి సినిమాను నేను చూడాలనుకుంటున్నా. అది అవసరం. ప్రజలు ఇష్టపడినందున యానిమల్ హిట్‌గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా క్రాఫ్ట్ చాలా బాగుందని విన్నాను. రణబీర్ కపూర్ కూడా మంచి నటుడు. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నా.' అని అన్నారు. -
నా భర్త మొదటి విడాకులు.. కారణం నేను కాదు: స్టార్ హీరో మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొంతలో కొంత తెలుసు. అప్పట్లో రీనా దత్తా అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 16 ఏళ్లపాటు కలిసున్లారు. కానీ ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన కొన్నేళ్లకు కిరణ్ రావ్ అనే దర్శకురాలితో ఏడడుగులు వేశాడు. అయితే తొలి భార్య నుంచి విడిపోవడానికి రెండో భార్యనే కారణమని చాలామంది విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ విషయమై స్వయంగా కిరణ్ రావ్ స్పందించింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో సూర్య దంపతుల మొత్తం ఆస్తి అన్ని కోట్లా?) ''లగాన్' షూటింగ్ టైంలోనే నేను-ఆమిర్ కనెక్ట్ అయ్యామని చాలామంది భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. 'స్వేడ్స్' సినిమా చేస్తున్నప్పుడు మళ్లీ కలిశాం. కొన్ని కూల్ డ్రింక్ యాడ్స్ చేస్తూ దగ్గరయ్యాం. 'లగాన్' చేసిన 3-4 ఏళ్ల వరకు మేమిద్దరం కనీసం టచ్‌లో కూడా లేము. ఇంకా చెప్పాలంటే 'లగాన్' షూటింగ్ టైంలో ఒకటో రెండుసార్లు మాట్లాడి ఉంటా అంతే! 2004లో మేము డేటింగ్ మొదలుపెట్టాం. కానీ చాలామంది 'లగాన్' టైంలోనే దగ్గరయ్యామని.. ఆమిర్, రీనాకు విడాకులు ఇచ్చేయాడానికి నేనే కారణమని అంటున్నారు. కానీ అదంతా అబద్ధం' అని కిరణ్ రావు చెప్పుకొచ్చింది. లగాన్ సినిమా 2001లో రిలీజైంది. ఇది వచ్చిన తర్వాత ఏడాది తర్వాత అంటే 2002లో ఆమిర్ ఖాన్.. తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చేశాడు. 2005లో దర్శకురాలు కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమిర్, తన తొలి భార్యకు విడాకులు ఇవ్వడానికి రీనానే కారణమనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు: మహేశ్ బాబు) -
అంబానీ ప్రీవెడ్డింగ్.. త్రీ ఖాన్స్‌కు భారీగా పారితోషికం?!
బాలీవుడ్ సెలబ్రిటీలందరినీ ఒక్కచోటకు చేర్చడం.. అది కూడా బస్సెక్కించి మరీ ఈవెంట్‌కు తీసుకురావడం ఒక్క అంబానీకే సాధ్యమైంది. తారలు సైతం తమ ఇంటి పెళ్లిలాగే భావించి అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో తెగ సందడి చేశారు. ఆటపాటలతో అలరించారు. అయితే అందరినీ కట్టిపడేసిన అంశం ఏదైనా ఉందా? అంటే త్రీఖాన్స్ డ్యాన్స్ చేయడమే! స్టేజీపై డ్యాన్స్.. ఎప్పుడూ బిజీగా ఉండే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్.. అన్నదమ్ముల్లాగా కలిసి డ్యాన్స్ చేయడంతో అభిమానులంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఇందుకోసం డబ్బులు కూడా బాగానే తీసుకుని ఉండొచ్చంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరితో కలిసి స్టెప్పేసిన రామ్‌చరణ్‌కు కూడా ఎంతో కొంత ఇచ్చే ఉంటారని ఎవరికి వారు అభిప్రాయపడుతున్నారు. కానీ బీటౌన్‌లో మాత్రం ప్రచారం మరోలా ఉంది. చరణ్‌తో పాటు ఈ ఖాన్స్ త్రయానికి డబ్బులే ఇవ్వలేదట! సంతోషంతోనే.. 'వారిని ఒకే స్టేజీపైకి తీసుకురావాలని అప్పటికప్పుడు అనుకున్నారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అంబానీ అంత గ్రాండ్‌గా ఆతిథ్యం ఇచ్చినప్పుడు అతిథులు డబ్బులు అడగ్గలరా? ఆ హీరోలు సంతోషంతో అలా డ్యాన్స్ చేశారంతే.. కానీ డబ్బులు మాత్రం తీసుకోలేదు' అని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంబానీ ఇచ్చిన ఆతిథ్యాన్ని మెచ్చిన హీరోలు ఫ్రీగా డ్యాన్స్ చేశారన్నమాట! అయినా ఇది ప్రీవెడ్డింగ్ కాబట్టి డిమాండ్ చేయలేదేమో.. పెళ్లికి అసలు, వడ్డీ.. అంతా కలిపి అడుగుతారని.. అప్పటిదాకా ఓపిక పట్టండని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #RamCharan kaha hai tu.. They are treating him like his own. How beautiful 😍. pic.twitter.com/s7hXwrBP6N — अपना Bollywood🎥 (@Apna_Bollywood) March 3, 2024 చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019