ఆర్థిక క్రమశిక్షణ లేక చాలామంది విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. కొన్ని చిట్కాలు పాటించి డబ్బు వెనకేసుకోండి.

ఉద్యోగం వచ్చిన వెంటనే క్రెడిట్‌ కార్డు ఇస్తామంటూ బ్యాంకులు ఫోన్లు చేస్తాయి. చాలామందికి ఖర్చులు పెరగడానికి క్రెడిట్‌ కార్డు ఒక కారణం.

ఒకవేళ క్రెడిట్‌కార్డు వాడినా బిల్లు ఒకేసారి చెల్లించాలి.

ఆదాయానికి తగిన ఖర్చుల నిర్వహణకు బడ్జెట్‌ కేటాయించుకుని పాటించాలి.

నెలాఖరు వరకు నిత్యం డబ్బు అవసరమవుతుంటే ఆర్థిక ప్రణాళికను సమీక్షించుకోవాలి.

చాలామంది నెలవారీ ఖర్చులు చేసిన తర్వాత మిగిలిన దాంతో పొదుపు చేస్తారు. కానీ ముందు పొదుపు తర్వాతే ఖర్చు.

మీ ఆదాయంలో కనీసం 20 శాతం పొదుపు చేసేందుకు ప్రయత్నించాలి.

అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవడం మర్చిపోవద్దు. ఊహించని ఖర్చుల నుంచి ఇది కాపాడుతుంది.

కనీసం మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపోయే డబ్బును సమకూర్చుకోవాలి.

ఉద్యోగం రాగానే ఆలస్యం చేయకుండా ఆరోగ్య, జీవిత బీమా తప్పకుండా తీసుకోవాలి.